హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: మూడు రాజధానులంటే ఒప్పుకోం.. ఏపీ సర్కార్ కు కేంద్రం షాక్..? ఎందుకో తెలుసా..?

CM Jagan: మూడు రాజధానులంటే ఒప్పుకోం.. ఏపీ సర్కార్ కు కేంద్రం షాక్..? ఎందుకో తెలుసా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ మూడు రాజధానుల చర్చ జోరందుకుంది. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులు బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంటే.. ఇదే సమయంలో కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది. మూడు రాజధానుల విషయం కీలక నిర్ణయం తేల్చి చెప్పేసింది..

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని ఏది.. ఇప్పటికే సమాధానం లేని ప్రశ్నే అదే.. ఎందుకంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీ ప్రభుత్వం (AP Government) పెద్దలు చెబుతున్నది ఒక్కటే.. ఏపీకి మూడు రాజధానులు (Three Capitals) వచ్చి తీరుతాయని.. కానీ ఇటు కోర్టు.. విపక్షాలు.. కేంద్ర పెద్దలు అంతా ఏపీకి అమరావతే రాజధాని (Capital Amaravati) అంటున్నారు. అయినా గందరగోళం ఆగడం లేదు. వచ్చే ఎన్నికలు సైతం ఇదే అజెండాతో జరిగే అవకాశం కనిపిస్తోంది. ఓ వైపు అమరావతి కాపాడుకోవడానికి రైతులు రోడ్డెక్కారు.

  అరసవిల్లికి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో రేపటి నుంచి జరిగనున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమమవుతోంది. అదే విషయాన్ని మంత్రులు పదే పదే చెబుతున్నారు. త్వరలోనే ఎగ్జిక్యూటివ్ రాజధాని అయిన విశాఖ నుంచి పరిపాలన సాగడం పక్కా అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు కూడా.. ఇలాంటి తరుణంలో కేంద్రం తాజాగా ఓ షాకిచ్చింది.

  ఏపీలో ఏకైక రాజధాని కోసం మాత్రమే నిధులిస్తామని తేల్చిచెప్పింది. దీంతో ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులో ఏమైనా మార్పులు చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరి కేంద్రం నిర్ణయాన్ని అధికార వైసీపీ నిలదీస్తుందా..? ఎందుకు గొడవ అని మూడు రాజధానుల అంశాన్ని పక్కన పెట్టి.. ప్రస్తుతం అమరావతిని రాజధానిగా గుర్తించి.. తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

  ఇదీ చదవండి : రాతి స్తంభంపై అక్షరాలకు అర్థం ఏంటి? ఏ భాష గుర్తు పట్టగలరా..? కిలికిలి అనుకోకండి..!

  ఈ అంశం ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చింది అంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు సంబంధించిన పెండింగ్‌ అంశాలపై ఈ నెల 27న కేంద్ర హోం శాఖ సమావేశాన్ని నిర్వహించనుంది. ఢిల్లీలోని నార్త్‌ బ్లాక్‌ కార్యాలయంలో జరగనున్న భేటీలో ఏపీ, తెలంగాణ , ఆయా కేంద్ర మంత్రిత్వ శాఖల అధికారులు పాల్గొంటారు. 14 అంశాలతో ఖరారైన అజెండాతో కూడిన సమాచారాన్ని రెండు రాష్ట్రాలు, ఆయా మంత్రిత్వ వశాఖలకు కేంద్ర హోం శాఖ డైరెక్టర్‌ పార్థసారథి పంపించారు. అయితే ఈ అజెండాలో ఏపీ రాజధానికి నిధులు అంశం కూడా కీలకంగా ఉండడంతో కేంద్రం వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

  ఇదీ చదవండి : సీఎం చేతికి ఐ ప్యాక్ సర్వే.. టాప్ లో ఉన్నది ఎవరు? ఈ ఐదు అంశాలపై క్లారిటీ?

  ఏపీకి మూడు రాజధానులు అని జగన్‌ సర్కారు ప్రతిపాదిస్తున్న సమయంలో ఆ రాష్ట్రానికి రాజధాని ఒకటేనని కేంద్ర తేల్చి చెప్పేసింది. నూతన రాజధాని ఏర్పాటుకు కేంద్రం మద్దతు అంటూ తన వైఖరిని స్పష్టం చేసింది. 27 నాటి సమావేశపు అజెండాలో నూతన రాజధాని ఏర్పాటుకు కేంద్రం మద్దతు అంశం ఉంటుందని ప్రకటించింది. అయితే నూతన రాజధానికి రాపిడ్‌ రైల్‌ కనెక్టివిటీ కల్పించడం అనే అంశాన్ని కూడా అజెండాలో పేర్కొంది. జగన్‌ సర్కార్‌ పదే పదే చెబుతున్నట్లుగా 3 రాజధానులు అని కాకుం డా ‘‘నూతన రాజధాని’’ అని ఒకే రాజధానిగా అర్థం వచ్చేలా అజెండాలో చేర్చడం గమనార్హం.

  ఇదీ చదవండి : కొడాలి నానిని అలా పోల్చిన తెలుగు తమ్ముళ్లు.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు.

  ఇతర అంశాల విషయానికి వస్తే.. రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9లో పేర్కొన్న ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజనషెడ్యూల్‌ 10లో పేర్కొన్న సంస్థల విభజనరాష్ట్ర విభజన చట్టంలో ఎక్కడా ప్రస్తావన లేని సంస్థల విభజన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్‌ (ఏపీఎ్‌సఎ్‌ఫసీ) విభజనసింగరేణి, ఆంధ్రప్రదేశ్‌ హెవీ మెషినరీ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌(ఆప్మెల్‌) సంస్థల విభజననగదు, బ్యాంకు బ్యాలెన్సు విభజన(కేంద్ర ప్రాయోజిత పథకాలు/ఉమ్మడి సంస్థలపై వ్యయం/ విదేశీ సహాయంతో చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించి నిధులు)తెలంగాణ రాష్ట్ర సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నుంచి ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌కు బకాయి ఉన్న క్యాష్‌ క్రెడిట్‌ మొత్తం, 2014-15కి సంబంధించి ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం బియ్యం సబ్సిడీ విడుదల తదితర విభజన హామీల సమస్యలపై.. కేంద్రం ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Amaravathi, Andhra Pradesh, AP cabinet, AP News

  ఉత్తమ కథలు