Home /News /andhra-pradesh /

AP POLITICS BIG SHOCK TO RAGHU RAMA KRISHNA RAJU AP HIGH COURT GREEN SIGNAL TO ENQUIRY AT HYDERABAD NGS GNT

RRR: వైసీపీ రెబల్ ఎంపీకి ఊహించని షాక్.. సీఐడీ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ కండిషన్ ఏంటంటే?

రఘురామకృష్ణంరాజు (ఫైల్ ఫోటో)

రఘురామకృష్ణంరాజు (ఫైల్ ఫోటో)

RRR: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకు కష్టాలు తప్పవా... సీఐడీ విచారణను ఆపేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ తాజాగా కోర్టు ఆయనకు షాక్ ఇచ్చింది. సీడీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అయితే విచారణ సమయంలో ఓ కండిషన్ పెట్టింది. ఏంటంటే..?

    RRR: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇంత కాలం వరుస షాక్ లు ఇచ్చారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రఘురామకృష్ణంరాజుకూ.. దీంతో ప్రభుత్వానికి.. సొంత పార్టీ ఎంపీకి మధ్య వైరం పెరుగుతూ వచ్చింది. అధినేత జగన్, పార్టీ పెద్దలకు ఆయన కంటిలో నలుసులా మారారు. ఇటు న్యాయస్థానాల ద్వారా ఇంతకాలం విచారణకు దూరంగా ఉన్నారు.. అటు రాజకీయంగా ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం అండ చూసుకున్నారు. ఆయన ఎంపీ పదవికి సస్పెండ్ చేయాలని వైసీపీ చేసిన ప్రయత్నాలను అన్నింటినీ ఆయన తిప్పి కొట్టారు. అయితే ఇలా చాలా విషయాల్లో పైచేయి సాధిస్తూ వచ్చిన ఆయనకు తాజాగా ఓ షాక్ తగిలింది. ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే రఘురామరాజు గతంలో చేసిన విద్వేష వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకున్న సీఐడీ రాజద్రోహం సహా పలు కేసులు నమోదుచేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయడంతో మిగతా కేసుల్లో విచారణపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఏపీ హైకోర్టు ఇవాళ ఆ ఉత్కంఠకు తెరదించింది.

    ఏపీలో వైసీపీ తరఫున ఎన్నికల్లో గెలిచి ఆ పార్టీపైనే.. ప్రస్తుతం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అధినేత అంటే గౌరవం అంటూనే.. సీఎం విధానాలను తప్పు పడుతున్నారు. రాష్ట్రంలో విపక్షాల కంటే.. వైసీపీ పార్టీ పెద్దలపైనా.. ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు రఘురామ. అయిత ఇంతలా ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్న ఆయనకు.. ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీఐడీ గతంలో తనపై నమోదు చేసిన కేసులపై ఇప్పటికీ న్యాయపోరాటం చేస్తున్న రఘురామరాజుకు ఇవాళ హైకోర్టు షాక్ ఇచ్చింది. గతంలో రాజద్రోహం కేసుల్లో విచారణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నివ్వగా.. ఇప్పుడు హైకోర్టు ఆయనకు వ్యతిరేకంగా నమోదైన మిగతా కేసులపై మరో కీలక తీర్పు వెలువరించింది.

    తాజాగా తీర్పుతో వైసీపీ రెబల్ ఎంపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే తనపై సీఐడీ విచారణకు అనుమతి, సీఐడీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజద్రోహం సెక్షన్‌ మినహా మిగిలిన సెక్షన్ల కింద రఘురామ కృష్ణరాజును విచారించుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వర్గాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా రఘురామ వ్యాఖ్యలు చేశారని సీఐడీ సుమోటోగా ఆయనపై కేసు నమోదు చేసింది. అయితే రాజద్రోహం నేరానికి సంబంధించి కేసులపై పిటిషనర్‌ రఘురామ తరఫున బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. రఘురామ వాదనతో ఏకీభవించని హైకోర్టు రాజద్రోహం (ఐపీసీ 124ఎ) చట్టాన్ని సుప్రీంకోర్టు నిలుపుదల చేసిన నేపథ్యంలో పిటిషనర్‌పై ఏపీ సీఐడీ పోలీసులు నమోదు చేసిన మిగిలిన సెక్షన్ల విషయంలో దర్యాప్తు పేరుతో పిలిచి ఇబ్బందులకు గురి చేయకుండా నిలువరించాలని రఘురామ ఈ పిటిషన్ లో కోరారు.

    ముఖ్యంగా తన పిటిషనర్‌ ఏదైనా పర్యటనకు సిద్ధమవుతున్న సమయంలో అడ్డుకోవడం కోసం ఉద్దేశపూర్వకంగా సీఐడీ నోటీసులిచ్చి విచారణకు హాజరుకావాలని కోరుతోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని, అభిప్రాయాలను వ్యక్తం చేస్తే రాజద్రోహం కింద సీఐడీ సుమోటోగా కేసు పెట్టడం సరికాదని ఆయన గట్టిగా తన వాధనలు వినిపించారు. మరోవైపు సెక్షన్‌ 124ఏ అమలును సుప్రీంకోర్టు ఇటీవల నిలుపుదల చేసిన నేపథ్యంలో.. ఆ సెక్షన్‌ విషయంలో తాము ముందుకెళ్లబోమని ప్రభుత్వం తరఫున ఏజీ కోర్టుకు స్పష్టం చేశారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Raghu Rama Krishnam Raju, RRR

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు