MP Raghurama Krishna Raju : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అధికార వైసీపీకి.. తలనొప్పిగా మారారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghu Rama Krishna Raju).. వేదిక ఏదైనా ఏపీలో అధికార పార్టీపైనా.. సీఎం జగన్ మోహన్ రెడ్డి విధానాలపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సొంత పార్టీ నేత అయి ఉండి విమర్శలు చేస్తుండడంతో.. వైసీపీ పెద్దలకు తలనొప్పిగా మారింది.. అలాగని ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయించాలని చూస్తే అది కుదరడం లేదు. ఇప్పటికే వైసీపీ ఎంపీలు అన్ని రకాల ప్రయత్నాలు చేసినా.. అది సక్సెస్ కాలేదు. దీంతో రఘు రామ పేరు వింటేన వైసీపీ పెద్దలకు టెన్షన్ తప్పడం లేదు. ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో తెలియక ఇబ్బంది పడుతున్నారు.అయితేగా హస్తిన వేదికగా.. అది కూడా లోక్ సభ (Loksabha)లో.. అందరి ముందే వైసీపీ ఎంపీలకు.. రెబల్ ఎంపీ రఘురామ కు మాటల యుద్ధం నడించింది.. ఎంతలా అంటే ఆఖరికి వైసీపీ ఎంపీలపై కోపంతో ఆయన తన ముఖానికి చేతిని అడ్డుపెట్టుకుని మరి.. చెప్పాల్సిన మాటలన్నీ స్పీకర్ కు వివరిస్తూ చెప్పారు.
ఏపీ ప్రభుత్వం చేస్తున్న భారీ అప్పులపై ఇప్పటికే విమర్శలు చేస్తున్న రఘురామరాజు.. ఇవాళ లోక్ సభలోనూ ఆ విషయాన్ని లేవనెత్తారు. దీంతో వైసీపీ ఎంపీలు ఆయన్ను అడ్డుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు రావలసిన ఆదాయాన్ని ఎపి బెవరేజెస్ కార్పొరేషన్ కు మళ్లించి, ఈ మళ్లించిన ఆదాయాన్ని ఆ కార్పొరేషన్ ఆదయంగా చూపిస్తూ ఆ కార్పొరేషన్ పేరు మీద అప్పులు చేస్తుందని ఈరోజు పార్లమెంటులో తెలిపాను. pic.twitter.com/uZXWBoXh6f
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) July 21, 2022
ఏపీలో కార్పోరేషన్ల పేరుతో వైసీపీ సర్కార్ తీసుకుంటున్న రుణాల వ్యవహారాన్ని ఎంపీ రఘురామరాజు ఇవాళ లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. జగన్ సర్కార్ కార్పోరేషన్ల పేరుతో రుణాలు తీసుకోవడంతో పాటు ఆ నిధుల్ని కూడా ఇతరత్రా అవసరాల కోసం మళ్లిస్తోందని రఘురామ ఆరోపించారు.
అందుకు తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అన్నారు. తాజాగా ఏపీ బేవరెజేస్ కార్పోరేషన్ పేరుతో అప్పులు తీసుకోవడం, వాటిని మూలనిధికి జమ చేయకపోవడాన్ని రఘురామ తప్పుబట్టారు. దీంతో వైసీపీ ఎంపీలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. లోక్ సభలో రఘురామ ప్రసంగం మొదలుకాగాన వైసీపీ ఎంపీలు మార్గాని భరత్, వంగ గీతతో పాటు పలువురు ఆయన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడకుండా అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ స్ధానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ వారిని వారించారు. అయినా వారు వినిపించుకోలేదు అదే సమయంలో రఘురామ కూడా వారితో వాగ్వాదానికి దిగారు.
ఇదీ చదవండి : అసెంబ్లీకి సై అంటున్న రామ్మోహన్.. బాబాయ్ అందుకు ఒకే అంటారా..? ఇంటిపోరు తప్పదా..?
దీంతో సభాధ్యక్ష స్ధానాన్ని ఉద్దేశించి మాట్లాడాలని రఘురామకు ఆయన సూచించారు. దీంతో వైసీపీ ఎంపీల వైపు చూడకుండా.. తన అరచేతిని అడ్డుపెట్టుకుని మరీ మాట్లాడారు. తాను స్పీకర్ ను ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నట్లు చెప్పారు. వైసీపీ ఎంపీలు తన ఆరోపణలు నిరాధారమని చేస్తున్న విమర్శలపై ఘాటుగానే స్పందించారు. ఏపీ ప్రభుత్వం కార్పోరేషన్ల పేరుతో రుణాలు తీసుకునేందుకు ప్రత్యేక జీవోను కూడా తెచ్చిందని అన్నారు. దీంతో మరోసారి వైసీపీ ఎంపీలు అడ్డుతగలగా..వారిని సిట్ డౌన్ అంటూ రఘురామ వార్నింగ్ ఇచ్చారు. తమను కూర్చోమని చెప్పడానికి రఘురామ ఎవరంటూ వైసీపీ ఎంపీలు వివాదానికి దిగారు. చివరకు రఘురామ తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పిన తరువాత కూర్చున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 17th Lok Sabha, Andhra Pradesh, AP News, MP raghurama krishnam raju, Ycp