ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni Sitaram)సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతే రాజధాని అన్నవాడిని జిల్లా పొలిమేరల నుంచి తరమికొట్టాలని ఆయన అన్నారు. విశాఖను రాజధాని కాకుండా అడ్డుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతం మరో అగ్నిగుండం కాబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయడానికే సీఎం వైఎస్ జగన్(YS Jagan) మూడు రాజధానులు ఉండాలని నిర్ణయించారని అన్నారు. ఈ విషయంలో ఆయన నిర్ణయాన్ని స్వాగతించాలని అన్నారు. ఈ విషయంలో ఉత్తరాంధ్ర ప్రజలంతా రోడ్ల మీదకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సకల సౌకర్యాలు, అన్ని వసతులు ఉన్న విశాఖను(Visakhapatnam) రాజధాని చేయడంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు.
కేవలం మధ్యలో ఉందనే కారణం చెప్పి అమరావతిని రాజధానిగా నిర్ణయించడం సరికాదని అన్నారు. గతంలో రాజధానుల విషయంలో ఏపీ ప్రజలు నష్టపోయారని.. ఇకపై అలాంటి తప్పులు జరగకూడదనే ఉద్దేశ్యంతోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. భవిష్యత్తు తరాలకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని స్పీకర్ అన్నారు.
ఇది ఉంటే వికేంద్రీకరణ మద్దతుగా ఏర్పాటైన నాన్ పొలిటికల్ జేఏసీ.. ఈ నెల 15న విశాఖలో ఉత్తరాంధ్ర గర్జనకు పిలుపునిచ్చింది. తాజాగా మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ గర్జన పోస్టర్ను మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు. విశాఖ గర్జన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. విశాఖ గర్జనలో అన్ని వర్గాలు పాల్గొంటాయని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష చెప్పడానికే.. విశాఖ గర్జన అని చెప్పారు. దండయాత్రగా వస్తామంటే ఉత్తరాంధ్రకు ద్రోహం చేసినట్టేనని తెలిపారు. ఇప్పటికే అన్ని ప్రాంతాల ప్రజలు విశాఖపట్నంకు రావడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు. పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని కోరారు.
MLA Vamsi: గన్నవరంలో అక్రమ మైనింగ్.. అసలు నిజం ఇదే..! ఎమ్మెల్యే వంశీ సంచలన కామెంట్స్
AP Minster: మంగళగిరిలో లోకేష్ అందుకే ఓడిపోయారు..? ఉత్తరాంధ్ర నేతలపై మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు
ఉత్తరాంధ్రలో రాజధాని ఎందుకు ఉండకూడదని మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. అమరావతి రాజధాని వద్దని తాము చెప్పడం లేదని చెప్పారు. అమరావతితో పాటు విశాఖ, కర్నూలుకు కూడా న్యాయం చేయమని ప్రజలు కోరుతున్నారని అన్నారు. విశాఖలో గర్జన అనగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిద్రలేశారని విమర్శించారు. ఉత్తరాంధ్ర గర్జన రోజే విశాఖలో పవన్ కల్యాణ్ మీటింగ్ అవసరమా? అని ప్రశ్నించారు. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉందని.. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజల కోసం నిలబడదామని అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అమరావతిలో 29 గ్రామాలే.. ఇక్కడ ఆరు వేల గ్రామాలు ఉన్నాయని అన్నారు. ఉతరాంధ్ర రైతులు చాలా పేదవాళ్లని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.