Breaking News: ఆంధ్రప్రదేశ్ (Andrha Pradesh) ప్రభుత్వానికి కోర్టుల్లో షాక్ లు తప్పడం లేదు. తాజాగా అమరావతి (Amaravati) రాజధాని కేసులో జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టు (Supreme Court) నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సర్వోత్తమ న్యాయస్థానం నిరాకరించింది. హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాలపైనే సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే రాజధాని అమరావతిలో నిర్మాణాలపై హైకోర్టు విధించిన కాలపరిమితికి సంబంధించి మాత్రమే స్టేను విధించింది. దీంతో ఈ తీర్పుపై ఆశలు పెట్టుకున్న జగన్ సర్కార్ కు షాక్ ఇచ్చినట్టు అయ్యింది. నేడు అమరావతి కేసుపై సుప్రీంలో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం (AP Government ) తరపున మాజీ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వాదనలు వినిపించారు. న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నల ధర్మాసనం ముందు విచారణ జరిగింది.
హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని సుప్రీంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్.. కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు.. రాజధానిపై అసెంబ్లీకి చట్టం చేసే అధికారం లేదని హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించడానికి సుప్రీం నిరాకరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది.
మరోవైపు అమరావతిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు అయ్యేలా చూడాలని రైతులు కోరారు. ఇరు వర్గాల వాధనలు విన్న సుప్రీం కోర్టు.. తీర్పుపై పూర్తి స్థాయి స్టే ఇవ్వడానికి నిరాకరించింది. హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాలపై మాత్రమే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రాజధానిలో నిర్మాణాలపై హైకోర్టు విధించిన కాలపరిమితికి సంబంధించి మాత్రమే సుప్రీం స్టే విధించింది.
మరోవైపు సీఎం జగన్ తీరుపై అమరావతి రైతులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజధానికి కేటాయించిన భూములను పేదల ఇళ్ల స్థలాలకు ఇస్తే సామాజిక సమతౌల్యం దెబ్బతింటుందనే దుర్మార్గం దేశంలో వస్తుందని ఆనాడు రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండకపోవచ్చని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను రాజధాని రైతులు తీవ్రంగా ఖండించారు. పచ్చి అబద్ధాలతో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కే ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. అమరావతి బృహత్ ప్రణాళికను మార్చి రాజధానిని నాశనం చేయాలనే కుట్రతోనే వైసీపీ నాయకులు ఆర్-5 జోన్‌ను తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి ఒక సామాజిక వర్గానికి చెందినదంటూ కులాల మధ్య చిచ్చుపెట్టి ముఖ్యమంత్రి రాజకీయ చదరంగం ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ విశాఖలో ఎందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. రాజధానిలో ఉన్న పేదలకే పనులు లేక వలస పోతుంటే ఇతర ప్రాంతాల వారిని తీసుకొచ్చి ఎలా పోషిస్తారో తెలపాలని డిమాండు చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని గ్రామాల్లో రైతులు, కూలీలు, మహిళలు చేస్తున్న నిరసనలు ఆదివారానికి 1076వ రోజుకు చేరాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravathi, Andhra Pradesh, Ap cm jagan, AP News, Supreme Court