హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Big Relief to RRR: ఐదు రాష్ట్రాల ఎన్నికలతో కొత్త ఈక్వేషన్లు.. జగన్ అవసరం ఇక కేంద్రానికి లేనట్టేనా..?

Big Relief to RRR: ఐదు రాష్ట్రాల ఎన్నికలతో కొత్త ఈక్వేషన్లు.. జగన్ అవసరం ఇక కేంద్రానికి లేనట్టేనా..?

Big Relief to RRR: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలతో దేశ వ్యాప్తంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. ఇతర రాష్ట్రాలపై కమల దళం ఫోకస్ చేస్తోంది. అందులో భాగంగా ఏపీ, తెలంగాణాలపైనే బీజేపీ అధిష్టానం కన్నేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీలో సీఎం జగన్ తో కేంద్రానికి పెద్దగా అవసరం లేనట్టే కనిపిస్తోంది. ఈ ఒక్క విషయం ఎంపీ రఘురామకు గొప్ప రిలీఫ్ గా మారుతోంది.

ఇంకా చదవండి ...

    Big Relief to RRR: దేశ వ్యాప్తంగా మరోసారి బీజేపీ (BJP) వేవ్ కనిపిస్తోంది. 2024 ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించిన ఈ ఫలితాల్లో బీజేపీ దూకుడు ముందు విపక్షాలు నిలువ లేకపోయాయి. కేవలం పంజాబ్ (Punjab) మినహా.. నాలుగు చోట్లా కాషాయ దళానిదే అధికారం.. అదికూడా మంచి విజయాలే.. దీంతో ఆ పార్టీ మరింత దూకుడు పెంచుతోంది. ముఖ్యంగా తాము అధికారంలో లేని రాష్టాలపై బీజేపీ చూపు పడింది. అందులో భాగంగానే  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) లపైనా ఓ కన్నేసినట్టు ప్రచారం ఉంది. తెలంగాణ విషయానికి వస్తే.. సీఎం కేసీఆర్ (CM KCR) తో బీజేపీ ఢీ అంటే ఢీ అంటోంది.. అధికారం సాధించడమే లక్ష్యంగా కేసీఆర్ తో పోటీ పడుతోంది. కానీ ఏపీ పరిస్థితి వేరు.. ఇప్పటి వరకు సీఎం జగన్.. కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. పరోక్షంగా పరస్పరం సహకరించుకునే అవకాశం లేకపోలేదనే ప్రచారం ఉంది. ఎందుకంటే జగన్ అవసరం కేంద్రంలో బీజేపీ ఎంతో కొంత ఉంటుంది అన్నది రాజకీయ విశ్లేషకుల మాట.. కానీ తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఇక.. కేంద్రంలో ఉన్న బీజేపీకి కొత్తగా ఏ ప్రాంతీయ పార్టీ అవసరం లేదనే చెప్పాలి. దీంతో వైసీపీని కూడా ఇకపై రాజకీయ శత్రువుగానే చూసే అవకాశాలు లేకపోలేదు..

    అందుకే ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలు.. జాతీయ స్థాయిలోనే కాదు. ఏపీ రాజకీయాల పైన ప్రభావం చూపనున్నాయి. 2019 ఎన్నికల ముందు నాటి కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకు వచ్చింది. అయితే టీడీపీ బయటకు వచ్చింది అనడం కంటే.. బయటకు వచ్చేలా చేయటంలో నాడు జగన్ వ్యూహం సక్సెస్ అయింది అనే టాక్ ఉంది. అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ట్రాప్ లో చిక్కుకున్న టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది. ఆ సమయం నుంచి వైసీపీ- బీజేపీ అధినాయకత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. అప్పటికే అవసరమైన ప్రతీ సందర్బంలోనూ అనధికార మిత్రపక్షంగా పార్లమెంట్ లోనూ సహకారం అందిస్తోంది. నాడు జరిగిన రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీఏ ప్రతిపాదిత అభ్యర్ధులకు మద్దతు ఇచ్చింది. ఇక, 2019 లో జగన్ సీఎం అయిన తరువాత కేంద్రంతోనూ ప్రత్యేకించి ప్రధాని మోదీ - అమిత్ షా తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు.

    ఇదీ చదవండి : అమ్మవారి సేవలో రోజా.. పూజలు అందుకేనా..? క్లారిటీ వచ్చిందా..?

    అయితే కేంద్రంతో సీఎం జగన్ సన్నిహింతంగా ఉంటున్నా.. నిధుల విడుదల విషయంలో ఆశించిన స్థాయిలో ఏపీకి కేంద్రం నుంచి సహకారం అందటం లేదనే అభిప్రాయం ఉంది. కనీసం ఈ ఏడాది బడ్జెట్ లో కేంద్ర.. ఏపీకి మరీ మొండిచేయ చూపించింది. కానీ వ్యక్తిగత అవసరాలు కావొచ్చు.. రాష్టా పరంగా అవసరం కావొచ్చు.. కారణం ఏదైనా.. కేంద్రంతో సఖ్యతగానే ఉంటున్నారు జగన్. అంతే కాదు బీజేపీ సైతం.. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే.. ఎక్కువ బలం ఉన్న జగన్ అవసరం ఉంటుంది అనే ఉద్దేశంతో.. జగన్ విషయంలో కేంద్రం చూసి చూడనట్టు వదిలేస్తోందనే ప్రచారం ఉంది.

    ఇదీ చదవండి : చిరంజీవిని వాడేసుకుంటున్న వైసీపీ.. రాజకీయ వ్యూహంలో భాగమేనా..?

    ఈ పరిస్థితుల్లో మరి కొద్ది రోజుల్లో రాష్ట్రపతి ఎన్నికలు రానున్నాయి. ఆ సమయంలో మిత్రపక్షాలు దూరమైన వేళ..వైసీపీ మద్దతు బీజేపీకి అవసరం అవుతుందని ఇప్పటి దాకా భావించారు. అందుకే తమ మద్దతు కావాల్సిన సమయంలో కొన్ని కండీషన్లు పెట్టేందుకు వైసీపీ సిద్దం అయిందనే చర్చ మొదలైంది. కానీ, ఇప్పుడు అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత సమీకరణాల్లో మార్పు కనిపిస్తోంది. అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. రాస్ట్రపతి ఎలక్ట్రోల్ ఓట్లలో యూపీ ఓటు విలువ ఎక్కువగా ఉంటుంది. ఇక, యూపీతో పాటుగా మరో మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలోకి రావటంతో..వైసీపీ మద్దతు లేకుండానే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ తమ బలంలోనే రాష్ట్రపతి అభ్యర్ధిని గెలిపించుకొనే అవకాశం ఏర్పడింది.

    ఇదీ చదవండి : ఏపీపై కమలం ఫోకస్.. వైసీపీ, టీడీపీ నుంచి త్వరలోనే చేరికలుంటాయన్న ఎంపీ

    దీంతో ఇకపై వైసీపీని కూడా బీజేపీ రాజకీయ శత్రువుగానే చూసే అవకాశం కనిపిస్తోంది. స్థానిక బీజేపీ నేతలు సైతం రాష్ట్ర ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అనడమే మేలని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ కు క్షేత్ర స్థాయిలో బలం పెరుగుతుండడంతో.. పవన్ తో కలిసి వెళ్లడమే మేలన్నది బీజేపీ అభిప్రాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే వైసీపీని రాజకీయ శత్రువుగానే పరిగణిస్తుంది.. అలా జరిగితే వైసీప రెబల్ ఎంపీ.. రఘు రామ రాజుకు రిలీఫ్ దొరికినట్టే.. ఆయన.. ఇక వైసీపీకి రాజీనామా చేసి.. అధికారికంగా బీజేపీలో చేరిపోయే అవకాశం ఏర్పడినట్టే..

    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Bjp, Narendra modi, Ycp

    ఉత్తమ కథలు