AP POLITICS BIG SHOCK TO MLA NANDAMURI BALAKRISHNA HIS PA DEPUTATION CANCEL BY AP GOVERNMENT NGS
Shock to Balayya: బాలయ్యకు ఏపీ సర్కార్ షాక్.. డిప్యూటేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు..
బాలయ్యకు సర్కార్ షాక్
Shock to Balayya: టాలీవుడ్ సీనియర్ యాక్టర్.. ఎమ్మెల్యే నందమూరి బాలయ్యకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఓ వైపు ఆయన డిమాండ్ చేసిన హిందూపురం రెవిన్యూ డివిజన్ ను పట్టించుకోలేదు.. ఇంతలోనే మరో షాకిచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?
Shock to Balayya: సినీ నటుడు, హిందూపురం (HIndupuram) ఎమ్మెల్యే బాలకృష్ణ (MLA Balakrishna) ఓ వైపు సినిమాల్లో దూకుడు పెంచుతూనే.. రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారు. గతంలో కంటే ఈ సారి నియోజకవర్గంపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. చిన్నసమస్య ఉన్నా.. నియోజకవర్గంలో వాలిపోతున్నారు. ఇటీవల కొత్త జిల్లా ఏర్పాటు నేపథ్యంలో హిందూపురం కోసం ఆందోళనల్లో కూడా పాల్గొన్నారు. మౌనదీక్ష కూడా చేశారు. అవసరమైతే జగన్ ను కలుస్తానని కూడా చెప్పారు. అయినా ఆయన డిమాండ్ నెరవేరలేదు.. ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం మరోషాక్ ఇచ్చింది అయనకు. అయితే ఈ సారి పీఏ రూపంలో ప్రభుత్వం ఈ షాక్ ఇచ్చింది. అయితే పిఏల ద్వారా ఇబ్బందుల్లో పడడం బాలయ్యకు ఇదే మొదటి సారి కాదు.. సినిమా, రాజకీయల్లో ఎదురైన సమస్యలను ఈజీగా పరిష్కరించుకుంటున్న ఆయనకు.. పీఏల బెడద మాత్రం తప్పడం లేదు. మొదటి నుంచి వారి నుంచే గందరగోళం తప్పడం లేదు.. తాజాగా ఏమైందంటే..?
ప్రస్తుతం బాలయ్య పీఏగా పనిచేస్తున్న బాలాజీ డిప్యూటేషన్ ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవల కర్ణాటక(Karnataka) సరిహద్దులోని బార్ అండ్ రెస్టారెంట్ లో పేకాట ఆడుతూ బాలాజీ పట్టుబడ్డారు. అంతేకాదు ఆయనతో పాటు ఆ పేకటో స్థానిక వైసీపీ నేతలు కూడా ఉన్నారు. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాలాజీని అరెస్టు చేశారు. తరువాత రిమాండ్‌కు తరలించారు. ఆయనపై విచారణ జరిపిన ప్రభుత్వం పీఏగా డిప్యూటేషన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
బాలాజీ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. ఆయనను పీఏగా నియమించుకునే అవకాశం బాలకృష్ణ అనుమతి కోరగా ప్రభుత్వం అంగీకరించింది. చాలా రోజుల నుంచి బాలకృష్ణ పీఏగా నియోజకవర్గంలో వ్యవహారాలన్నింటినీ ఆయన చూసుకుంటున్నారు. ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా.. పార్టీ నేతలతో మాట్లాడి అన్నా.. ఇతర విషయాల్లో అన్ని వ్యవహారాలు బాలాజీనే చూసుకుంటున్నారు. బాలయ్య అక్కడ ఇళ్లు తీసుకున్న ఎప్పుడూ ఉన్నది లేదు.. ఆ ఇంటినుంచే ఏపీ వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటారు. ఇంతలా బాలయ్య ఆయనపై ఆధారపడ్డారు.. కాన ఆయన మాత్రం వైసీపీ నేతలతో కలిసి పేకాట ఆడుతూ.. ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చారు. ఆ వివాదమే ఇప్పుడు ఆయన డిప్యుటేషన్ రద్దుకు కారణమైంది. దీంతో బాలయ్య మరోసారి పీఏ వేటలో పడకతప్పలేదు.
పేకాట ఆడుతూ బాలాజీ దొరికిపోయినప్పటికీ బాలకృష్ణ స్పందించలేదు. ఈ క్రమంలో పీఏగా ఆయనను అక్కడ కొనసాగించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలుపుతూ డిప్యూటేషన్ రద్దు చేసింది. ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి టీచర్‌గా విధులు నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బాలకృష్ణ పీఏల వ్యవహారశైలి వివాదాస్పదమైంది. మరి దీనిపై బాలయ్య ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే పీఏల తీరుతో బాలయ్య కాస్త మారినట్టు కనిపిస్తున్నారు. గతంలో పోల్చుకుంటే.. నియోజకవర్గానికి ఎక్కువగా వెళ్తున్నారు. సమస్యలు వచ్చిన వెంటనే స్పందిస్తున్నారు. అంతేకాదు చిన్న చిన్న శుభకార్యాలు ఉన్నా.. ఎవరైనా ఆహ్వానించిన మిస్ చేయరు. ఇటీవల పార్టీకి చెందిన మైనార్టీ నేత పెళ్లిక ఆహ్వానిస్తే.. మారువేషంలో వెళ్లి.. అభిమానులకు, కార్యకర్తలకు షాకి ఇచ్చారు.
ఇప్పటికే ఏపీలో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. అన్ని పార్టీ వ్యూహ ప్రతి వ్యూహాల్లో భాగమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా బాలయ్య గుర్తించి.. పీఏలను గుడ్డిగా నమ్మోద్దని స్థానిక నేతలు సూచిస్తున్నారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.