హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Horsley Hills: అక్కడ కొండెక్కితే మేఘాలు అందుతాయా..? ఆంధ్రా ఊటీ హార్సిలీ హిల్స్ ఏ సమయంలో వెళ్లాలి.? ఎలా వెళ్లాలో తెలుసా?

Horsley Hills: అక్కడ కొండెక్కితే మేఘాలు అందుతాయా..? ఆంధ్రా ఊటీ హార్సిలీ హిల్స్ ఏ సమయంలో వెళ్లాలి.? ఎలా వెళ్లాలో తెలుసా?

హార్సిలీ హిల్స్

హార్సిలీ హిల్స్

  • News18 Telugu
  • Last Updated :
  • Chittoor, India

Horsley Hills: అక్కడి కొండ ఎక్కితే మేఘాలు చేతికి అందుతాయా.. దూరం నుంచి అలానే అనిపిస్తుంది. అంతేకాదు అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సౌందర్యం (Best Tourist Spot) ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇంత సుందరమైన ఆ ప్రదేశం ఎక్కడో లేదు. అది కూడా మన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనే ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా (Chitoor District)లోని మదనపల్లె పట్టణానికి 29 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంత ఎత్తులో ఉండటంతో వేసవిలో సైతం ఇక్కడ చల్లగా.. ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి ప్రకృతి అందాల విందు చేస్తుంటాయి. ఫిబ్రవరి నెలలో.. ఈ ప్రాంతంలో చక్కని వాతావరణం ఉంటుంది. ఇంతటి ఆహ్లాదకరమైన ప్రదేశం 'హార్సిలీ హిల్స్ (Horsley HIlls) లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.


ఈ హిల్స్ వెనుక చరిత్ర ఏమి అన్నది చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక్కడికి వచ్చే సందర్శకులు ప్రకృతి అందాలను తిలకిస్తూ మైమరచే ఆహ్లాదకరమైన వాతావరణానికి ముగ్ధులవుతారు. చిరుజల్లులు కురిస్తే ఆ ప్రకృతి అందానికి మైమరచే ప్రకృతి ప్రేమికులెందరో. అలాంటి అందమైన హార్సిలీహిల్స్‌ను 153 ఏళ్ల క్రితమే బ్రిటీష్‌ ప్రభుత్వం వేసవి విడిది కేంద్రంగా ప్రకటించి ఉత్తర్వులు జారీచేసింది.తూర్పు కనుమలలోని దక్షిణ భాగంలో ఈ కొండలు ఉన్నాయి. 'హార్సిలీ హిల్స్' బెంగళూరు నుండి 160 కి.మీ., తిరుపతి నుండి 140 కి.మీ. దూరంలో ఉంది. చలికాలంలో 3 డిగ్రీల సెంటీగ్రేడు నుండి మండు వేసవిలో 32 డిగ్రీల సెంటీ గ్రేడు వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. వేసవిలో ఉపశమనం కోసం పర్యాటకులు ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో పర్యాటకులు తాకిడి అధికంగా ఉంటుంది. హార్సిలీ హిల్స్‌కు వెళ్లే కొండదారి సైతం అద్భుతంగా ఆకట్టుకుంటుంది. రెండు వైపులా నీలగిరి (యూకలిప్టస్) వంటి అనేక జాతుల చెట్లతో కళ్లకు కనువిందుగా ఉంటుంది. జింకలు, చిరుతపులుల వంటి వన్యమృగాలు కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తుంటాయి. ఇక్కడి సూర్యోదయం, సూర్యాస్తమం పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తాయి. ఇక్కడ నిర్వహించే ట్రెక్కింగ్, కొండలు పాకడం, ఇతర సాహస కృత్యాల్లో పాల్గొనడం కోసమే చాలా మంది వస్తూ ఉంటారు.


ఇదీ చదవండి: గోశాల నిర్వహించే ఆలయాలకు ప్రత్యేక నిధులు.. ఇకపై ప్రతి నెల ఏదో ఒక జిల్లాలో శ్రీవారి కళ్యాణం


ఈ హిల్స్ కు ఇంత గుర్తింపు రావడం వెనుక చాలానే హిస్టరీ ఉంది. డబ్ల్యూడీ హార్సిలీ తొలుత మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై కడప కలెక్టర్‌ అయ్యాక గుర్రంపై కొండకు రాకపోకలు సాగించారు. మద్రాసు ప్రభుత్వ అనుమతితో వేసవి విడది కేంద్రంగా మార్చారు. తొలి అతిథి గృహ నిర్మాణం కోసం అనుమతి పొంది వాటికి కావాల్సిన పెంకులను ఓడ ద్వారా ఇంగ్లాండు నుంచి దిగుమతి చేసుకొని కొండకు తరలించుకొన్నారు. ఒకప్పటి దట్టమైన అడవితో నిండిన హార్సిలీహిల్స్‌పై భూమి అంతా అటవీశాఖదే. వేసవి విడిది కేంద్రంగా గుర్తింపు దక్కిన 90 ఏళ్ల తర్వాత అంటే 1959లో అటవీశాఖ 103 ఎకరాలను రెవెన్యూశాఖకు బదలాయించింది. లేదంటే ఈ రోజుకు హార్సిలీహిల్స్‌ మొత్తం నిషేధిత రిజర్వ్‌ఫారెస్ట్‌ పరిధిలో ఉండేది.


ఇదీ చదవండి : జనసేన -టీడీపీ పొత్తు ఫిక్స్.. ఎవరికి ఎన్ని సీట్లు.. కేసీఆర్‌ వ్యూహం సిద్ధం చేసిన పవన్‌


వేసవి విడిది కేంద్రంగా హార్సిలీహిల్స్‌కు బ్రిటీష్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇక్కడ విడిది చేసేందుకు అతిథిగృహం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ హార్సిలీ మద్రాసు ప్రభుత్వానికి లేఖ రాయగా రిజర్వ్‌ ఫారెస్ట్‌లో బంగ్లా నిర్మించుకునేందుకు 1869 జూన్‌9న జీఓఎంఎస్‌ నంబర్‌ 4162ను జారీచేసింది. దీంతో 1869లోనే తొలి అతిథి గృహ నిర్మాణం మొదలైంది. హార్సిలీ ఇంగ్లాండ్‌ నుంచి ఓడలో పెంకులను మద్రాసుకు తెప్పించి, అక్కడినుంచి కొండకు రవాణా చేయించుకున్నారు. అటవీశాఖ అతిథిగృహాల్లో ఒకటైన ఇప్పుడు కళ్యాణి అతిథిగృహంగా పిలుచుకునే గది పైకప్పుకు ఈ పెంకులు వాడారు.


ఇదీ చదవండి : చంద్రబాబు దూకుడు.. ఇప్పటికే నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారు.. లిస్ట్ ఇదే


ఇంగ్లాండ్‌లో 1865లో బేస్డ్‌ మిషన్‌ టైల్‌ వర్క్స్‌ అనే కంపెనీ పెంకులను తయారు చేసినట్టు పెంకులపై అక్షరాలు, కంపెనీ వివరాలు కనిపిస్తున్నాయి. తర్వాత కొన్నేళ్లకు ఘాట్‌రోడ్డు నిర్మాణం చేసింది కూడా బ్రిటిష్‌ ప్రభుత్వంలోనే. హార్సిలీహిల్స్‌ను అధికారిక విడిది కేంద్రంగా చేసుకునేందుకు అప్పటి ప్రభుత్వానికి అనుమతి కోరుతూ కడప కలెక్టర్‌ హార్సిలీ లేఖ పంపారు. ఈ లేఖపై బ్రిటీష్‌ మద్రాసు ప్రభుత్వం హార్సిలీహిల్స్‌ను వేసవి విడిది కేంద్రంగా ప్రకటిస్తూ 1869 మే4న జీఓఎంఎస్‌ నంబర్‌ 11579ను జారీచేసింది. అప్పటినుంచి 153 ఏళ్లుగా వేసవి విడది కేంద్రంగా హార్సిలీహిల్స్‌ సందర్శకులను ఆకట్టుకుంటోంది. 60 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌కు కూడా అధికారికంగా ఇది వేసవి విడిది కేంద్రంగా గుర్తించారు. పలువురు గవర్నర్లు ఇక్కడ విడిది చేశారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Ap tourism, Chitoor, Tourist place

ఉత్తమ కథలు