ఉత్కంఠ రేపే అంశం ఏది ఉన్నా.. వెంటనే బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగిపోతుంటారు. తాజాగా ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలోనూ భారీగా బెట్టింగ్(Betting) జరిగినట్టు తెలుస్తోంది. సాధారణ ఎన్నికలను తలపించేలా ఎమ్మెల్సీ ఎన్నికలపై బెట్టింగ్ జరిగినట్టు సమాచారం. టీడీపీ(TDP) గెలవడానికి ఒక ఓటు అవసరం కావడంతో ఈ ఎన్నికలపై ఆసక్తి పెరిగింది. ఆ ఓటు ఎటు అనే దానిపై బెట్టింగ్ రాయుళ్లు పందాలు వేస్తున్నారు. టీడీపీ గెలుపోటములపై బెజవాడతోపాటు హైదరాబాదలోనూ భారీగా బెట్టింగ్‌లు జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలు, పోటీలో 8 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ చేతిలో 21 ఓట్లు ఉండగా, గెలవడానికి మరో ఓటు అవసరం కానుంది. తన ఎమ్మెల్యేలను కట్టడి చేసిన వైసీపీ విజయంపై ధీమాలో అధికార పార్టీ ఉంది.
అంతకుముందు నెల్లిమర్ల వైసీపీ(Ysrcp) ఎమ్మెల్యే అప్పలనాయుడు ఓటుతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కుమారుడి వివాహం కారణంగా అప్పలనాయుడు ఆలస్యంగా వచ్చి ఓటు వేశారు. వివాహం అనంతరం ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి విజయవాడకు వచ్చి వైసీపీ ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పలనాయుడు కోసం వైసీపీ చాపర్‌ను పంపించింది. విశాఖ నుంచి గన్నవరంకు వైసీపీ ఎమ్మెల్యే చేరుకున్నారు. అనంతరం ఏపీ అసెంబ్లీకి చేరుకుని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు. దీంతో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం ఈ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ సాగుతోంది.
ఉదయం 9 గంటలకు వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్థులో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తరువాత ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి , రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఉషశ్రీ చరణ్, దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, మేకతోటి సుచరిత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలా ఒక్కొక్కరుగా వైసీపీ ఎమ్మెల్యేలు అంతా తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Breaking News: ముగిసిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పోలింగ్.. గెలుపు ఎవరిది..? క్రాస్ ఓటింగ్ జరిగిందా?
AP High Court: అమరావతి నుంచి హైకోర్టు తరలింపు.. రాజ్యసభలో కేంద్రం వివరణ
ఇక మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వచ్చి ఓటే వేశారు. చంద్రబాబుతో పాటు నందమూరి బాలకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు వీల్ చెయిర్‌లో వచ్చి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. డోలా బాలవీరాంజనేయస్వామి, నిమ్మలరామానాయుడు, అచ్చెన్నాయుడు , గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఇలా తెలుగు దేశంకు చెందిన ఎమ్మెల్యేలు అంతా ఒకేసారి వచ్చి ఓటు వేశారు. వైసీపీ ఎమ్మెల్యేల నుంచి క్రాస్ ఓటింగ్ జరిగితేనే టీడీపీ గెలుపు సాధ్యమవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Betting