హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vallabaneni Vamsi: ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టు నోటీసులు.. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎందుకో తెలుసా..?

Vallabaneni Vamsi: ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టు నోటీసులు.. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎందుకో తెలుసా..?

వల్లభనేని వంశీ (ఫైల్)

వల్లభనేని వంశీ (ఫైల్)

Vallabaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి షాక్ తగిలింది. ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా.. హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు అసలు కారణం ఏంటో తెలుసా..?

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Vallabaneni Vamsi: వల్లభ నేని వంశీ .. ఏపీలో రాజకీయ గురించి తెలిసిన వారెవరికీ పరిచయం అవసరం లేని పేరు. గత ఎన్నికల్లో టీడీపీ (TDP) నుంచి గెలిచినా.. ప్రస్తుతం వైసీపీ (YCP) తో కొనసాగుతున్నాయి. ఇంకా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోవడంతో ఆయన్ను తెలుగు దేశం (Telugu Desam) ఎంపీగానే పరిగణిస్తారు. కానీ ఆయన మాత్రం ప్రస్తుతం తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకంగా.. వైసీపీ తో కలిసి ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆయనకు ఊహించని షాక్ ఇచ్చింది ఏపీ హైకోర్టు (AP High Court) ..  వల్లభనేని వంశీ మోహ‌న్‌ (Vallbhaneni Vamsi Mohan) కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన గ‌నుల అక్ర‌మ తవ్వ‌కాల‌కు పాల్ప‌డుతున్నారంటూ దాఖ‌లైన ఓ పిటిష‌న్‌ను హైకోర్టు విచార‌ణ‌కు స్వీకరించింది. ఈ పిటిష‌న్ ఆధారంగానే వంశీకి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ అక్రమ తవ్వకాల ఆరోపణల కేసులో.. వంశీతో పాటు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ గ‌నుల శాఖ అధికారుల‌కు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిష‌న్‌పై త‌దుప‌రి విచార‌ణ‌ను హైకోర్టు 8 వారాల‌కు వాయిదా వేసింది. దీనిపై ఎమ్మెల్యే వంశీ ఎలా స్పందిస్తారో చూడాలి..

  2014 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా గ‌న్న‌వ‌రం నుంచి పోటీ చేసి విజయం సాధించిన వంశీ...2019 ఎన్నిక‌ల్లోనూ అదే పార్టీ త‌ర‌ఫున గ‌న్న‌వ‌రం నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారం చేప‌ట్ట‌డంతో మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో టీడీపీకి దూరంగా జరిగారు.. వైసీపీకి ద‌గ్గ‌ర‌య్యారు. కానీ ఇప్ప‌టికీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోవడంతో రికార్డుల ప్రకారం ఆయన టీడీపీ ఎమ్మెల్యే కిందకే లెక్కలోకి వస్తారు.

  ఈ కేసులో కోర్టు ఎలా ముందుకు వెళ్తుంది.. ఎలాంటి తీర్పి ఇస్తుంది పక్కన పెడితే.. ఈ అంశం ఇప్పుడు ఆయన ప్రత్యర్థులకు ఆయధం కానుంది. అదికూడా సొంత పార్టీలో ఉన్న ప్రత్యర్థులు ఇప్పుడు విమర్శల దాడిని పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా వైసీపీకే చెందిన నేతలు వల్లభనేని వంశీపై ఇవే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వచ్చినప్పటి నుంచి గన్నవరంలో వర్గ పోరు పీక్ కు చేరింది.

  ఇదీ చదవండి : జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీకి కారణం ఇదే..? కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

  వంశీని టార్గెట్ చేస్తూ ప్రత్యర్ధి నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు మొదటి నుంచి అవే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే వంశీకి వ్యతిరేకంగా నియోజకవర్గంలో హోరాహోరీ తలపడుతున్న ఈ రెండు వర్గాలు ఇప్పుడు ఎన్నికలకు ముందు వంశీకి చుక్కలు చూపించడానికి తాజాగా హైకోర్టు నోటీసులు అస్త్రంగా దొరికినట్టే. ముఖ్యంగా దుట్టా, యార్లగడ్డ వర్గాలు చేస్తున్న మట్టి తవ్వకాల ఆరోపణలు వంశీకి తలనొప్పిగా మారాయి. నియోజకవర్గంలో వంశీ యథేచ్చగా మట్టితవ్వకాలు చేస్తూ మాఫియాను పెంచి పోషిస్తున్నారని దుట్టా, యార్లగడ్డ వర్గాలు చేస్తున్న ఆరోపణలు వంశీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

  ఇదీ చదవండి : ప్రధాని మోదీతో ముగిసిన సీఎం భేటీ.. ఈ అరగంటలో ఏం చర్చించారంటే?

  ఇప్పుడు వారికి మరో అస్త్రం దొరికినట్టే అయ్యింది. తాజా హైకోర్టు నోటీసులతో మరిన్ని ఆరోపణలు చేసే అవకాశం ఉంది. మరి దీనిపై వంశీ ఎలా స్పందిస్తారో చూడాలి.. ఎందుకంటే ఇటి టీడీపీ నేతలు అవే ఆరోపణలు చేస్తున్నారు.. అటు సొంత పార్టీ నేతలు సైతం ఇదే ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP High Court, AP News, AP Politics, Vallabaneni Vamsi, Ycp

  ఉత్తమ కథలు