హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Janasena office for sale: ఏపీలో అమ్మకానికి జనసేన ఆఫీస్.. ధర ఎంతో తెలుసా? ఇదిగో ఫ్రూఫ్..!

Janasena office for sale: ఏపీలో అమ్మకానికి జనసేన ఆఫీస్.. ధర ఎంతో తెలుసా? ఇదిగో ఫ్రూఫ్..!

అమ్మకాని జనసేన

అమ్మకాని జనసేన

Janasena office for sale: ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అన్ని పార్టీలు వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆయా పార్టీ కార్యాలయాల్లో సందడి ఉంటుంది. కానీ అందరికీ షాకిస్తూ.. జనసేన ఆఫీస్ ఫర్ సేల్ అనే వ్యాపార ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.. అసలు ఎన్నికల ముందు ఆఫీసు సేల్ కు పెట్టడం ఏంటి అనుకుంటున్నారా..? ఇదిగో ఫ్రూఫ్..

ఇంకా చదవండి ...

Anna Raghu, Amaravathi , News18.

Janasena office for sale: అమ్మకానికి జనసేన ఆఫీస్ (Janasena Offfice).. ఏంట్రా ఇది అని జనసేన సైనికిలు షాక్ అయ్యే అవకాశం లేకపోలేదు.. ఎన్నికలకు తామాంతా సై అంటుంటే.. పార్టీ కార్యాలయం అమ్మాకానికి పెట్డడం ఏంటని..? అంతా షాక్ అవతున్నారు. ఈ వ్యాపర ప్రకటన చూడగానే.. పవన్ యాంటీ ఫ్యాన్స్ (Anti Pawan Fans).. వైసీపీ ఫాలోవర్స్ (YCP Followers) ఇక సోషల్ మీడియా (Social Media)లో తమ వ్యాఖ్యలకు పదును పెడుతున్నారు.. పార్టీని చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కు అమ్మేశారని.. ఇప్పుడు కార్యాలయాన్ని అమ్మేస్తున్నారని.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) కు ఎన్నికల్లో ఓడిపోతారని.. తెలిసిపోయిందని.. అందుకే ఆయన పార్టీని ఎత్తేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. అంతేకాదు ఆ ఎడ్వర్ టైజ్ మెంట్ లో.. భారీ ధరకు సేల్ పెట్టారు.. ఆసక్తి ఉన్నవారు వెంటనే కొనుగోలు చేయొచ్చని.. అలాగే ఆఫీసులు ఉండే సదుపాయాలను కూడా ఆ యాడ్ లో పోస్ట్ చేశారు. ఈ యాడ్ ను చూసిన వారు సైతం షాక్ అవుతున్నారు.. అయితే నిజంగానే పార్టీ కార్యాలయాన్ని పవన్ అమ్మకానికి పెట్టారా..? కేవలం కొందరు కావాలనే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారా..? వాస్తవం ఏంటి..?

ప్రస్తుతం జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా.. ప్రధాన ఫోకస్ మాత్రం ఆంధ్రప్రదేశ్ పైనే పెట్టారు పవన్ కళ్యాణ్.. ఇందులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీలో పార్టీని విస్తరించే క్రమంలో హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా మంగళగిరి (Mangalagiri) లో భారీ హంగులతో కట్టించిన ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. మంగళగిరిలో పవన్ సొంతంగా కోట్లు ఖర్చు పెట్టి మెరుగులు దిద్దిన ఈ రాష్ట్ర కార్యాలయాన్ని.. ఇప్పుడు కొందరు ఓలెక్స్ లో సేల్ కు పెట్టారు.. కావాలి అంటే ఇదే ప్రూఫ్..

తాజాగా సెకండ్ హ్యాండ్ వస్తువులు, స్థలాలు, ఆస్తులు, వాహనాలు అమ్మే యాప్ ఓఎల్.ఎక్స్.. ఆ వెబ్ సైట్ లో జనసేన ఆఫీస్ ఫొటోలు పెట్టి కొందరు ప్రబుద్దులు అమ్మకానికి పెట్టారు. సుంకర మనోహర్ అనే వ్యక్తి.. జనసేన ఆఫీస్ ఫొటోలను ఓఎల్ఎక్స్ లో పెట్టాడు. ఎర్రబలం, మంగళగిరి, ఆంధ్రప్రదేశ్’ అడ్రస్ లో ఈ సంస్థ ఉందని కింద వివరాలు పోస్ట్ చేశాడు. దీన్ని అమ్మకానికి పెట్టి ఏకంగా 100 కోట్ల రూపాయల ధను ఫిక్స్ చేయడం విశేషం..

ఇదీ చదవండి : ఏపీలో ముందస్తు ఎన్నికలు..? పొత్తులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి.. ఆయనేమన్నారంటే..?

పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టపడి.. కష్టపడడంతో.. పార్టీ కార్యాలయాన్ని 100 కోట్లకు బేరం పెట్టిన ఈ ప్రబుద్దుడి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంతకీ ఈ ‘సుంకర మనోహర్’ ఎవరు? ఇతడికి జనసేనతో ఏం సంబంధం? జనసేనలో సభ్యుడా? లేక ఎవరో ఆకతాయి చేసిన పనినా? అని అందరూ ఇప్పుడు ఆరా తీస్తున్నారు. కొందరైతే ఈ పోస్టును షేర్ చేసి మరీ ‘అరే ఎంట్రా ఇదీ?.. మా జనసేన కార్యాలయం అమ్మకానికి పెట్టడం ఏంట్రా’ అని నిలదీస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టుపై ఇప్పటికైనా జనసేన అధిష్టానం స్పందించాల్సి ఉంది. లేకుంటే రేపు పవన్ కళ్యాణ్ ఇంటిని కూడా అమ్మకానికి ఓఎల్.ఎక్స్ లో పెట్టినా పెట్టొచ్చు అంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Janasena, Mangalagiri, Pawan kalyan

ఉత్తమ కథలు