Big Shcok to YCP: సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఏంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. పాలన సౌలభ్యం కోసమంటూ ఈ ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వాలంటీర్ల (Volunteers) వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ల ద్వారానే.. అన్ని పనులు కొనసాగుతున్నాయి. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించడంతో.. ఏం జరిగినా వారి కనుసన్నలోనే సాగుతోంది. అయితే కొందరు వైసీపీ నేతలు (YCP Leaders) వాలంటీర్లపై విమర్శలు చేస్తున్నా.. వచ్చే ఎన్నికలకు వారే ఉపయోగపడతారనే అంచనాలోనే కొందరు నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్కార్ కు షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం.. చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఎం.కె. మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికల కార్యక్రమాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలి అని స్పష్టం చేశారు. దీనిపై జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఎం.కె. మీనా ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే ఎవరైనా అలాంటి పనులు అప్పగిస్తే పక్కన పెట్టాలని సూచించారు.
ముఖ్యంగా ఓటర్ల నమోదులో వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దన్నారు. ఓటర్-ఆధార్ అనుసంధానంలోనూ వాలంటీర్లను వినియోగించ వద్దని స్పష్టం చేశారు. అలాగే అభ్యర్థులకు వాలంటీర్లు ఏజెంట్లుగా ఉండకూడదని స్పష్టం చేశారు. అలా ఎవరైనా చేస్తే చర్యలు తీసుకోవాలని ఎం.కె. మీనా ఆదేశించారు.
ఇదీ చదవండి : వైసీపీని తాకిన ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఎంపీ నివాసంలో తనిఖీలు
గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లను ఎన్నికలకు సంబంధించి.. అన్ని రకాల విధుల నుంచి దూరంగా ఉంచాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఏ అభ్యర్థి తరఫున వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా ఉండకూడదని తెలిపింది. ప్రభుత్వ వేతనం తీసుకుంటున్నందున వారిని భాగస్వాములను చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.
అలాగే ఓటర్ స్లిప్పుల పంపిణీ, పోలింగ్ ఏర్పాట్లు, పోలింగ్ విధులు, ఓటర్ల నమోదు, తొలగింపు, చేర్పులు, ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాల ఎంపిక, ఓట్ల లెక్కింపు వంటి పనుల్లో వాలంటీర్లు పాల్గొనరాదని ఎన్నికల సంఘం సూచించింది. అటు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు కూడా వాలంటీర్లకు ఎలాంటి విధులు అప్పగించరాదని ఆదేశించింది.
ఇదీ చదవండి : చంద్రబాబు సంచలన నిర్ణయం.. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టిక్కెట్లు.. కారణం ఇదే
శుక్రవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో సమావేశం సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా ఈ ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవే..
1. గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లను ఎలక్షన్స్‌కు సంబంధించిన అన్ని రకాల విధుల నుంచి దూరంగా ఉంచాలి
2. ఏ అభ్యర్థి తరఫున కూడా వాలంటీర్స్ పోలింగ్ ఏజెంట్లుగా ఉండకూడదు
3. ఓటరు స్లిప్పుల పంపిణీ, పోలింగ్ ఏర్పాట్లు, పోలింగ్ విధులకు దూరంగా ఉండాలి
4. ఓటర్ల నమోదు, తొలగింపు, చేర్పులు, మార్పులు, ఓటర్ల జాబితా ప్రచురణ చేయకూడదు
5. పోలింగ్ కేంద్రాల ఎంపిక, ఓట్ల లెక్కింపు వంటి పనుల్లో వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదు
6. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు వాడలంటీర్లకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులూ అప్పగించరాదు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Gram volunteer, Ycp