హోమ్ /వార్తలు /andhra-pradesh /

Bandla Ganesh: షాకింగ్.. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయనంటున్న బండ్ల..

Bandla Ganesh: షాకింగ్.. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయనంటున్న బండ్ల..

బండ్ల గణేష్ కాల్ రికార్డింగ్ లీక్ (bandla ganesh)

బండ్ల గణేష్ కాల్ రికార్డింగ్ లీక్ (bandla ganesh)

బండ్ల గణేష్‌కు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అని అందరికీ తెలిసిందే. అయితే హఠాత్తుగా పవన్‌తో సినిమా చేయనంటున్నాడు ఈ ప్రముఖ నిర్మాత.

  టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్,నటుడు బండ్ల గణేష్ గురించి మనకందరికీ తెలిసింద. సోషల్ మీడియాలో బండ్ల ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. అప్పుడప్పుడు పాలిటిక్స్ పై కూడా ఆసక్తికరమైన ట్వీట్స్ చేస్తుంటాడు. ఇక మన బండ్లకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. పవన్‌కు పెద్ద ఫ్యాన్. టాలీవుడ్ సినిమా పరిశ్రమలోకి కమెడీయన్‌గా అడుగుపెట్టిన బండ్ల గణేష్ మెల్లగా నిర్మాత అయ్యాడు. ఆ తర్వాత రాజకీయాలలోకి వెళ్లి మళ్లీ యూటర్న్ తీసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. ప్రస్తుతం మాత్రం బండ్ల ఫుల్ టైం సినిమాలతోనే బిజీగా ఉంటానంటున్నాడు. పవన్‌ కల్యాణ్ ఆరాధ్యదైవమంటూ.. ఈశ్వరా.. పవనేశ్వరా అంటూ.. పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటుంటారు నిర్మాత బండ్ల గణేష్.

  తాజాగా పవన్ కళ్యాణ్ విషయంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు బండ్ల గణేష్. అయితే పవన్ కళ్యాణ్‌తో మొన్నటి వరకు సినిమాలు చేస్తా అన్న బండ్ల గణేష్ ఇప్పుడు ఆయనతో సినిమాలు చేయనంటున్నాడు. దాని వెనక ముఖ్యమైన కారణం కూడా ఉంది. గతంలో నిర్మాతగా పవన్ కళ్యాణ్‌తో గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ మూవీ తీసిన బండ్ల గణేష్ ఈ మధ్య కాలంలో మళ్లీ నిర్మాతగా ఆయనతో సినిమా చేయబోతున్నానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో బండ్ల పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయకూడదని అనుకుంటున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో బండ్ల వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

  అయితే బండ్ల వ్యాఖ్యల వెనుక ఉద్దేశం మాత్రం వేరేగా ఉంద. ప్రస్తుతం పవన్ రాజకీయాలతో ఫుల్ బిజీగా మారిన విషయం తెలిసిందే. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే... మరో వైపు నాలుగైదు సినిమాలు కమిట్ అయ్యారు. వాటిని పూర్తి చేసే పనిలో పడ్డారు. దీంతో ఆ సినిమాలు పూర్తి చేసుకుని తనకు అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తానంటున్నారు. పవన్ కళ్యాణ్‌గారితో సినిమా చేయకూడదని అనుకుంటున్నానని తెలిపారు బండ్ల గణేష్. ఎందుకంటే ఆయన త్వరగా ముఖ్యమంత్రి అయిపోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.

  దర్శకుడితో గొడవలు అయ్యి సినిమా ఆగిపోయిందనే వార్తల్లో నిజం లేదన్నారు బండ్ల గణేష్. సినిమానే నాకిష్టం, సినిమానే నా ప్రాణం. సినిమాలే నా మోషన్ కాబట్టి సినిమాలు తీస్తా అన్నారు బండ్ల. 'మరి మీకు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ ఇస్తే తీసుకుంటారా? ఆయన అలా ఇస్తే మినిష్టర్ కూడా అవుతారు కదా!' అని అడిగిన ప్రశ్నకు బండ్ల గణేష్ రియాక్ట్ అవుతూ ''నాకు ఎమ్మెల్సీలు, రాజ్యసభలు, ఎంపీలు వద్దు సార్‌. వార్డు మెంబర్‌గా జనం దయతో గెలిస్తే ఆ కిక్కే వేరంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయం అనే పడవలో తాను లేనన్నారు.

  భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం  తీసుకుంటానన్నారు. బొత్స సత్యనారాయణగారి గురించి, పవన్ కళ్యాణ్‌గారి గురించి నన్ను అడగకండి అన్నారు బండ్ల. ఎందుకంటే వారంటే నాకు ప్రేమ...నా ఫ్యామిలీని ప్రేమించినట్లే వారిని ప్రేమిస్తాను అన్నారు బండ్ల గణేష్‌. మొత్తం మీద బండ్ల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బండ్ల చేసిన వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ కూడా చర్చించుకుంటున్నారు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Bandla Ganesh, Pawan kalyan

  ఉత్తమ కథలు