హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Big Shock to TDP: టీడీపీకి బిగ్ షాక్.. త్వరలోనే జనసేనలో చేరనున్న కీలక నేత..

Big Shock to TDP: టీడీపీకి బిగ్ షాక్.. త్వరలోనే జనసేనలో చేరనున్న కీలక నేత..

టీడీపీకి బిగ్ షాక్

టీడీపీకి బిగ్ షాక్

Big Shock to TDP: ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశానికి బిగ్ షాక్ తగలనుందా..? ఆ పార్టీ కీలక నేత జనసేన లో చేరేందుకు సిద్ధమయ్యారా..? అందుకు పవన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. మరి ఈ పరిణామం పొత్తులపై పడే అవకాశం ఉండదా..?

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Big Shock to TDP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జంపింగ్ జపాంగ్ లు మొదలు కానున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొంది.. మళ్లీ అధికారంలోకి రావాలని ఆశిస్తున్న ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party)కి ఊహించని షాక్ తగలనుందా..? ఆ పార్టీ కీలక నేత.. కాపు సామాజిక వర్గ ప్రముఖ ప్రతినిధి వంగవీటి రాధా (Vangaveeti Radha) జనసేన (Janasena) లోకి వెళ్లనున్నారు. ఇప్పటికే ఆయనకు జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

  పవన్ కళ్యాణ్ త్వరలో విజయవాడలో భారీ బహిరంగ నిర్వహించనున్నారు. ఆ సభలో జనసేనాని సమక్షంలో వంగవీటి రాధ పార్టీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చేరికలు కేవలం రాధకు మాత్రమే పరిమితం కాదని తెలుస్తోంది. ఆయనతో పాటు.. కొందరు ముఖ్య నేతలు.. వంగవీటి అనుచరులు జనసేనలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

  వంగవీటి మోహన రంగా కుమారుడిగా.. కాపు సమాజిక వర్గ ప్రతినిధిగా విజయవాడలో రాధాకృష్ణకు మంచి పట్టు ఉంది. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న ఆయన.. త్వరలోనే జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అటు వంగవీటి రాధా వర్గంగానీ, జనసేన వర్గాలు గానీ అధికారికంగా ప్రకటించలేదు.

  ఇదీ చదవండి : చంద్రబాబు పై 420 కేసు పెట్టాలి.. ఒకటే రాజధానిగా అమరావతి సాధ్యం కాదన్న సీఎం జగన్

  ఆ మధ్య జనేసేన నేత నాదెండ్ల మనోహర్.. జులై 1వ తేదిన వంగవీటి రాధా నివాసానికి వెళ్లారు. అప్పుడు సుమారు 45 నిమిషాల పాటు వారిద్దరి మధ్య చర్చలు జరిపారు. అప్పటి నుంచే ఆయన జనసేనలో చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. అయితే నాదేండ్ల మనోహర్ మాత్రం.. మర్యాదపూర్వకంగానే కలిశాను అన్నారు. తనతో ఉన్న పరిచయం కొద్దీ కలిసి.. టీ తాగి మాట్లాడుకున్నామన్నారు.

  ఇదీ చదవండి : డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రాజీనామా.. కారణం ఏంటంటే..?

  అయితే అప్పుడే వారిద్దరి మధ్య పార్టీ మార్పు విషయంపై చర్చ జరిగిందని.. ఆయన మనసులో ఏముంది.. పవన్ ఎలాంటి హామీ ఇస్తారు అన్నదానిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఆ తరువాత నాదెండ్ల మనోహర్ సూచనతో.. పవన్ కళ్యాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై వంగవీటి రాధ అధికారంగా ప్రకటన చేస్తారో లేదో చూడాలి.

  ఇదీ చదవండి : నిజమే టీడీపీ నుంచే వచ్చాం.. నాని భాష సరైందే..? లోకేష్ ను కొట్టిస్తానంటూ మంత్రి రోజా వార్నింగ్

  కృష్ణా జిల్లాలో.. ప్రధానంగా విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో వంగ‌వీటి కుటుంబం ముద్ర బలంగా ఉంది. కాపు సామాజిక వర్గంలో వంగ‌వీటి రాధాకు అనుచరగణం ఎక్కువగా ఉంది. పదవిలో ఉన్నా, లేకున్నా దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో రంగా కుటుంబం రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది. గత ఎన్నికలకు ముందు వంగవీటీ రాధా.. టీడీపీలో చేరారు. కానీ, టీడీపీ ఘోర పరాజయం పాలైంది. ప్రస్తుతం రాజకీయాల్లో వంగవీటి రాధా పెద్దగా యాక్టివ్‌గా లేరు. అప్పటి నుంచి ఆయన వైసీపీలో మళ్లీ చేరుతారని.. జనసేనలో కర్చీఫ్ వేసుకున్నారనే ప్రచారం జరుగుతూనే ఉంది.

  ఇదీ చదవండి : భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు రద్దు.. ఎందుకంటే..?

  ఒకవేళ నిజంగా వంగవీటి రాధా జనసేనలో చేరితే.. ఆ ప్రభావం రెండు పార్టీల పొత్తులపై పడే అవకాశం ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రచారం ఉంది. ఇలాంటి సమయంలో టీడీపీ నేత జనసేనలో చేరితే.. పొత్తుల అంశానికి బ్రేకులు పడినట్టే..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Janasena, Pawan kalyan, TDP, Vangaveeti Radha

  ఉత్తమ కథలు