Breaking News: బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss Season) మధ్యలోనే నిలిచిపోనుందా.. ఓ వైపు అసలే షో చాలా బోరింగ్ గా సాగుతోందని ప్రచారం జరుగుతోంది. ఆరు సీజన్లలో తొలిసారి.. ఇటీవల హౌస్ మేట్స్ పై బిగ్ బాస్ తీవ్రంగా స్పందించారు. టాస్క్ ను సైతం మధ్యలోనే నిలిపివేశారు. అంటే గేమ్ ఎంత బోరింగ్ గా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈ షోను బ్యాన్ చేయాలి అంటూ వేసిన పిటిషన్లపై హైకోర్టు స్పందించింది.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. బిగ్ బాస్ నిర్వహాకులు.. హోస్ట్ నాగార్జున (Nagarjuna) కు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. అందుకు రెండు వారాల సమయం ఇచ్చింది.. దీంతో బిగ్ బాస్ నిర్వహాకులు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.. ఆ కౌంటర్ ఆధారంగా హైకోర్టు (High Court) నిర్ణయం తీసుకోనుంది.. దీంతో బిగ్ బాస్ నిలిచిపోతుందా అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
బిగ్ బాస్ రియాల్టీ షోను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు విచారణలో భాగంగా.. బిగ్ బాస్ తెలుగు షోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కనీసం రెండు లేదా మూడు ఎపిసోడ్లను చూస్తామని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసం స్పష్టం చేసింది.
అలాగే పిటిషన్పై తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బిగ్ బాస్ షో నిర్వాహకులు, హోస్ట్ అక్కినేని నాగార్జునకు ఏపీ హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది. అనంతరం ఈ పిటిషన్పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ లోపు వీరంతా కౌంటర్ ధాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ కౌంటర్ తరువాత హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి : ఆ కుటంబాలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. నవంబర్ లో వారందరికీ ఉద్యోగలిస్తామని హామీ ఇచ్చారు
ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ యువతను తప్పుదోవ పట్టించడంతోపాటు అసభ్యత, అనైతికం, హింసను ప్రోత్సహిస్తోందని, బిగ్ బాస్ ప్రసారాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సామాజిక కార్యకర్త కె జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ రియాల్టీ షోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాన్ని వీక్షిస్తామని హైకోర్టు పేర్కొంది. సెన్సార్షిప్ లేకుండా ప్రసారం చేస్తున్నారనే పిటిషనర్ వాదన నేపథ్యంలో షో టెలికాస్ట్ వివరాలను కోరిన ధర్మాసనం.. కనీసం రెండు లేదా మూడు ఎపిసోడ్లను చూస్తామని తెలిపింది. ఈ షో ప్రదర్శన వివరాలను తమ ముందు ఉంచాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akkineni nagarjuna, Andhra Pradesh, AP High Court, AP News, Big boss telugu, Bigg Boss