హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Attack on YCP MLA: ఏలూరు జిల్లాలో టెన్షన్ టెన్షన్.. వైసీపీ నేత హత్య.. ఎమ్మెల్యేపై దాడి

Attack on YCP MLA: ఏలూరు జిల్లాలో టెన్షన్ టెన్షన్.. వైసీపీ నేత హత్య.. ఎమ్మెల్యేపై దాడి

ఏలూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేపై దాడి

ఏలూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేపై దాడి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఏలూరు జిల్లా (Eluru District) లో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యేపై జనం దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఏలూరు జిల్లా (Eluru District) లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో స్థానిక వైసీపీ నాయకుడు గంజి ప్రసాద్ ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. శనివారం ఉదయం బయటకు వెళ్లిన ప్రసాద్ ను కత్తులతో దారుణంగా నరికి హత్య చేశారు. ఐతే హత్య అనంతరం అక్కడికి వెళ్లిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై స్థానికులు దాడి చేశారు. పోలీసులు అడ్డుకుంటున్నా గ్రామస్తులు మాత్రం ఎమ్మెల్యేని తరిమికొట్టారు. ఓ దశలో పోలీసులపైనా దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాడిలో ఎమ్మెల్యేకి గాయాలయైనట్లు తెలుస్తోంది. అలాగే ఓ గ్రామస్తుడికి చేయివిరిగినట్లు సమాచారం.

  హత్య విషయం తెలిసిన వెంటనే జి.కొత్తపల్లి చేరుకున్న తలారి వెంకట్రావు.. ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న స్థానికులు.. దీనికి కారణం ఎమ్మెల్యేనంటూ దాడికి దిగారు. పోలీసులు ఆయనకు రక్షణగా ఉన్నా గ్రామస్తులు మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ఆయన్ను ఓ భవనంలోకి తరలించారు.

  ఇది చదవండి: వైసీపీలో ముదిరిన స్వామి భక్తి.. కీలక నేత ఎదుట మోకరిల్లిన మంత్రి..


  ఇదిలా ఉంటే గంజి ప్రసాద్ హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. హత్య కేసులో నిందితులు పోలీస్ స్టేషమన్లో లొంగిపోయారు. గంజి ప్రసాద్ ను తామే చేశామంటూ సురేష్, మోహన్, హేమంత్ అనే వ్యక్తులు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. నిందితులు ముగ్గురూ ఎంపీటీసీ సభ్యుడు బజారియా వర్గీయులు కావడం తీవ్ర చర్చనీయాంసమైంది. హతుడు గంజి ప్రసాద్కు, బజారియాకు మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకవైపు ఈ హత్య.. వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావే చేయించాడంటూ వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

  ఇది చదవండి: డేట్, టైమ్ ఇస్తే నేనే వస్తా... కేటీఆర్ కు రోజా కౌంటర్.. మీ ఫ్రెండ్ ని కూడా తీసుకురావలన్న మంత్రి..


  ఐతే హత్య జరిగిన కొన్నిగంటల్లోనే నిందితులు లొంగిపోవడంతో కేసు కీలక మలుపు తిరిగింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు నిందితులు లొంగిపోయినా గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జనం ఆయన్ను దూషిస్తూ దాడిచేసేందుకు ఇంకా యత్నిస్తున్నారు. దీంతో జిల్లా ఎస్పీ, డీఐజీ ఇద్దరూ గ్రామానికి చేరుకొని ఎమ్మెల్యేను సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

  ఇది చదవండి: ఐదు రోజులు అస్సలు బయటకు వెళ్లొద్దు.. ఈ జిల్లాలకు అలర్ట్..


  అసలు ప్రసాద్ ను హత్య చేయాల్సిన అవసరం నిందితులకు ఎందుకు వచ్చింది. ఒకేపార్టీలో రెండు గ్రూపులుండటంతో ఆధిపత్య పోరే హత్యకు దారితీసిందా లేక వ్యక్తిగత వైరం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐతే అధికార పార్టీ ఎమ్మెల్యేపైనే ప్రజలు దాడిచేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందులో గ్రామస్తుల ఆరోపణల్లో వాస్తవమెంత..? దీనిపై ఎమ్మెల్యే ఏం చెబుతారన్న ఆసక్తికరంగా మారింది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ysrcp

  ఉత్తమ కథలు