Home /News /andhra-pradesh /

AP POLITICS BIG SHOCK TO CM JAGAN YCP KEY LEADER MEETS TO NARA LOKESH WILL HE JOIN IN TELUGU DESAM PARTY NGS

Shock to YCP: సీఎం జగన్ కు బిగ్ షాక్.. నారా లోకేష్ ను కలిసిన వైసీపీ కీలక నేత

నారా లోకేష్ ను కలిసిన వీరా శివారెడ్డి

నారా లోకేష్ ను కలిసిన వీరా శివారెడ్డి

Big shock to YCP: తెలుగు దేశంలోకి భారీగా వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.. తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది.. ఇప్పటికే కొందరు టీడీపీలో కర్చీఫ్ వేసుకున్నారనే ప్రచారం ఉంది. తాజాగా వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. ఇటీవల నారా లోకేష్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది..

ఇంకా చదవండి ...
    Big Shock to YCP:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లో ఉన్నాయి. ఇప్పటికే పార్టీలన్నీ జనం బాట పడుతున్నాయి.  గతంతో పోల్చుకుంటే తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. మహనాడు (Mahanadu) సక్సెస్ పార్టీలో కొత్త ఉత్సాహం తెప్పించింది. అందుకే మొన్నటి వరకు వైసీపీ (YCP) లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొందరు నేతలు.. జనసేన (Janasena) లేదా బీజేపీ (BJP) లోకి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నా వారు.. ఇఫ్పుడు  రూటు మార్చుకుని పచ్చ కండువాలు కప్పుకునే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం ఉంది.  ఇప్పటికే పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.. తాజాగా వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నారా లోకేష్ ను కలవడం హాట్ టాపిక్ అయ్యింది.

    సీఎం జగన్ సొంత జిల్లా క‌మ‌లాపురం మాజీ ఎమ్మెల్యే వీర‌శివారెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనేందుకు సిద్ధమవుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. త‌న అనుచ‌రుల‌తో క‌లిసి ముహూర్తం చూసుకొని పార్టీలో చేర‌బోతున్న‌ట్లు సిగ్నల్ ఇచ్చారు. ఈమేర‌కు ఆయ‌న పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌ను క‌లిసి శాలువాతో స‌త్క‌రించారు. జిల్లాలో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై లోకేశ్‌తో చ‌ర్చించాన‌ని వీరశివారెడ్డి అన్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో త‌న‌కు ఎమ్మెల్యేగా పోటీచేయాల‌నే ఆస‌క్తి లేద‌న్నారు. అయితే పార్టీ నిల‌బెట్టిన అభ్య‌ర్థి కోసం ప‌నిచేస్తాన‌ని మాత్రం చెప్పినట్టు తెలుస్తోంది. 

    ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న వీర‌శివారెడ్డి టీడీపీలో చేరుతుండ‌టంపై జిల్లాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున గ‌తంలో మూడుసార్లు క‌మ‌లాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వీర‌శివారెడ్డి తరువాత రాజ‌కీయ ప‌రిణామాల్లో జ‌గ‌న్ వెంట న‌డిచారు. అయితే కొన్ని సంవ‌త్స‌రాలుగా వైసీపీలో ఉన్న‌ప్ప‌టికీ ప‌ద‌వుల విష‌యంలో, ఇత‌ర విష‌యాల్లో తనకు త‌గినంత ప్రాధాన్య‌త లేద‌నే ఆయన పూర్తి అసంతృప్తితో ఉన్నారని చాలా రోజుల నుచి ప్రచారంలో ఉంది.

    ఇదీ చదవండి : నిన్న అన్న నేడు చెల్లి.. ఏపీలో జగన్.. తెలంగాణ లో షర్మిల.. ట్రాక్టర్ నడిపి రైతులకు భరోసా

    అందుకే తాజాగా ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తన అనుచ‌రుల‌తో చ‌ర్చించి టీడీపీలోకి వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. అయితే సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా నుంచి మ‌రికొంద‌రు వైసీపీ నేత‌ల‌ను టీడీపీలోకి తీసుకోవాల‌నే ఉద్దేశంతో ఆ పార్టీ నేత‌లు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అధినేత తీరుపై అసంతృప్తి ఉన్న‌ప్ప‌టికీ వారంతా పైకి చెప్పుకోలేక‌పోతున్నార‌ని, భ‌విష్య‌త్తులో కూడా ప‌ద‌వులు వ‌స్తాయ‌నే న‌మ్మ‌కం లేనివారిని, నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన నేత‌లుగా ఉన్న‌వారిని ఆహ్వానించి జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాల‌నే ఉద్దేశంతో టీడీపీ వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, TDP, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు