హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YCP Politics: గ్యాప్ తీసుకోలేదు.. వచ్చిందంతే..? ఆయనకు బిగ్ షాక్.. పంతం నెగ్గించుకున్న విజయసాయి

YCP Politics: గ్యాప్ తీసుకోలేదు.. వచ్చిందంతే..? ఆయనకు బిగ్ షాక్.. పంతం నెగ్గించుకున్న విజయసాయి

విజయసాయి రెడ్డి, వైఎస్ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి (File)

విజయసాయి రెడ్డి, వైఎస్ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి (File)

YCP Politics: ఆయన పని అయిపోయింది అన్నారు. పార్టీ నుంచి పక్కన పెడుతున్నారన్నారు. మంత్రి వర్గ కూర్పులో ఆయన మాట చెల్లలేదని ప్రచారం జరిగింది. కేవలం పార్టీ అనుబంధ సంఘాలకే పరిమితం చేశారని వార్తలు వినిపించాయి. కానీ అనూహ్యం జరిగింది. రాత్రికి రాత్రి విజయసాయి బౌన్స్ బ్యాక్ అయ్యారు.. రీజనేంటి అంటే..?

ఇంకా చదవండి ...

YCP Politics:  వైసీపీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) .. పార్టీలో నెంబర్ వన్ అయితే.. ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) నెంబర్ టూ..  కానీ ఇది ఒకప్పుడు.. ప్రభుత్వ సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishana reddy)  నియమించినప్పటి నుంచి..  విజయసాయికి ప్రాధాన్యంత తగ్గుతూ వచ్చింది. మొదట ఉత్తరాంధ్ర వరకే పరిమితం అయ్యారు. ఆ తరువాత విశాఖ జిల్లా (Visakha District) వరకే ఆయన బాధ్యతలను పరిమితం చేశారు. అటు ఢిల్లీ (Delhi) లో వ్యవహారాలు కూడా ఆయనే చేసుకునే వారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ వ్యవహారాలు.. నిర్ణయాల్లో ఆయనను పట్టించుకోవడం లేదనే ప్రచారం జరిగింది. ఇటీవల ఆయన్ను పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలు అప్పచెప్పారు. పార్టీ బాధ్యతల నుంచి తప్పించడానికే ఆ పదవి ఇచ్చారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరిగింది. దీనికి తోడు ఇటీవల కేబినెట్ కూర్పులో ఆయన మాట ఎక్కడా వినిపించలేదు. అంతా సీఎం జగన్, సజ్జల మాత్రమే చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయనను సీఎం పక్కన పెట్టారనే ప్రచారం జరిగింది.

అయితే ఏమైందో ఏమో కానీ.. ఎంపీ విజయసాయి రెడ్డి బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఆధిపత్య పోరు లో విజయసాయిరెడ్డి రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. ఆయనపై నమ్మకం ఉంచి సీఎం జగన్ ఇకపై పార్టీ వ్యవహారాలు చుసుకోవాలని విజయసాయి రెడ్డిని ఆదేశించారు. సజ్జల నుండి విజయసాయిరెడ్డి కి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. అంటే ఇకపై ఎమ్మెల్యే,  మీడియా కోర్దినేషన్ బాధ్యతలు మాత్రమే సజ్జల చూసుకోనున్నారు.  ఇకపై విజయసాయి రెడ్డికి అన్నీ రీజినల్ కోర్దినేటర్ల బాధ్యత ,జిల్లాల ఇంచార్జ్ ల బాధ్యతలు చూసుకోనున్నారు. ఈ మేరకు అధినేత ఆదేశాలు కూడా జారీ చేశారు.   

ఇదీ చదవండి: చేతులే కలిశాయి.. చూపులు కలిసేది ఎప్పుడో..? అనిల్ ఇంటికి వెళ్లిన మంత్రి

నిన్నటి వరకు సజ్జలకు పార్టీ పరంగా మరిన్ని బాధ్యతలను అప్పజెప్పారు సీఎం. గతంలో కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల స్థానంలో కర్నూలు, నంద్యాల బాధ్యతలను అప్పగించారు. ఈ బాధ్యతలను సజ్జల, బుగ్గన సంయుక్తంగా చూడనున్నారు. దానితో పాటు ప్రాంతీయ సమన్వయకర్తల, పార్టీ జిల్లా అధ్యక్షుల కో–ఆర్డినేటర్‌గా సజ్జలకు బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. దీంతో పార్టీలో సజ్జలకు మరింత ప్రాధాన్యం పెరుగుతుందని.. అదే సమయంలో విజయసాయి రెడ్డికి ప్రాధాన్యత తగ్గుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరిగింది. దీనిపై విజయసాయిరెడ్డి స్వయంగా స్పందించారు. ప్రాంతీయ పార్టీలలో అధినేత ఆదేశాలను పాటించడమే శిరోధార్యమని ఆయన వ్యాఖ్యానించారు. నాకు ఇది కావాలి, ఇది వద్దు అనే ప్రస్తావన ఎక్కడా రాకూడదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఛార్టెడ్ అకౌంటెంట్ అయిన తనకు జగన్ చాలా అవకాశాలను ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అధినేత ఇచ్చిన బాధ్యతలు నేరవేర్చడమే తన కర్తవ్యమని విజయసాయిరెడ్డి వెల్లడించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Sajjala ramakrishna reddy, Vijayasai reddy

ఉత్తమ కథలు