హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Jr NTR-Balayya: బాబాయ్ బాలయ్య ఫైర్.. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ అంటూ చర్చ..

Jr NTR-Balayya: బాబాయ్ బాలయ్య ఫైర్.. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ అంటూ చర్చ..

బాలకృష్ణ, ఎన్టీఆర్ (Twitter/Photo)

బాలకృష్ణ, ఎన్టీఆర్ (Twitter/Photo)

Jr NTR-Balayya: తాను రాజకీయాలకు దూరంగా ఉన్నాను అంటున్న జూనియర్ ఎన్టీఆర్ ను మాత్రం రాజకీయాలు వీడడం లేదు. ఆయన స్పందించినా.. స్పందించకపోయినా.. ట్రోల్స్ బారిన పడుతూనే ఉన్నారు. ఆ మధ్య అమిత్ షానే స్వయంగా తారక్ ను కలవడంతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఇప్పుడు మరోసారి జూనియర్ ఎన్టీఆర్ తీరుపై రచ్చ మొదలైంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Jr NTR-Balayya: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు (Health University Name Changed) అంశం రచ్చ అవుతోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును.. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా మార్చడంపై దుమారం రేగుతోంది. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నుంచి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), నారా లోకేష్ (Nara Lokesh) సహా.. అందరి నేతలు మండిపడుతున్నారు. ఆందోళనలకు కూడా సిద్ధమయ్యారు. కేవలం టీడీపీ నేతలే (TDP Leaders) కాదు.. ఇతర పార్టీ నేతలు కూడా స్పందిస్తున్నారు. బీజేపీ (BJP), జనసేన (Janasena), కమ్యూనిస్టు పార్టీ (Communist Party)లు సైతం సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. అయితే ఎవరు స్పందించినా లేకున్నా.. నందమూరి కుటుంబ సభ్యుల స్పందన గురించే అందరూ చూస్తారు. ఇప్పటికే ఆ కుటుంబం నుంచి చాలామంది స్పందించారు. తాజాగా ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. హెల్త్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్- వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడం దురదృష్టకరం అన్నారు. ఎన్టీఆర్ పేరును తొలగించడం తెలుగు జాతిని అవమానించడమే అని మండిపడ్డారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.

  దీంతో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ అనే చర్చ మొదలైంది.. తాతా అంటే గౌరవం అని.. తాత పెట్టిన పార్టీ కోసం ఏదైనా చేస్తాను అని చెప్పే జూనియర్ ఎన్టీఆర్.. ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కొందరు అభిమానులు సైతం అన్నా ఇప్పుడు కూడా స్పందించకపోతే బాధ కలుగుతుందన్నా అంటూ చర్చకు తెరలేపుతున్నారు.

  ఎందుకంటే గతంలో చంద్రబాబు పర్యటనల సమయంలో పలు ప్రాంతాల్లో జూనియర్ ను తిరిగి పార్టీలోకి తీసుకురావాలంటూ కుప్పం తో సహా పలు ప్రాంతాల్లో అభిమానులు డిమాండ్ చేసారు. కానీ, దీని పైన చంద్రబాబు ఎక్కడా స్పందించలేదు. గోరంట్లు బుచ్చయ్య చౌదరి లాంటి వారు మాత్రం పార్టీకి జూనియర్ సేవలు అవసరమంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేసారు. ఇలా ఆయన చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నప్పుడు.. ఇంత పెద్ద ఇష్యూపై తారక్ స్పందించకపోవడం ఏంటనే చర్చ రచ్చ రచ్చ అవుతోంది.

  ఇదీ చదవండి : దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే.. పెద్దాయన పేరు మారిస్తే.. జగన్ జాతకమే మారింది

  గతంలో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యల విషయంలోనూ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. అయితే అంత ఘాటుగా స్పందించలేదని.. ఏదో మొక్కుబడిగా మాట్లాడారు అంటూ ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ నేతలు. అయితే ఇప్పుడు తాను ఆరాధ్య దైవంగా చెప్పుకునే తాత పేరు యూనివర్శిటీకి తొలగించినా.. ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదన్నది టీడీపీ వర్గాల ప్రశ్న.. ఆలస్యంగా అయినా తారక్ దీనిపై స్పందిస్తారో లేదో చూడాలి.

  ఇదీ చదవండి: ఈ నెల 27న తిరుమలకు సీఎం జగన్ .. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రమ్మని ఆహ్వానం

  అయితే ఎన్టీఆర్ కుటుంబం నుంచి అంతా స్పందిస్తున్నారు. అధికార వైసీపీ చర్యను తప్పు పడుతున్నారు. బీజేపీ నేత.. ఎన్టీఆర్ కుమార్తె 1986లో ప్రారంభమైన హెల్త్ యూనివర్శికీ స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ పేరు సరిగ్గా సూటైందని ఆమె అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా.. ఎలాంటి చర్చ లేకుండా.. కేవలం రాజకీయ కారణాలతో ఎన్టీఆర్ పేరును తొలగించడం సరైన చర్య కాదని అన్నారు. విశ్వవిద్యాలయం స్థాపించింది ఎన్టీఆర్ అని.. వైఎస్సార్ కు ఏం సంబంధమని ఆమె ప్రశ్నించారు.

  డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలగించడాన్ని స్వర్గీయ ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి రామకృష్ట ఖండించారు. ఆ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ యూనివర్సిటీకి మూల కారకుడు, వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. అన్ని మెడికల్ కాలేజీలు ఒకే పాలసీతో నడవాలనేది వారి భావన అని.. ఆ ఉద్దేశంతోనే 1986లో ఈ మెడికల్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీనీ స్థాపించారని అన్నారు. ఎన్టీఆర్ నిర్ణయం పట్ల అప్పట్లో అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు తమతమ మద్దతుతో పాటు హర్షం కూడా వ్యక్తం చేశారని రామకృష్ట గుర్తు చేశారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh assembly session, AP News, Jr ntr, Nandamuri balakrishna

  ఉత్తమ కథలు