Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జనసేన వర్సెస్ వైసీపీగా (Janasena vs YCP) జరుగుతున్న యుద్ధంలో.. జనసైనికులకు భారీ ఊరట దక్కింది. అది ఏంటంటే..? విశాఖ పట్నం ఎయిర్‌పోర్టు (Visakhapatnam Airport) దగ్గర ఏపీ మంత్రులపై దాడి చేశారనే అభియోగాలపై జనసైనికులను అరెస్ట్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) న్యాయ పోరాటానికి దిగారు. రెండు రోజుల పాటు విశాఖలోనే ఉండి.. వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల స్కెచ్ ఇదంతా అని మండిపడ్డారు. అయితే మొత్తం 115 మందిపై కేసులు పెడితే.. అందులో 9 మంది మినహా.. అందరూ బెయిల్ పై విడుదల అయ్యారు. దీంతో ఆక్కడ నుంచి విజయవాడ చేరుకున్న.. ఆయన వైసీపీపై యుద్ధమే ప్రకటించారు. యుద్ధానికి సిద్ధం అన్నారు. ఆ మరుచటి రోజే.. వైసీపీ నేతలకు చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చారు. ఆ దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా జనసేనకు ఊరట లభించింది.
విశాఖ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడి చేశారంటూ నమోదైన కేసులో.. అప్పుడే తొమ్మిది మంది మినహా మిగిలిన నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ 9 మందిపై తీవ్ర అభియోగాలు ఉండటంతో స్థానిక కోర్టు వారికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.
న్యాయ వ్యవస్థపైనే నమ్మకం ఉంచాం - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/MybLqLjW7V
— JanaSena Party (@JanaSenaParty) October 21, 2022
ఈ కేసులో నిందితులుగా ఉన్న జనసేన ప్రధాన కార్యదర్శి టి.శివ శంకర్, బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీ డాక్టర్స్ సెల్ ఛైర్మన్ డా.రఘును కూడా అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. తమపార్టీ నేతల విడుదలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. కార్యకర్తల్ని విడుదల చేస్తూ ఆదేశించిన ‘‘గౌరవ హైకోర్టుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అంటూ పవన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
మరోవైపు పవన్ పై వైసీపీ నేతల దాడి కొనసాగుతూనే ఉంది. మంత్రులు.. కీలక నేతలు అంతా పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం జగన్ సైతం నేరుగా పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా మండిపడ్డారు.. మనం మూడు రాజధానులు కావాలి అంటుంటే..? కొందరి నేతలు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని సలహా ఇస్తున్నారని.. అలాంటి నేతలా మనకు దిశా నిర్దేశం చేసిది అంటూ మండిపడ్డారు. ఇక మంత్రులంతా పవన్ తీరుపై సెటైర్లు వేస్తూనే ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Janasena, Pawan kalyan, Visakhapatnam, Ycp