హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: నారా లోకేష్ కు బిగ్ షాక్.. వైసీపీలో చేరిన మంగళగిరి కీలక నేత

AP Politics: నారా లోకేష్ కు బిగ్ షాక్.. వైసీపీలో చేరిన మంగళగిరి కీలక నేత

నారా లోకేష్ కు బిగ్ షాక్

నారా లోకేష్ కు బిగ్ షాక్

Big shock to Lokesh: ఊహించిందే జరిగింది.. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన.. మంగళగిరి కీలక నేత.. గంజి చిరంజీవి.. వైసీపీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల.. ఆయనను దగ్గరుండి సీఎం జగన్ దగ్గరకు వెళ్లడం విశేషం..

  • News18 Telugu
  • Last Updated :
  • Mangalagiri, India

Big Shock to Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలని పట్టుదలతో మంగళగిరి (Mangalagiri) పై ఫోకస్ చేసిన.. నారా లోకేష్ (Nara Lokesh) కు ఊహించని షాక్ తగిలింది. ఇటీవల టీడీపీ (TDP)కి రాజీనామా చేసిన.. నేత గంజి చిరంజీవి (Ganji Chirnajeevi).. వైసీపీ (YCP) లో చేరారు. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) లో కీలకనేతగా ఉన్న మంగళగిరికి చెందిన గంజి చిరంజీవి.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆశిస్తున్న ఆయన.. గత ఎన్నికల్లో నారా లోకేష్‌ అక్కడి నుంచి పోటీ చేయడంతో.. ఆ సీటును త్యాగం చేయాల్సి వచ్చింది.. లోకేష్‌ మంగళగిరిపై కేంద్రీకరించి పనిచేయడంతో.. తనకు ఆ స్థానం దక్కే అవకాశం లేకపోవడంతో.. టీడీపీకి గుడ్‌బై చెప్పారు..


టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్టు.. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు గంజి చిరంజీవి.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌తో సమావేశమై.. అక్కడే  సీఎం సమక్షంలోనే వైసీపీ తీర్థం పుచ్చకున్నారు గంజి చిరంజీవి. 


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు గంజి చిరంజీవి.. తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి సీఎంతో భేటీ అయ్యి.. మంగళిగిరి సీటుపై హామీ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌ కుమార్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్‌కే), ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావులు పాల్గొన్నారు. 


ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే.. మళ్లీ అక్కడ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటికే రెండు సార్లు వరుసగా ఆయన అక్కడ నుంచి గెలిచారు. ఇదే సమయంలో ఆయనపైన.. ప్రభుత్వంపైనా ఉన్న వ్యతిరేకత మైనస్ అవుతోందని భావిస్తున్నారు. దీనికి తోడు లోకేష్ పై  సానుభూతి కూడా ఉండడం తనకు మైనస్ మారుతుందని అంచనా వేస్తున్నారు. అయితే లోకేష్ ను ఈజీగా ఓడించాలి అంటే.. గంజీ చిరంజీవి సరైన అభ్యర్థి అని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం.. అందులో భాగంగానే ఆయనకు ఇప్పుడు అవకాశం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆర్కే.. సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తారంటూ మరో ప్రచారం జరుగుతోంది.


ఇదీ చదవండి : భక్తులకు అలర్ట్.. తిరుమలలో సెప్టెంబర్ లో విశేష పర్వదినాలు ఎన్నో..? బ్రహ్మోత్సవాలు ఎ్పపటి నుంచి అంటే..?


2014లో టీడీపీ నుంచి మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన గంజి చిరంజీవి.. 2019 ఎన్నికల్లో ఆ స్థానాన్ని నారా లోకేష్‌ కోసం త్యాగం చేశారు.. స్థానికంగా బీసీ వర్గాల్లో మంచి పట్టు ఉన్న నాయకుడిగా గంజి చిరంజీవికి పేరు ఉండగా.. ఆయన్ని వైసీపీలోకి లాగేందుకు ఎమ్మెల్యే ఆర్కే.. ఈ స్కెచ్‌ వేశారనే ప్రచారం సాగుతోంది.. మొత్తంగా.. 20 రోజుల కిందట టీడీపీకి గుడ్ బై చెప్పిన గంజి.. ఇవాళ వైసీపీలో అధికారికంగా చేరారు. ఆయన వైసీపీలో చేరడంతో లోకేష్ కు పెద్ద షాక్ ఇచ్చినట్టే అని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.

First published:

Tags: Alla Ramakrishna reddy, Andhra Pradesh, Ap cm jagan, AP News, Nara Lokesh, TDP

ఉత్తమ కథలు