Breaking News: తెలంగాణ (Telangana) లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల (TRS MLAs) కొనుగోలు వ్యవహారంలో సంచలనం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో అనేక ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఏపీలో కొందరికి కేసుతో సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghu Ramakrishnam Raju) కు తెలంగాణ ప్రభుత్వం (Telgangana Government) ఏర్పాటు చేసిన సిట్ నోటీసులు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు అందజేసింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు 100 కోట్ల రూపాయలను తాను సమకూరుస్తానని రఘురామ చెప్పినట్టు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దాంతో ఈ వ్యవహారంలో విచారించేందుకు రఘురామకృష్ణంరాజుకు నోటీసులు జారీ చేశారు. రామచంద్రాభారతి, నందు, సింహయాజిలతో రఘురామ టచ్ ఉన్నట్టు సిట్ భావిస్తోంది. సాధారణంగా నేరం చేసిన వ్యక్తికి 41ఏ నోటీసులుఇచ్చి విచారణకు పిలుస్తుంటారు. రఘురామకృష్ణంరాజుకు కూడా అదే నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది.
తాజాగా.. ఏపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకు సైతం సిట్ అధికారులు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో నిందితులుగా ఉన్న వారితో రఘురామ ఫోటోలు దిగారు. ఆ ఫోటలు రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో భాగంగా విచారణకు రావాలంటూ 41ఏ సీఆర్పీసీ కింద ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు.
మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తునకు సహకరించని కీలక అనుమానితులపై చర్యలకు సిద్ధమవుతోంది. ఎవరైతే సీట్ విచారణకు హాజరుకాని కీలక నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సంతోష్‌తో పాటు కేరళకు చెందిన జగ్గుస్వామి, తుషార్‌పై కూడా కేసులు నమోదు చేశారు. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కు నోటీసులు అందాయి.
ఈ కేసుతో ఏ మాత్రం లింకు ఉన్నదనే ఆధారాలు ఏమైనా కనిపిస్తే రఘురామ రాజుకు కష్టాలు తప్పవు.. ఇప్పటికే ఆయనపై ఏపీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఏదో ఒక రూపంలో రఘురామను అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ అరెస్ట్ నుంచి తప్పించుకుంటున్నారు. మరోవైపు కొందరు వైసీపీ శ్రేణులు రఘురామపై దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారనే ప్రచారం ఉంది. అందుకే ఆయన సొంత నియోజకవర్గంపై ఇప్పటి వరకు కాలు కూడా పెట్టలేకపోయారు..
ఇప్పుటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో లింకులు ఉంటే.. తెలంగాణ ప్రభుత్వంతో కూడా శత్రుత్వం ఏర్పడుతుంది.. అప్పుడు ఆయన హైదరాబాద్ లో ఉన్నా ఇబ్బందులు తప్పవు.. మరి ఈ కేసులో తన పేరు రావడంపై రఘురామ ఎలా స్పందిస్తారో చూడాలి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Raghu Rama Krishnam Raju