హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

MP Vijaysai Reddy: గెలిపించినందుకు ఇదే మీకు కానుక.. వారిపై వరాలు కురిపించిన విజయసాయి రెడ్డి

MP Vijaysai Reddy: గెలిపించినందుకు ఇదే మీకు కానుక.. వారిపై వరాలు కురిపించిన విజయసాయి రెడ్డి

విజయసాయి రెడ్డి (ఫైల్)

విజయసాయి రెడ్డి (ఫైల్)

MP Vijaysai Reddy: గత ఎన్నికల్లో వైసీపీ ఎవరూ ఊహించని విజయం సాధించడం వెనుక వారి పాత్ర మరువ లేనిది.. వైసీపీ కీలక నేతలే ఆ విషయాన్ని చాలాసార్లు ఒప్పుకున్నారు కూడా.. అదే దూకుడుతో 2024కు మరింత కష్టపడి పని చేయాలని వారికి సూచించడంతో పాటు.. గెలుపు కానుక అందుకోండి అంటూ వరాల జల్లు ప్రకటించారు ఎంపీ విజయసాయి రెడ్డి.

ఇంకా చదవండి ...

  MP Vijaysai Reddy: గత ఎన్నికల ముందే వైసీపీ (YCP) గాలి స్పష్టంగా కనిపించింది. చాలామంది మందు జగన్ పార్టీ జై భేరీ మోగిస్తుందని అంచనా వేశారు.. అయితే ఆ స్థాయిలో ప్రభంజనం ఉంటుంది అని ఎవరూ అనుకోలేదు.. కానీ 151 సీట్లతో అఖండ విజయం సాధించింది వైసీపీ.. అయితే ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది మాత్రం సోషల్ మీడియా  (Social Medis)వింగ్ అనే చెప్పాలి.. ఇది ఎవరో చెప్పిన మాట కాదు.. స్వయంగా పార్టీ కీలక నేత.. వైసీపీ అనుంబంధ విభాగాల ఇన్ ఛార్జ్.. ఎంపీ విజయసాయి రెడ్డి(MP Vijayasai Reddy)  సైతం ఆ మాటను అంగీకరించారు. వైసీపీ అధికారంలోకి రావటానికి సోషల్ మీడియా కార్యర్తల పాత్రను ఆయన మరోసారి అభినందించారు. పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్ గా నియమితులైన తరువాత అన్ని విభాగాలతో వరుసగా విజయ సాయిరెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోషల్ మీడియా విభాగంతో సమావేశమైన సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కొంత మంది సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకుంటామని చెప్పారు. విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసిన.. సీఎం జగన్‌ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలతో 2024లోనూ వైఎస్సార్‌సీపీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే గత సేవలకు గుర్తింపు గాను.. పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్‌ తనను ఆదేశించారన్నారు. సోషల్‌ మీడియా కార్యకర్తలు ఏ విధంగా పార్టీకి సేవకులో.. తానూ అదే విధంగా పార్టీకి సేవకుడినేనని స్పష్టం చేశారు. ప్రతి మండలానికి, నియోజకవర్గానికి, పార్ల్లమెంట్‌ నియోజకవర్గానికి సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ను నియమిస్తామని వెల్లడించారు.

  సోషల్ మీడియాలో ఉన్న వారు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్‌ మీడియా కార్యకర్తలు చురుగ్గా వ్యవహరించి, టీడీపీ అన్యాయాలను, చంద్రబాబు దురాగతాలను ఎప్పటికప్పుడు ఎండగట్టి పార్టీని ప్రజలకు చేరువ చేశారు. వీరి కోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందిస్తాం. పార్టీ కార్యకర్తల తరహాలోనే సోషల్‌ మీడియా కార్యకర్తలకు సభ్యత్వ కార్డులు ఇస్తామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండగా పార్టీ సభ్యత్వ నమోదు సాధారణ స్థాయిలో జరిగింది. ఇప్పుడు ఇతర పార్టీల కంటే అత్యధికంగా సభ్యత్వ నమోదు చేయాలని చెప్పారు. జూలై 8న వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు.

  ఇదీ చదవండి : ఏపీలో కేసీఆర్ కు పాలాభిషేకాలు.. మరి సీఎం జగన్ పరిస్థితి ఏంటి..?

  ఈ సందర్భంలో ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు. టీడీపీ సహా ప్రతిపక్షాలను టార్గెట్ చేయండి.. కానీ వ్యక్తిగత దూషణలు వద్దని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను టార్గెట్‌ చేయాలే కానీ ఎగ్జిక్యూటివ్స్‌ను, జ్యూడిషియరీని టచ్‌ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. అలాంటప్పుడు సోషల్‌ మీడియా కార్యకర్తలపై ఎవ్వరూ కేసులు పెట్టే అవకాశం ఉండదని సలహా ఇచ్చారు. అలాగే సభ్యత్వం తీసుకున్న వారికి బీమా కల్పించే అంశంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సాయిరెడ్డి హామీ ఇచ్చారు. పార్టీ కార్యాలయంలో హెల్ప్‌ లైన్‌ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యకర్తలకు ఏ సహాయం కావాలన్నా చేస్తామని సాయిరెడ్డి స్పష్టం చేసారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Social Media, Vijayasai reddy, Ysrcp

  ఉత్తమ కథలు