హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Balakrishna: అన్‌స్టాపబుల్ సీజన్ 2.. బాలకృష్ణ, చంద్రబాబు కలిసి వైసీపీకి కౌంటర్ ఇవ్వబోతున్నారా ?

Balakrishna: అన్‌స్టాపబుల్ సీజన్ 2.. బాలకృష్ణ, చంద్రబాబు కలిసి వైసీపీకి కౌంటర్ ఇవ్వబోతున్నారా ?

చంద్రబాబు, బాలకృష్ణ (ఫైల్ ఫోటో)

చంద్రబాబు, బాలకృష్ణ (ఫైల్ ఫోటో)

Balakrishna: ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి దించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సమయంలో ఏం జరిగిందనే అంశంపై బాలకృష్ణ, చంద్రబాబు అన్‌స్టాపబుల్ సీజన్ 2 షోలో క్లారిటీ ఇవ్వబోతున్నారని సమాచారం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  అన్‌స్టాపబుల్ సీజన్ 2 టీజర్‌ని మరికాసేపట్లో విడుదల చేయబోతున్నారు. ఇది సాధారణంగా కాకుండా విజయవాడ వేదికగా దాదాపు 30 వేలమంది అభిమానుల మధ్య అక్టోబర్ 4వ తేదీన అన్‌స్టాపబుల్ సీజన్ 2 టీజర్‌ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఒక ఓటీటీ షోకి ఇలా టీజర్ లాంచ్ గ్రాండ్ గా నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇప్పటికే అభిమానులకి పాసులు కూడా అందించారు. దీంతో ఈ షోపై మరిన్ని అంచనాలు పెరిగాయి. బాలయ్య గత సంవత్సరం నుంచి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అఖండ సినిమా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవ్వడం, అన్‌స్టాపబుల్ (Unstoppable)అంటూ ఆహాలో సరికొత్త షోతో మరింత కొత్తగా కనపడి ఆ షో కూడా హిట్ అవ్వడంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ప్రేక్షకులు కూడా బాలకృష్ణను(Balakrishna) ఇలాగే చూడాలని అనుకుంటున్నామని మురిసిపోతున్నారు. బాలయ్య కౌబాయ్ గెటప్ లో ఉన్న ఫోటోలని పోస్ట్ చేసి.. ఈ సారి అన్‌స్టాపబుల్ సీజన్ 2 మరింత కొత్తగా ఉండబోతుందని ప్రకటించారు.

  అయితే ఈ సీజన్‌లో ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్‌గా టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) ఉండబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో చంద్రబాబుతో జరగబోయే షోలో బాలకృష్ణ ఆయనను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులకు తగ్గట్టుగానే..వైసీపీకి కౌంటర్ ఇచ్చే విధంగా బాలకృష్ణ ప్రశ్నలు, చంద్రబాబు సమాధానాలు ఉండబోతున్నాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై టీడీపీ, చంద్రబాబు, బాలకృష్ణ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇక అధికార వైసీపీ సైతం ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ఆయన పేరెత్తే అర్హత లేదంటూ కౌంటర్ ఇచ్చింది.

  అయితే మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన తరువాత హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెడతామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అయితే ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి దించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సమయంలో ఏం జరిగిందనే అంశంపై బాలకృష్ణ, చంద్రబాబు అన్‌స్టాపబుల్ సీజన్ 2 షోలో క్లారిటీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఒకరకంగా ఏపీలోని అధికార వైసీపీకి ఈ షో ద్వారా బాలకృష్ణ, చంద్రబాబు కలిసి గట్టి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

  Minister Roja: రోజా అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..! ఎడ్లబండిపై మంత్రి హల్ చల్..

  Megastar Chiranjeevi: భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కు మద్దతిస్తానేమో..చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  నిజానికి అన్‌స్టాపబుల్ సీజన్ 1‌లోనే ఎన్టీఆర్‌ వెన్నుపోటు ఎపిసోడ్ వ్యవహారంపై బాలకృష్ణ స్పందించారు. కేవలం పార్టీని కాపాడుకోవడం కోసమే అప్పట్లో చంద్రబాబు పక్కన ఉండాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. తాజాగా ఏపీలో మరోసారి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు.. వెన్నుపోటు వ్యవహారంపై చర్చ జరగడంతో.. దీనిపై బాలకృష్ణ, చంద్రబాబు ఇద్దరూ కలిసి వైసీపీకి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Balakrishna, Chandrababu Naidu

  ఉత్తమ కథలు