Home /News /andhra-pradesh /

AP POLITICS BIG FIGHT BETWEEN YCP AND TDP ON NTR DAUGHTER UMA MAHESWARI SUICIDE NGS GNT

Nara Lokesh: పిన్నిని చంపిందెవరు అంటూ వైసీపీ ప్రశ్నల వర్షం.. మీదే రక్త చరిత్ర అంటూ లోకేష్ కౌంటర్.. వాస్తవం ఏంటి..?

నారా లోకేష్ (ఫైల్)

నారా లోకేష్ (ఫైల్)

Nara Lokesh: దివంగత ఎన్టీఆర్ కుమార్తె మరణం చుట్టూ రాజకీయం రచ్చ రచ్చ అవుతోంది. అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ.. ఉమా మహేశ్వరి మరణంపై రాజకీయ రంగుపైనే జోరుగా చర్చ జరుగుతోంది. వైసీపీ చేస్తున్న ప్రచారంపై నారా లోకేష్ ఘాటుగా స్పందించారు.. ఆయన ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
  Nara Lokesh: ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి (Uma Maheswari) హైదరాబాద్ (Hyderabad) లో ఆత్మహత్య చేసుకున్నా.. ఆ రాజకీయ ప్రకంపణలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొనసాగుతున్నాయి. ఆమె అంత్యక్రియలు ముగిసినా రాజకీయ దుమారం ఆగడం లేదు. అధికార వైసీపీ (YCP), టీడీపీ (TDP) నేతల మధ్య.. ఆమె ఆత్మహత్య వ్యవహారం పై పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు చంద్రబాబు నాయుడు  (Chandrababu Naidu) కారణం అన్నది వైసీప నేతల ఆరోపణ.. ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రం పదే పదే అవే విమర్శలు చేస్తున్నారు. ఉమామహేశ్వరి మరణంపై అనుమాలున్నాయని.. చంద్రన్న వేధించాడా? లేదా ఇంకెవరైనా చంపి ఉరివేశారా? ఎన్టీఆర్ కూతురు బేలగా ఆత్మహత్య చేసుకుందంటే ఎవరూ నమ్మడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. CBI దర్యాప్తు కోరి నిజం నిజం నిగ్గు తేల్చాలి బాబన్నా అంటూ కోరారు విజయసాయి రెడ్డి (Vijayasai Reddy)..

  అక్కడితోనే విజయసాయి రెడ్డి విమర్శలు ఆగలేదు. ఇంట్లో పార్థివదేహం పెట్టుకొని టీడీపీ జూం మీటింగ్ పెట్టడాన్ని సొంతపార్టీ నేతలే చంద్రబాబుని ఛీ కొడుతున్నారు. ప్రజలు ఛీకొట్టి, సొంత పార్టీ నేతలతో ఛీ కొట్టించుకున్నా అలవాటైన అచ్చొచ్చిన శవరాజకీయాలు మాత్రం బాబు వదులుకోలెకపోతున్నారని ట్వీట్ చేశారు.

  అలాగే లోకేష్ ను ఉద్దేశిస్తూ.. మరణించాక ఎన్టీఆర్‌ శవాన్ని లాక్కున్నారు.. కోడెల శివప్రసాద్ కంటే ముందుగా ఆయన సెల్‌ ఫోన్‌కు అంత్యక్రియలు చేశారు.. ఇప్పుడు.. లోకేష్ పిన్ని గారు చున్నీతో ఉరి వేసుకుందంటున్నారు.. ఏం క్రిమినల్స్‌ ఫ్యామిలీరా బాబూ మీది అంటూ మండిపడ్డారు.


  చిన్న‌మ్మ మ‌ర‌ణంతో మేము విషాదంలో వుంటే విష‌ప్ర‌చారం చేస్తూ వినోదం పొందుతారా? జగన్ (jagan mohan reddy) పైశాచిక ఆనందానికి ఎక్స్‌పెయిరీ డేట్ ద‌గ్గ‌ర ప‌డింది. చేస్తున్న పాపాలకు ఆ దేవుడి స్క్రిప్ట్ ప్రకారం శిక్ష అనుభవిస్తారు. కోడికత్తి డ్రామా, బాబాయ్ గుండెపోటు అంటూ ఆస్కార్ రేంజ్ న‌టన, ఒకే కులం డిఎస్పీలు 35 మందికి ప్ర‌మోష‌న్లు, పింక్ డైమండ్ పేరుతో ఇప్పటికే అస‌త్య విష‌ప్ర‌చారం చేశారు. అదే తరహాలో నేడు తప్పుడు సర్వే నెంబర్లు సృష్టించి నా చిన్న‌మ్మ ఉమామ‌హేశ్వ‌రి మ‌ర‌ణంపైనా విషప్రచారం చెయ్యబోయి బొక్కబోర్లా పడ్డారని మండిపడ్డారు.

  తండ్రి శ‌వాన్ని అడ్డుపెట్టుకుని సీఎం కావాల‌ని సంత‌కాలు చేసిన నీచ చ‌రిత్ర జ‌గ‌న్‌ది అని లోకేష్ ఆరోపించారు. గత ఎన్నిక‌ల్లో సానుభూతి కోసం బాబాయ్ మ‌ర్డ‌ర్‌నీ వాడుకున్నారని... టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసిన సైకో జగన్ తన క్రిమినల్ రూపాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని లోకేష్ ఘాటైన విమర్శలు చేశారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, TDP, Vijayasai reddy

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు