హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Telugudesam: గెలుపుపై నమ్మకం ఉన్నచోట సైకిల్ కు పంక్చర్.. కీలక నేత రాజీనామా

Telugudesam: గెలుపుపై నమ్మకం ఉన్నచోట సైకిల్ కు పంక్చర్.. కీలక నేత రాజీనామా

టీడీపీకి బిగ్ షాక్

టీడీపీకి బిగ్ షాక్

Telugudesam Party: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి.. ప్రధాన పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఓ నియోజక వర్గంలో.. టీడీపీ కీలక నేత రాజీనామా కలకలం రేపుతోంది. కచ్చితంగా గెలిచే సీటు అనుకున్న చోట కీలక నేత రాజీనామా.. అధిష్టానానికి షాకే అని చెప్పాలి.

ఇంకా చదవండి ...

Telugudesam: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)  రాజకీయాల్లో రోజుకో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటూనే ఉంది. పార్టీకి చెందిక కీలక నేతలు కొందరు.. సంచలన నిర్ణయాలతో అధినేతలకు షాక్ ఇస్తున్నారు. ఆ దారిలోనే ఇప్పుడు దర్శి నియోజకవర్గం సైతం.. అనూహ్య పరిణమాలతో వార్తల్లో నిలుస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా తెలుగు దేశం (Telugudesam) పరిస్థితి చూసుకుంటే.. దర్శి (Darsi)నియోజకవర్గంలో చాలా బలంగా కనిపిస్తోంది.. అసెంబ్లీ ఎన్నిల్లో టీడీపీ (TDP) గెలిచే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్న నియోజకవర్గాల్లో దర్శి ఒకటి.. దర్శి నియోజకవర్గంలో టీడీపీ. నిజానికి 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తరువాత.. అక్కడకక్కడ పుంజుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే వైసీపీ (YCP) అధికార పార్టీ వ్యూహాలుతో.. టీడీపీకి పుంజుకోవడానికి అంతగా అవకాశాలు రావడం లేదు. దానికి తోడు ఆ మధ్య జరిగిన పైగా పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. దీంతో చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి అభ్యర్థులే లేరనే ప్రచారం ఉంది.. కానీ దర్శి మాత్రం అందుకు భిన్నం.. వైసీపీ గాలిలోనూ.. స్థానిక ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ సత్తా చాటింది. అందుకు కారణం అక్కడి టీడీపీ నేతల సమన్వయమే..

దర్శిలో వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరగడం కూడా టీడీపీకి కలిసొస్తుంది. దర్శి లో టీడీపీ పుంజుకోవడానికి అది కూడా ఒక కారణం. ఇక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరగడం, అలాగే టీడీపీ ఇంచార్జ్ పమిడి రమేష్.. నియోజకవర్గ స్థాయిలో కష్టపడి పనిచేయడంతో దర్శిలో టీడీపీ రేసులోకి వచ్చింది. దర్శిలో కీలకమైన శిద్ధా రాఘవరావు, కదిరి బాబూరావు లాంటి వారు టీడీపీని వదిలి వెళ్ళిన సరే రమేష్ మాత్రం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ వచ్చారు.

సీనియర్ల సపోర్ట్ తో దర్శి మున్సిపాలిటీలో ఊహించని విధంగా టీడీపీని గెలిపించుకున్నారు. ఇలా మున్సిపాలిటీని గెలుచుకున్న టీడీపీ.. వచ్చే ఎన్నికల్లో దర్శి సీటులో గెలవడం కూడా ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఇలా పార్టీ ఫుల్ జోష్ లో ఉన్న సమయంలో ఇంచార్జ్ రమేష్ పార్టీకి షాక్ ఇచ్చారు.. పార్టీ అధిష్టానం తనని గుర్తించడం లేదని చెప్పి..రమేష్ పార్టీని వీడారు. తాను ఎంత కష్టపడినా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గుర్తించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసి…టీడీపీకి రాజీనామా చేసి..దర్శిలోని పార్టీ ఆఫీసుకు తాళం కూడా వేసేశారు.

ఇదీ చదవండి : సొంత సామాజిక వర్గానికే ఓటు.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో తొలిసారి వైసీపీ.. నిర్ణయానికి కారణం ఇదే

ఇక్కడ సీటు కేటాయించే విషయంలో క్లారిటీ లేకపోవడం వల్లే రమేష్ పార్టీని వదిలేశారని తెలుస్తోంది. ఇప్పటికే దుబాయికి చెందిన సుబ్బారావు.. బాలయ్యతో ఉన్న సాన్నిహిత్యంతో దర్శి టికెట్ కోసం ట్రై చేస్తున్నారట. ఇటు రమేష్ కూడా దర్శి టికెట్ రేసులో ఉన్నారు. ఇక ఈ విషయంలో అధిష్టానం క్లారిటీ ఇవ్వట్లేదు.. దీంతో రమేష్ అసంతృప్తికి గురై… పార్టీని వదిలారు. రమేష్ వీడటం దర్శిలో టీడీపీకి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP

ఉత్తమ కథలు