హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: మాజీ మంత్రి కొడాలి నానికి కేసీఆర్ షాక్.. ఏం జరిగిందంటే..?

AP Politics: మాజీ మంత్రి కొడాలి నానికి కేసీఆర్ షాక్.. ఏం జరిగిందంటే..?

మాజీ మంత్రి కొడాలి నానికి షాక్

మాజీ మంత్రి కొడాలి నానికి షాక్

Big Shock to Kodali Nani: గుడివాడ అంటే కొడాలి నాని.. అందుకే వరుసగా అక్కడ ఎమ్మెల్యేగా నెగ్గొస్తున్నారు. ఇప్పుడు అలాంటి అడ్డాల నానికి షాక్ తగిలిందా..? అది కూడా కేసీఆర్ కొత్త పార్టీ షాక్ తప్పదా అనే చర్చ మొదలైంది.. ఎందుకో తెలుసా?

  • News18 Telugu
  • Last Updated :
  • Gudivada, India

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati.

Big Shock to Kodali Nani: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)  రాజకీయాల్లో కొడాలి నాని (Kodali Nani) కి ప్రత్యేక స్థానం ఉంది. టీడీపీ (TDP)తో ప్రస్థానం మొదలైనా..? వైసీపీ (YCP) నేతగా.. మంత్రిగా ఆ క్రేజ్ ను రెట్టింపు చేసుకున్నారు. మాజీ మంత్రి అయినా.. మంత్రులతో సమాన గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) .. నారా లోకేష్ (Nara Lokesh) ను తిట్టడంలో ఆయన తరువాతే ఎవరైనా అనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గుడివాడ అంటే కొడాలి నాని అడ్డా అని చెప్పాలి. అందుకే వరుస విజయాలు సాధిస్తున్నారు. అయితే  ఓ వైపు ప్రభుత్వం వ్యతిరేకత.. దానికి తోడు వరుసగా ఎన్నిక అవుతున్నా.. అక్కడ పనులు ఏమీ జరగలేదని వ్యతిరేకత కాస్త ఉంటుంది. దానికి తోడు ప్రతిపక్షాలు కాస్త పుంజుకుంటున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఇదే సమయంలో కొడాలి నానికి మరో షాక్ తగలనుందా అని చర్చ మొదలైంది.

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని.. ఈ సారి గట్టి పోటీ ఎదుర్కోక తప్పదా..? తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే కొడాలి నాని ఏ విషయాన్నైతే ఖండించారో.. ఆ వెంటనే అదే అంశాన్ని సపోర్ట్ చేస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. అంటే నానీ అడ్డలో ఆయన్ను ధిక్కరించే గ్రూప్ సిద్ధమైందన్న చర్చ ఇప్పుడు గుడివాడలో జోరుగా చర్చ జరుగుతోంది.

అసలు విషయం ఏంటంటే..? తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ .. ఇటీవల జాతీయ పార్టీగా మారి బీఆర్ఎస్ గా పేరు మార్చుకుంది. దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందన్న చర్చ కూడా సాగుతోంది.  ఏపీలో బీఆర్ఎస్ మార్క్ కనిపిస్తుందా..? కేసీఆర్ హవా ఇక్కడ కూడా చూపిస్తారా అనేది హాట్ టాపిక్ గానే ఉంది.  అదే సమయంలో ఏపీకి చెందిన పలువురు నేతలు కూడా బీఆర్ఎస్ పై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : ట్రాక్టర్ నడిపిన మంత్రి? నగరిలో నవ్వుల పాలవుతున్నా అంటూ రోజా ఆడియో వైరల్

ఇటీవల బీఆర్ఎస్ పార్టీపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని కూడా స్పందించారు. రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ పై మాట్లాడిన ఆయన.. ఆంధ్రాలో కేసీఆర్ పార్టీకి ఆదరణ ఉండదన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం బాగానే ఉందని.. కొత్త పార్టీల అవసరం ఇక్కడ లేదన్నట్లు ఆయన కామెంట్ చేశారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కొడాలి నాని ఆ మాట అన్న రెండు రోజుల తర్వాత గుడివాడలో ఆయన షాక్ కు గురయ్యే సీన్ కనిపించింది. 

ఇదీ చదవండి: పరిటాల శ్రీరామ్, వంగవీటి రాధా, బాలయోగి తనయుడి భేటీ సీక్రెట్ అజెండా అదేనా? పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. కేటీఆర్ యూత్ పేరుతో కొందరు యువకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే అందులో కొందరు కొడాలి నాని వెంట  తిరిగిన వారు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. వారు ఇప్పుడు జాతీయ పార్టీ ప్రారంభించినందుకు కేటీఆర్ కు అభినందనలు తెలిపుతూ ఫ్లెక్సీలు పెట్లటడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇదీ చదవండి: ఏపీ రాజధానిపై ప్రధాని మోదీ ఏమన్నారు.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

కొడాలి నాని కామెంట్స్ కు కౌంటర్ గానే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని.. ఏపీలోనూ కేసీఆర్ కు ఆదరణ ఉందనడానికి అదే నిదర్శనమని కొందరు అంటున్నారు. ఐతే  మరికొందరు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. గుడివాడలో వెలమ సామాజిక వర్గానికి చెందిన కొందరు యువకులు.. కేసీఆర్ పై అభిమానాన్ని చాటుకున్నారే తప్ప బీఆర్ఎస్ ప్రభావం ఏపీలో లేదంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, CM KCR, KCR New Party, Kodali Nani, Ycp

ఉత్తమ కథలు