Home /News /andhra-pradesh /

AP POLITICS BIG SHOCK TO ANDHRA PRADESH GOVERNMENT BY SUPREME COURT ON COVID FUNDS NGS GNT

Supreme Court: జగన్ సర్కార్ కు మరో షాక్.. ఆ నిధులు ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలకు బదిలీ చేయాలన్న సుప్రీం

సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

Supreme Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో బిగ్ షాక్ తగిలింది. కేవలం రెండు రోజుల డెడ్ లైన్ పెట్టి.. ఆ నిధులను తిరిగి జమచేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విపక్షాలు సైతం ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పు పడుతున్నాయి.

ఇంకా చదవండి ...
    Supreme Court: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి మరో బిగ్ షాక్ తగిలింది. ఎస్డీఆర్ఎఫ్ నిధులను (NDRF Funds) వ్యక్తిగత ఖాతాలకు మళ్లిస్తూ ప్రభుత్వం (Government) తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు (Supreme Court ) తప్పుబట్టింది. ఆ నిధులను రెండు రోజుల్లోగా తిరిగి ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలకు బదిలీ చేయాలని ఆదేశించింది. అది కూడా రెండు రోజులే టైం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) నిధులను ప్రభుత్వం వ్యక్తిగత ఖాతాలకు మళ్లించడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎమ్.ఆర్.షా, జస్టిస్ బి.వి.నాగరత్న ఆధ్వర్యంలోని సుప్రీం ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది. అది కూడా డెడ్ లైన్ పెడుతూ ఆదేశాలిచ్చింది. రెండు రోజుల్లోగా పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్ నుంచి నిధులను ఎస్డీఆర్ఎఫ్‌కు తిరిగి బదిలీ చేయాలని ఆదేశించింది. అర్హులైన వారికి పరిహారం చెల్లించకపోవడం, కొంతమంది దరఖాస్తులు తిరస్కరించడం వంటి అంశాలపై కూడా ధర్మాసనం స్పందించింది.

    ఒకవేళ ఎవరైనా పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే.. దీనికోసం ఏర్పాటైన కమిటీ నాలుగు వారాల్లోనే పరిహారం అందజేయాలని సూచించింది. అర్హులైన వారికి పరిహారం అందించడంలో సమయం వృథా చేయకూడదని, పరిహార కమిటిని ఆశ్రయిస్తే వెంటనే పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించింది. 

    తాజా తీర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు  నాయుడు (Chandrababu Naidu) స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం రూ.1100 కోట్ల కోవిడ్ విపత్తు నిధులను దారి మళ్లించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. దారి మళ్లించిన నిధులను వెంటనే SDRF ఖాతాలో జమచెయ్యాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు జగన్ రెడ్డి ఇష్టానుసార పాలనకు చెంపపెట్టులాంటిది అంటూ తొలి ట్వీట్ చేశారు.

    కోవిడ్ లేదా వరదల వంటి విపత్తులు వచ్చినప్పుడు అదనపు కేటాయింపులతో ప్రజలకు సాయం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం....ఇలా నిధులు మళ్లించి పబ్బం గడుపుకోవడం బాధితులకు అన్యాయం చెయ్యడమే అంటూ ఆవేదన వ్యక్తం చేవారు. వరుసగా ట్వీట్లు చేశారు చంద్రబాబు నాయుడు.

    దీనికి సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. పల్లా శ్రీనివాస రావు అనే వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎస్డీఆర్ఎఫ్ నిధుల్ని ప్రభుత్వం వ్యక్తిగత ఖాతాలకు మళ్లించడం నిబంధనలకు విరుద్ధమని పల్లా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap government, AP News, Chandrababu Naidu, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు