హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala Temple: శ్రీవారిని వీడని వివాదాలు... కోర్టుకెక్కిన అర్చకులు.. అసలేం జరుగుతోంది..?

Tirumala Temple: శ్రీవారిని వీడని వివాదాలు... కోర్టుకెక్కిన అర్చకులు.. అసలేం జరుగుతోంది..?

తిరుమల కొండపై వివాదాలు కొత్తేమీ కాదు.. కానీ కరోనా టైమ్ లోనూ శ్రీవారి ఆలయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది.

తిరుమల కొండపై వివాదాలు కొత్తేమీ కాదు.. కానీ కరోనా టైమ్ లోనూ శ్రీవారి ఆలయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది.

తిరుమల కొండపై వివాదాలు కొత్తేమీ కాదు.. కానీ కరోనా టైమ్ లోనూ శ్రీవారి ఆలయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది.

  శేషాద్రి నిలయుడైన ఏడుకొండల వాడి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఇలా వచ్చిన భక్తుల చేత తిరుగుగిరులు గోవింద నామస్మరణలతో మారుమోగుతుంటుంది.. ఇలాంటి పవిత్ర పుణ్య క్షేత్రం నిత్యం వివాదాలు వేటాడుతుంటే ఉంటాయి. ఇటీవల జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా మారుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరో మారు వివాదానికి కారణమైంది. శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు చేస్తున్న అర్చకుల మద్య వివాదం చెలరేగి కోర్టు మెట్లు ఎక్కేలా చేసింది. తిరుమలలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రిటైర్ అయి పునఃనియమించబడ్డ అర్చకులు వెర్సస్ ప్రస్తుత ప్రధాన అర్చకులు వివాదంగా ఏర్పడింది. టీటీడీ తమకు అర్చకత్వం ఇస్తే చాలు అంటూ యువ పండితులు సీఎంను కోరితే.., తమ వంశ పర్యంపర్యాని కాపాడాలని సీనియర్ అర్చకులు ప్రతిపాదనలు చేశారు. ఇంత గొడవకు ముఖ్యకారణం అప్పటి టీడీపీ హయాంలో పలకందలి తీసుకున్న నిర్ణయాలే ఇప్పటి వరకు వివాదంగా మారుతూ వస్తుంది.

  2018 ఏప్రిల్ లో పుట్ట సుధాకర్ యాదవ్ చైర్మన్ గా ఉన్న టిటిడి పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసిన నెలలోపే మిరాశి అర్చకుల రిటైడ్ మెంట్ చేయాలని నిర్ణయించింది. దీనికి టిటిడి అధికారులు, పాలక మండలి సభ్యులు పాలక మండలి సమావేశంలో చర్చించి ఆమోదం తెలుపుతూ నిర్ణయంకు వచ్చారు. దీంతో అర్చకుల వివాదం తెరపైకి వచ్చింది. దీంతో అప్పట్లో ఆలయ ప్రధాన అర్చకులుగా విధులు నిర్వహిస్తున్న రమణ దీక్షితులు చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి శ్రీవారి ఆలయంలో అవకతవకలు జరుగుతున్నాయని... స్వామి వారి విలువైన ఆభరణాలు దేశవిదేశాలకు తరలి వెళ్తోందని టీటీడీ పాలకులపై విమర్శలు చేశారు. అంతాటితో ఆగకుండా శ్రీవారి ఆలయంలో గుప్తా నిధుల కొరకు తవ్వకాలు జరిపారని.., వీటన్నికి కారణం కొన్ని సంవత్సరాలుగా టీటీడీలో తిష్ట వేసి కూర్చున్న అధికారులదే అని మండిపడ్డారు. దీనితో ఈ వివాదం మరింత ముదిరింది... రమణ దీక్షితులతో టీటీడీ అధికారులు ప్రతి విమర్శలు చేసే స్థాయికి వెళ్ళింది.. చివరకు ఇటు టీటీడీ అటు రమణ దీక్షితులు కోర్టు బాట పట్టారు.

  Tirumala Temple, Tirumala Tirupati Devasthanam, Tirumala, Tirupati, Tirupati news, Tirumala Sri Venkateswara Swamy, Ramana Deekshithulu, Andhra Pradesh, Andhra Pradesh News, Andhra News, AP News, Telugu news, తిరుమల ఆలయం, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల, తిరుపతి , తిరుపతి వార్తలు, తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి, రమణ దీక్షితులు, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఆంధ్రా వార్తలు, ఏపీ వార్తలు, తెలుగు వార్తలు
  వేణుగోపాల దీక్షితులు (ఫైల్)

  2018 మే నెల 15వ తారీఖున చెన్నైలో అప్పటి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచళనం కలిగించిన విషయం తెలిసిందే. అదే కాకుండా 65 సంవత్సరాలు పైబడిన అర్చకులు ప్రమాదవశాత్తు ప్రధాన ఆలయంలో స్వామి వారి ఉత్సవ మూర్తులను నేలపై పడేలా చేసిన సంఘటనల దృష్ట్యా టీటీడీ మరో మారు వయో పరిమితి అంశాన్ని బోర్డులో ప్రవేశ పెట్టింది... ప్రవేశ పెట్టడం, ఆమోదం పొందడం అంత శరవేగంగా అయిపోయాయి. దీనితో గొల్లపల్లి వంశానికి చెందిన రమణ దీక్షితులతో పాటు మరో మూడు కుటుంబాలకు సంబంధించిన ప్రధాన అర్చకులకు టీటీడీ రిటైర్మెంట్ ప్రకటించింది.. వారితో పాటుగా తిరుచానూరు, గోవిందరాజ స్వామి ఆలయానికి చెందిన మరి కొంత మంది అర్చకులు కూడా పదవి విరమణ పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖాళీ అయిన పోస్టులను అదే కుటుంబానికి చెందిన వారిని నియమించింది.

  ఇది చదవండి:  తండ్రిప్రేమంటే ఇదే... కొడుకు కోసం కొవిడ్ తో పోరాడి ఓడిన నాన్న..


  రమణదీక్షితులు సుప్రీమ్ కోర్టును ఆశ్రయించగా... తిరుచానూరు, గోవింద రాజా స్వామీ మిరాశీ అర్చకులు హైకోర్టుని ఆశ్రయించారు.. అత్యున్నత న్యాయస్థానంలో విచారణలో ఉండగా... హైకోర్టు మిరాశీ అర్చకులపై స్పష్టమైన తీర్పును గత సంవత్సరం డిసెంబర్ 14 తేదీన ప్రకటించింది.. మిరాశీ అర్చకులు ఉద్యోగులు కాదని, వారికి టీటీడీ సర్వీసులు వర్తించవని తేల్చి చెప్పింది ఏపీ ధర్మాసనం.. వారిని అర్చకత్వానికి అనుమత్తించాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పు మాత్రం తిరుచానూరు రిటైర్మెంట్ అయిన అర్చకులకు మాత్రమే వర్తిస్ధాయి. అయితే ఈ విషయంలోనూ టీటీడీ కోర్టులో అప్పీల్ కు వెళ్ళింది..రిటైర్ అయిన వారిని మరల. విధుల్లోకి తీసుకుంటే వేద విజ్ఞాన ప్రవేశిక సర్టిఫికెట్స్ ఉన్న మిరాశీ కుటుంబంకు చేందిన 12 మందికి అర్చకులుగా టిటిడి నియమించింది.. మరల పదవి విరమణ చేసిన వారిని ఆలయ విధుల్లోకి తీసుకుంటే వీరి భవిష్యత్ ఎలా అనే అంశం పై టీటీడీ సందిగ్ధంలో పడింది.

  మిరాశీ అర్చకుల పదవి విరమణ అనే అంశాన్ని రాజకీయం చేస్తూ అప్పటి అధికార పార్టిపై తీవ్ర విమర్శలు చేస్తూ రమణదీక్షితులు పావులు కదిపారు. రిటైర్మెంట్ అంశం తెరపైకి రాగానే అప్పటి అధికారంలో ఉన్న ప్రభుత్వంపై, టిటిడి అధికారులపై తీవ్ర విమర్శలు, అభాండాలు వేశారు. దీంతో రమణదీక్షితులపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని కలిసి తమ వంశపర్యంపర్య వృత్తిని అర్చకత్వాని కొనసాగించేలా చేయాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పదించిన జగన్ మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి రాగానే అర్చకుల సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. బహిరంగ సభలోను ప్రకటించారు.

  ఎన్నికల ఫలితాల ముందు కూడా జగన్ ను రమణ దీక్షితులు కలిశారు. సీఎం జగన్ తిరుమల పర్యటనకు వచ్చిన ప్రతిసారి రమణదీక్షితులు కలిసి తనకు న్యాయం చేయాలనీ కోరారు. అయితే రమణ దీక్షితులకు ఆగమ సలహా దారునిగా నియమించిన టీటీడీ ఆలయ గౌరవ ప్రధాన అర్చకునిగా హోదాను 2019 నవంబర్ 6వ తేదీన నియమించింది. నియమితులైన కొన్ని రోజులకే తనకు కచ్చితంగా ఆలయ ప్రధాన అర్చక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చాడు రమణ దీక్షితులు.

  ఇప్పుడు ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్న వేణుగోపాల్ దీక్షితులు...కృష్ణ దీక్షితులు మరికొందరు ఆలయ అర్చకులు మార్చిలో సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలసి తమ సమస్యలను సీఎంకు విన్నవించుకున్నారు. ఖాళీల భర్తీ కోసం అభ్యర్థించిన మిరాశీ అర్చకులు తమ మిరాశీ వంశానికి చెందిన వారికీ అర్చకత్వం ఇవ్వాలని కోరగా.., పచ్చ జండా ఊపుతూ టీటీడీ ఈవోకు ఆదేశాలు జారీ చేసారు సీఎం జగన్. దీన్ని గమనించిన మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోమారు వైసీపీ నేతలతో చర్చలు జరిపారు. తనకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన నాయకులు పంచాయితిని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై టీటీడీ అధికారులతో చర్చించిన సీఎం రమణ దీక్షితులుకు ఆలయ ప్రధాన అర్చక పదవి ఇవ్వాలని సూచించారట.

  సీఎం ఉత్తర్వుల మేరకు వయో పరిమితి పేరుతో రిటైర్డ్ అయ్యిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసిన టీటీడీ. గతంలో రిటైర్డ్ అయ్యిన ప్రధాన అర్చకులతో పాటు అర్చకులు విధుల్లో చేరాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 38118/2018 హైకోర్టు తీర్పు మేరకు కోర్టు ఆదేశాలను పాటిస్తూ ఈ నిర్మాణం అంటోంది టీటీడీ. టీటీడీ ఆదేశాలతో తిరిగి ప్రధాన అర్చకుడి హోదాలో ఆలయ ప్రవేశం చేసాడు గొల్లపల్లి వంశానికి చెందిన ఏవి రమణ దీక్షితులు వివాదాస్పదుడు అనే పేరుగాంచిన రమణ దీక్షితులు ఆలయ ప్రవేశంతో కైంకర్య నిర్వహణలో ఆధిపత్య పోరు ప్రారంభం అయింది.

  2019లో గౌరవ ప్రధాన అర్చక హోదాలో ఆలయ ప్రవేశం చేసిన రమణ దీక్షితులు ఆలయంలో పలు వివాదాస్పద పనులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. శ్రీవారి పుష్పకేంద్రం వద్ద నుంచి కాకుండా బయట నుంచి తెచ్చే పుష్పాలను శ్రీవారికి సమర్పించరాదనే నిబంధనలను అతిక్రమించినట్లు గతంలో తీవ్ర దుమారం రేపింది. అంతేకాకుండా శ్రీవారి అఖండ దీపంలో ఇంటి నుంచి నెయ్యి తీసుకొచ్చి పోశారని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు, రమణ దీక్షితుల మధ్య శ్రీవారి సాక్షిగా ఆలయంలోనే మాటల యుద్ధం కొనసాగింది. తాజాగా రమణ దీక్షితులు ఆలయ ప్రధాన అర్చకులుగా నియమించిన నాటి నుంచి కేటాయించాల్సిన విధులు పట్టిక నిర్ణయంపై వివాదం రాజుకుంది.

  డ్యూటీలు వేయాల్సింది ఆలయ ప్రధాన అర్చకులే కావడమే కాకుండా.., ఒకే కుటుంబానికి చెందిన రమణ దీక్షితులు, వేణుగోపాల్ దీక్షితులు మధ్య డ్యూటీల చార్ట్ నుంచి స్వామివారి కైంకర్యాల వరకు తరచు వాదోప వాదాలు జరుగుతూ వస్తోందని సమాచారం. అధికారుల వద్దకు వెళ్లిన రమణ దీక్షితుల ఆధిపత్యం ముందు.....వేణుగోపాల్ దీక్షితుల అభ్యంతరాలు పట్టించుకోలేదని వాదనలు వినిపిస్తున్నాయి. రమణ దీక్షితులు ఆలయ పునరాగమనం చాలావరకు ఉద్యోగుల్లోను, అర్చకులలోను వ్యతిరేకత ఉందనే విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదనే చర్చ టీటీడీలో కొనసాగుతోంది.

  ఇక రమణ దీక్షితులు బద్ధశత్రువుగా పేరొందిన డాలర్ శేషాద్రి వేణుగోపాల్ దీక్షితులు అత్యంత సన్నిహితుడు. డాలర్ మామ అండదండలతోనే వేణుగోపాల్ దీక్షితులు కోర్టును ఆశ్రయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తానుఆలయ ప్రధాన అర్చకునిగా ఉండగా అదే వంశానికి చెందిన మరొకరిని ఎలా నియమిస్తారు అంటూ....కోర్టులో ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వేణుగోపాల్ దీక్షితులు వేసిన పిటిషన్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, టీటీడీ, రమణదీక్షితులను చేర్చి...వారికీ నోటీసులను జారీ చేసింది. ఎలాగైనా తనకు అనుకూలమైన తీర్పు కోర్టు నుంచి వస్తుందని వేణుగోపాల్ దీక్షితులు ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్న వేణుగోపాల్ దీక్షితులు కోర్టు మెట్లు ఎక్కడం సంచలంగా మారిందనే చెప్పుకోవాలి.

  First published:

  Tags: Andhra Pradesh, Tirumala news, Tirumala tirupati devasthanam

  ఉత్తమ కథలు