హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

వైసీపీ ఎమ్మెల్యేకు వైట్ రేషన్ కార్డు... సన్నబియ్యం అందించిన వాలంటీర్

వైసీపీ ఎమ్మెల్యేకు వైట్ రేషన్ కార్డు... సన్నబియ్యం అందించిన వాలంటీర్

సన్నబియ్యం అందుకొని సోషల్ మీడియలో ఎమ్మెల్యే అప్పలరాజు పోస్టు

సన్నబియ్యం అందుకొని సోషల్ మీడియలో ఎమ్మెల్యే అప్పలరాజు పోస్టు

. దీంతో తనపై వస్తున్న విమర్శలకు స్పందించిన ఎమ్మెల్యే అప్పలరాజు.. వివరణ ఇచ్చారు. తనకు తెల్ల రేషన్ కార్డు ఉందన్న విషయం తెలియదన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేకు తెల్ల రేషన్ కార్డు ఉందన్న విషయం... వాలంటీర్ సరుకులు ఇవ్వడంతో బయటపడింది.  పలాస ఎమ్మెల్యేగా ఉన్న సిదిరి అప్పల రాజు కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉంది. ఈ విషయం ఇంతవరకూ ఎవరికీ తెలీదు. కానీ... తాజాగా గ్రామ వాలంటీర్ వ్యవస్థ అమల్లోకి వచ్చినందున ఈ విషయం బయటకు వచ్చింది. ఈ సందర్భంగా వాలంటీర్లు ఆయన కుటుంబానికి బియ్యంతో పాటు.. పలు సరుకుల్ని అందించారు. దీంతో ఆ ఫోటోల్ని ఎమ్మెల్యే అప్పలరాజు.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఇప్పుడీ పోస్టు ఏపీలో వైరల్ అవుతోంది.

ఎమ్మెల్యేకి తెల్ల రేషన్ కార్డు ఎక్కడి నుంచి వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదలకు అందాల్సిన సరుకులు ఈ విధంగా దుర్వినియోగం అవుతున్నాయని ప్రజలు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో తనపై వస్తున్న విమర్శలకు స్పందించిన ఎమ్మెల్యే అప్పలరాజు.. వివరణ ఇచ్చారు. తనకు తెల్ల రేషన్ కార్డు ఉందన్న విషయం తెలియదన్నారు. తన కుటుంబసభ్యులకు కూడా ఈ విషయంపై ఎలాంటి సమాచారం లేదన్నారు. గ్రామవాలంటీర్ల వ్యవస్థ వలనే ఈ విషక్ష్ం వెలుగులోకి వచ్చిందన్నారు.

వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తుందని కొనియాడారు. తాను తెల్ల రేషన్ కార్డుదారుడైతే.. ఇప్పటివరకు ప్రతీ నెల తన రేషన్ ఏమైందని ప్రశ్నించారు. ఇతర సంక్షేమ పథకాలు కూడా తనకు అందకుండా ఎటు పోతున్నాయన్నారు. నెల నెల రేషన్ అందనప్పుడు దానిని తెల్ల రేషన్ కార్డును ఎద్దుకు రద్దుచేయలేదు.. పాస్‌పోర్టు కోసం 2009లో రేషన్ కార్డు అవసరం వచ్చింది. ఈ క్రమంలో గులాబీ రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేశాను. 2010-11లో తెల్లకార్డు ఇచ్చారని ఎమ్మెల్యే తన పోస్టులో వివరణ ఇచ్చారు. తనకు కార్డు వచ్చిన తరువాత రెండు ప్రభుత్వాలు మారిపోయాయని, తన కార్డును క్యాన్సిల్ చేయాలని పలాస ఎమ్మార్వోకు చెప్పానని అన్నారు. 

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Ration card, Srikakulam, Ysrcp

ఉత్తమ కథలు