Home /News /andhra-pradesh /

AP POLITICS BIG SHOCK TO HOME MINISTER TANETI VANITHE IN HER OWN CONSTITUENCY IN EAST GODAVARI DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VSP

Shock to YCP: హోమంత్రికి ఊహించని షాక్.. కొవ్వూరులో టీడీపీ ఏకగ్రీవం..

మంత్రి తానేటి వనిత (ఫైల్)

మంత్రి తానేటి వనిత (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YSRCP) అధికారంలో ఉంది. ఈ మూడేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తూ వస్తోంది. మున్సిపల్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ, పరిషత్ ఎన్నికలతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లోనూ వైసీపీనే ఘన విజయం సాధించింది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YSRCP) అధికారంలో ఉంది. ఈ మూడేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తూ వస్తోంది. మున్సిపల్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ, పరిషత్ ఎన్నికలతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లోనూ వైసీపీనే ఘన విజయం సాధించింది. అలాగే సహకార సంఘాలు, అర్బన్ బ్యాంకులను కూడా అధికార పార్టీనే కైవసం చేసుకుంటూ వస్తోంది. ఇక మంత్రులు, ముఖ్యనేతలున్న ప్రాంతాల్లో అయితే వైసీపీ స్వీప్ చేస్తూ వస్తోంది. ఒక విధంగా ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. ఇటీవల తిరుపతి అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లోనూ వైసీపీ బలపర్చిన అభ్యర్థులే విజయం సాధించారు. ఇదిలా ఉంటే ఓ ఎన్నికలో మాత్రం వైసీపీకి షాక్ తప్పలేదు. పోటీ సంగతి అటుంచితే ప్రత్యర్థి పార్టీ ఏకగ్రీవం చేసుకుంది.

    తూర్పు గోదావరి జిల్లాలో హోంశాఖ మంత్రి తానేటి వనితకు చేదు అనుభవం ఎదురైంది. సొంత నియోజకవర్గమైన కొవ్వూరులో అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు అసలు కనిపించలేదు. 11 డైరెక్టర్ స్థానాలను టీడీపీ ఏకగ్రీవం చేసుకుంది. కొత్తగా ఎన్నికైన డైరెక్టర్లు టీడీపీ నాయకుడు, అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు మద్దిపట్ల శివరామకృష్ణను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. వరుసగా ఐదవసారి మద్దిపట్ల శివరామకృష్ణ బ్యాంక్ చైర్మెన్ బాధ్యతలు తీసుకున్నారు.

    ఇది చదవండి: ఆ వైసీపీ మహిళా ఎమ్మెల్యేకు ఈసారి నో టికెట్..? ఆమె కూడా ఫిక్సైపోయారా..?


    ఈ ఎన్నికల్లో టీడీపీని ఓడించాలని హోం మంత్రి తానేటి వనిత ముందుగానే స్థానిక వైసీపీ నేతలకు సూచించారు. ఐతే త్రిసభ్య కమటీ ద్వారా ఎన్నికలు వాయిదా వేసేందుకు వైసీపీ యత్నించినా.. టీడీపీ మాత్రం పక్కా వ్యూహంతో ముందుకెళ్లింది. దీంతో టీడీపీ సభ్యులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సాక్షాత్తూ హోం మంత్రి ఇలాకాలో ఇలా జరగడం వైసీపీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఎక్కడ తప్పు జరిగిందనేదానిపై విశ్లేషిస్తున్నట్లు సమాచారం.

    ఇది చదవండి: నవరత్నాలకు డబ్బులు నేనిస్తా..! పవన్ తమ్ముడికి తోడుగా ఉంటా..! కేఏ పాల్ బంపర్ ఆఫర్..


    ఇదిలా ఉంటే కొవ్వూరులో విజయంపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి పోటీనివ్వడం సంగతి పక్కనబెడితే ఇలాంటి సమయంలో ఏకగ్రీవం చేసుకోవడం ఓ బిగ్ విక్టరీగా ఆ పార్టీ నేతలు అభివర్ణిస్తున్నారు. హోం మంత్రి ఇలాకాలో వైసీపీకి షాకివ్వడంపై తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు.



    కొవ్వూరులో ఇదే జోరును భవిష్యత్తులోనూ కొనసాగిస్తామంటున్నారు. గతంలో కొవ్వూరు నియోజకవర్గం టీడీపీకి సిట్టింగ్ స్థానం. గత ఎన్నికల్లో కొవ్వూరులో టీడీపీ నుంచి ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పోటీ చేయగా.. వైసీపీ నుంచి తానేటి వనిత పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆమెకు మంత్రిపదవి దక్కింది. తొలుత స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన ఆమెకు సీఎం జగన్ హోం శాఖను అప్పగించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, East Godavari Dist, Ysrcp

    తదుపరి వార్తలు