Breaking News: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కి మరో షాక్ ఇచ్చారు ఏపీ పోలీసులు.. ఇంతకాలం న్యాయస్థానాల ద్వారా విచారణను వాయిదా వేసుకుంటూ వస్తున్న.. ఆయన్ను ఇవాళ విచారించాలని ఏపీ సీఐడీ (AP CID) పోలీసులు నిర్ణయించారు. ఇందులో భాగంగా దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో నేడు విచారణకు రావాలి అంటూ ఆదేశాలిస్తూ నోటీసులు జారీ చేశారు. మరి దీనిపై రఘురామ ఎలా స్పందిస్తారో చూడాలి.. ఒకవేళ విచారణకు వెళ్తే అరెస్ట్ చేస్తారనే అనుమానాలు తనకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విచారణకు హాజరవ్వాలా.. వద్దా.? వెళ్లకుంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలని ఆలోచన చేస్తున్నారు. కానీ సీఐడీ పోలీసులు మాత్రం తప్పక హాజరుకావాల్సిందే అంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతో తెలుగు రాజకీయాల్లో ఈ అంశం ఉత్కంఠగా మారిందది.
అయితే గతంలో లానే తనను కేవలం హైదరాబాద్ (Hyderabad) లో విచారించేలా ఆదేశాలివ్వాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ తీర్పు ప్రకారమే ఇప్పుడు ఆయన్ను విచారించేందుకు ఏపీ సీఐడీ ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ విచారణకు ఆయన విచారణకు వస్తారా.? లేదా.? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజాగా ఈ నోటీసులపై రఘురామకృష్ణరాజు స్పందించారు. విచారణకు హాజరుకావాలంటూ ఏపీ సీఐడీ అధికారులు తనకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. దీనిపై ఈనెల 16న తాను సమాధానం ఇచ్చానన్నారు. హైదరాబాద్‌లో విచారణకు తనతో పాటు రెండు ప్రముఖ ఛానళ్లకు కూడా నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఉన్నాయన్నారు. కానీ తన ఒక్కడికే నోటీసులు ఇచ్చారని.. ఇది కోర్టు ధిక్కరణ అవుతుందని తెలిపారు. ఇదే విషయాన్ని ఏపీ సీఐడీకి ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నట్లు చెప్సారు.
ఇదీ చదవండి : రెండేళ్లుగా లాక్‌డౌన్‌లోనే కుటుంబం.. కారణం తెలిసి షాక్ అయిన స్థానికులు
ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కల్గించేలా మీడియాలో వ్యాఖ్యలు చేసిన కేసులో రఘురామను విచారణకు పిలిచారు. దిల్కుషా గెస్ట్ హౌస్ లో విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏపీ సీఐడీ అధికారులు 2021 మే 14న రఘురామపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారని 124-ఏ , Ipc 153- బీసెక్షన్ కింద సీఐడీ కేసునమోదు చేసింది. ఐపీసీ సెక్షన్ 505 కింద బెదిరింపులకు పాల్పడటం, ఐపీసీ సెక్షన్ 120-B కింద దురుద్దేశపూర్వకంగా కుట్రకు పాల్పడ్డారనే అభియోగాల కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
రఘురామ ఆ వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వైద్య పరీక్షలపై పిటిషన్ దాఖలు చేయగా.. వైద్య పరీక్షల కోసం ఆయన్ను సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని.. వైద్య పరీక్షల పర్యవేక్షణకు జ్యుడీషియల్ అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఆ వెంటనే ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించి కోర్టుకు నివేదికను అందించారు. అలాగే బెయిల్ పిటిషన్‌పై తీవ్ర వాదోపవాదనల తర్వాత కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది. అయితే ఇప్పుడు అలాంటి పరిస్తితులు తలెత్తుతాయని రఘురామ రాజు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Police, MP raghurama krishnam raju