AP Assembly: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాలు రచ్చ రచ్చ అవతున్నాయి. ఈ సెసన్ లో ఆఖరి రోజు సభ మరింత దద్దరిల్లింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ (NTR Health Univeristy) పేరు మార్చడంపై టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. జోహాన్ అన్న ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. దీనికి కౌంటర్ గా వైసీపీ నేతలు కూడా స్ట్రాంగ్ గా సమాధానం కొనసాగించే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర్ (Speaker) పోడియాన్ని చట్టుటముట్టి టీడీపీ (TDP) సభ్యులు నినాదాలు చేశారు. ఎన్టీఆర్ ను పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అయితే సభ అందుకు ఒకప్పుకోకపోవడంతో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి.. ఆ పేపర్లు చించి.. స్పీకర్ పైకి విసిరి నిరసన తెలిపారు. దీనిపై మండిపడ్డ స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni Sitaram) తన చైర్ లోంచి లేచి.. ఇయర్ ఫోన్స్ ను టేబుల్ పై విసిరి కొట్టి సీరియస్ అయ్యారు.
స్పీకర్ ఆగ్రహం వ్యక్తి చేసినా టీడీపీ సభ్యులు వెనక్కు తగ్గలేదు. దీంతో మరింత గందరగోళం నెలకొంది. స్పీకర్ పై పేపేర్లు చింపి.. విసరడం మంత్రులు మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అయితే తొలి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రతి రోజు టీడీపీ సభ్యులను బయటకు పంపేయాల్సి వచ్చింది. అయితే రోజూ కంటే చివరి రోజు టీడీపీ నేతల ఆందోళనలు రెట్టింపు అయ్యాయి.
చివరి రోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన మొదటి నుంచే టీడీపీ ఎమ్మెల్యేల నిరసనలకు దిగారు. ఎన్టీఆర్ పేరు ఎలా మారుస్తారంటూ నినాదాలు చేశారు. అయినా పేరు మార్పు నిర్ణయంపై ప్రబుత్వం వెనక్కు తగ్గకపోవడంతో.. టీడీపీ నేతలు ఆందోళనలు మరింత పెరిగాయి.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు.. బిల్లలను చింపి.. ఆ పేపర్లను స్పీకర్ పైకి విసిరి తమ నిరసన తెలిపారు టీడీపీ నేతలు. టీడీపీ ఎమ్మెల్యేల పై అసభ్య ప్రవర్తన తో వెల్ లోకి వైసీపీ నేతలు కూడా పోటీ పోటీ నిరసనలు తెలిపారు. దీంతో సభలో తీవ్ర ఉద్రిక్తతలు కనిపించాయి.
ఇదీ చదవండి : కృష్ణం రాజు వ్యాక్స్ విగ్రహం సిద్ధం.. ప్రభాస్ కోరికపై తయారీ.. ప్రత్యేకత ఇదే
స్పీకర్ పోడియం వద్ద దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అయితే సభ వాయిదా తరువాత తిరిగి ప్రారంభమైనా టీడీపీ సభ్యుల ఆందోళనలు తగ్గలేదు. సభకు పదే పదే ఆటంకం కల్గిస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
సస్పెండ్ చేసిన తరువాత కూడా టీడీపీ సభ్యులు వెనక్కు తగ్గలేదు. దీంతో మార్షల్స్ పిలిపించి 13 మంది సభ్యులను సభ నుంచి బయటకు పంపివేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Speaker Tammineni Seetharam, TDP, Ycp