హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Cabinet: కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి ముమ్మర ఏర్పాట్లు.. ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న టెన్షన్..

AP Cabinet: కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి ముమ్మర ఏర్పాట్లు.. ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న టెన్షన్..

ఓవైపు సీఎం జగన్ (AP CM YS Jagan) కేబినెట్ (AP New Cabinet) కూర్పుపై కసరత్తు చేస్తుండగా.. మరోవైపు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సచివాలయం ఎదుట ఖాళీ స్థలంలో ప్రమాణశ్వీకారోత్సవ వేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు

ఇంకా చదవండి ...

  ఓవైపు సీఎం జగన్ (AP CM YS Jagan) కేబినెట్ (AP New Cabinet) కూర్పుపై కసరత్తు చేస్తుండగా.. మరోవైపు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సచివాలయం ఎదుట ఖాళీ స్థలంలో ప్రమాణశ్వీకారోత్సవ వేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 11న ఉదయం 11గంటల 31 నిముషాలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ మేరకు అధికారులు ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, జీఏడీ పొలిటికల్ ముఖ్యకార్యదర్శి రేవు ముత్యాలరాజు ఏర్పాట్లను పరిశీలించారు. వేదిక, పార్కింగ్, ఆహ్వానాలు, అతిథుల సీటింగ్ వంటి అంశాలపై సిబ్బందికి సూచనలిచ్చారు. ఇప్పటికే నూతన మంత్రుల ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఆహ్వానాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, అధికారులకు పంపారు. కార్యక్రమానికి హాజరయ్యేవారికి Aa, A1, A2, B1, B2 కేటగిరీలుగా ఎంట్రీపాసులు జారీ చేశారు.

  ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. కొత్త, పాత మంత్రులతో కలిసి తేనీటి విందులో పాల్గొననున్నారు. ఇందుకోసం సచివాలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. స్వీకారోత్సవం సందర్భంగా సచివాలయం పరిసర ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

  మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి ఎంట్రీ పాస్

  ఇది చదవండి: అదే జరిగితే మంత్రులంతా జైలుకే.. టీడీపీ సంచలన వ్యాఖ్యలు.. పెద్దిరెడ్డిని టార్గెట్ చేసిన ప్రతిపక్షం

  కొత్తగా కేబినెట్లోకి రానున్న మంత్రులకు ఈనెల 10 సాయంత్రం లోగా లేఖలు వెళ్లే అవకాశముంది. అనంతరం సీఎంఓ నుంచి కూడా అధికారులు ఫోన్ల ద్వారా సమాచారం ఇవ్వనున్నారు. దీంతో ఆదివారం సాయంత్రానికి కొత్త మంత్రులు ఎవరనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. అదే రోజు సాయంత్రంలోగా సీఎం జగన్.. గవర్నర్ ను కలిసి ప్రమాణస్వీకారానికి ఆహ్వానించనున్నారు.

  ఇది చదవండి: కేబినెట్ బెర్త్ కోసం ఎమ్మెల్యేల ప్రయత్నాలు.. జగన్ అనుగ్రహం వారికేనా..?

  మరోవైపు కొత్త మంత్రుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. పార్టీలోని ముఖ్యనేతలో జగన్ సమావేశమయ్యారు. పాతవారిలో 10 మందిని కొనసాగిస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఎవర్ని కొనసాగించాలనే దానిపై చర్చిస్తున్నారు. ఇప్పటికే బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు వంటివారిని కొనసాగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఓమహిళా మంత్రికి కూడా అవకాశమిస్తారని తెలుస్తోంది.

  ఇది చదవండి: మంత్రి పదవిపై రోజాకు సీఎం క్లారిటీ ఇచ్చేశారా..? ఆమెకు దక్కే పదవి ఇదేనా..? ఆ ప్రచారంలో నిజమెంత..?

  ఇదిలా ఉంటే మంత్రిపదవి కోసం ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనేతలతో లాబీయింగ్ చేస్తున్నారు. కొత్త జిల్లాలు, రాజకీయ సమీకరణలో పాటు సామాజిక వర్గాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే తాము పార్టీకి చేసిన సేవలు, గతంలో సీఎం జగన్ ఇచ్చిన హామీలను కొంతమంది గుర్తుచేస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొంతమంది సీఎం వద్ద తమ మనసులో మాట బయటపెట్టగా.. మరికొందరు మాత్రం తమకు అవకాశం ఇవ్వకపోతారా అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

  First published:

  Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm ys jagan mohan reddy

  ఉత్తమ కథలు