హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి బిగ్ షాక్.. జగన్ ఏం చేయబోతున్నారు ?

YS Jagan: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి బిగ్ షాక్.. జగన్ ఏం చేయబోతున్నారు ?

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

AP News: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నికలు జరిగినా. విజయం తమదే అనే భావనలో ఆ పార్టీ నాయకత్వం. అలాంటి పరిస్థితుల్లో వైసీపీ నాయకత్వం తమకు ద్రోహం చేసిన ఎమ్మెల్యేను పదవుల నుంచి తొలగించి ఉప ఎన్నికలకు సిద్ధమవుతుందా ? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్‌ను నమ్ముకుని రంగంలోకి దిగిన టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ.. అనూహ్యంగా విజయం సాధించారు. దీంతో వైసీపీ నిలబెట్టిన ఏడుగురు ఎమ్మెల్సీల్(Mlc Elections)లో ఒకరు ఓడిపోయారు. తమ పార్టీ నుంచి కొందరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడతారనే అనుమానంతో వైసీపీ(Ysrcp) అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. అయినా క్రాస్ ఓటింగ్ జరగకుండా వైసీపీ నాయకత్వం అడ్డుకోలేకపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో జోష్ మీదున్న టీడీపీకి ఈ ఎన్నిక మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక ఈ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా క్రాస్ ఓటింగ్(Cross Voting) చేసింది ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. దీనిపై మరికాసేపట్లోనే పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

వైసీపీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యేలు ఈ ఇద్దరేనా ? లేక వేరే వాళ్లా ? అన్నది మరికొద్దిసేపట్లోనే తేలిపోనుంది. అయితే వైసీపీకి షాక్ ఇచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ఏం చేయబోతున్నారనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నికలు జరిగినా. విజయం తమదే అనే భావనలో ఆ పార్టీ నాయకత్వం. అలాంటి పరిస్థితుల్లో వైసీపీ నాయకత్వం తమకు ద్రోహం చేసిన ఎమ్మెల్యేను పదవుల నుంచి తొలగించి ఉప ఎన్నికలకు సిద్ధమవుతుందా ? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకవేళ సీఎం జగన్ ఈ విషయంలో ముందుకుసాగితే.. ఏపీ రాజకీయం మరింత రసవత్తరంగా మారడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Breaking News: జయమంగళం ఓటమికి కారణాలు ఇవే? ఆ ఇద్దరిపై వేటు తప్పదా..? సంబరాల్లో టీడీపీ

Breaking News: వైసీపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచమర్తి అనురాధ గెలుపు

అయితే ఒకవేళ స్పీకర్ వైసీపీ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటే.. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు కూడా తమ పదవులు కోల్పోవాల్సి ఉంటుంది. ఇక టీడీపీకి ఓటు వేసిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా తమ పదవులు కోల్పోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు ఎదురైతే వైసీపీ నాయకత్వం ఈ విషయంలో ఏ రకంగా ముందుకు సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో ఎవరు ఎవరికి ఓటు వేశారనే విషయాలను టెక్నికల్‌గా ప్రూవ్ చేయలేరని.. కాబటి అసలు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడమనే ప్రశ్నే ఉండదని పలువురు చెబుతున్నారు. మొత్తానికి తాజా ఎన్నికలు సీఎం జగన్‌కు ఊహించని సవాళ్లను ముందుంచాయని అర్థమవుతోంది.

First published:

Tags: Andhra Pradesh, Ap mlc elections

ఉత్తమ కథలు