Home /News /andhra-pradesh /

AP POLITICS AP POLITICAL NEWS TDP KAPU LEADER VANGAVEETI RADHA GAVE CLARITY ON HE JOIN IN JANASENA OR NOT NGS GNT

Vangaveeti Radha: జనసేనలో చేరుతున్నారా..? నాదెండ్లతో ఏ విషయాలపై చర్చించారు.. పూర్తి క్లారిటీ ఇచ్చిన వంగవీటి రాధా

వంగవీటి రాధాతో నాదెండ్ల మనోహర్ భేటీ

వంగవీటి రాధాతో నాదెండ్ల మనోహర్ భేటీ

Vangaveeti Radha: టీడీపీ నేత.. కాపు సామాజిక వర్గ ప్రతినిధి వంగవీటి రాధ చుట్టూ విజయవాడ రాజకీయాలు తిరుతున్నాయి. ఇప్పటికే ఆయనతో వైసీపీ నేతలు నిత్యం టచ్ లో ఉంటున్నారు. టీడీపీ కూడా అతడిని వదులుకోడానికి ఇష్టంగా లేదు.. తాజాగా వంగవీటిని నాదెండ్ల కలవడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ విషయాలపై రాధా పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే?

ఇంకా చదవండి ...
    Anna Raghu, News18, Amaravati

    Vangaveeti Radha:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రస్తుతం టీడీపీ నేత వంగవీటి రాధ (Vangaveeti Radha) హాట్ టాపిక్ అయ్యారు. ఆయన వ్యవహారంతో  విజయవాడ (Vijayawada) నడిబొడ్డులో పొలిటికల్ గేమ్ కొత్త టర్న్ తీసుకోబోతోందా..? ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు ట్రై చేస్తున్న జనసేన పార్టీ (Janasena Party) కి కాపు సామాజిక (Kapu Community) వర్గం పూర్తిస్థాయిలో అడగా నిలవనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar).. వంగవీటి రంగా (Vangaveeti Ranga) తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాతో భేటీ కావడం మరో చర్చకు తెరలేపింది.  ఎందుకంటే వంగవీటి రాధ ప్రస్తుతం టీడీపీలో ఉన్నా.. అయనతో వైసీపీ నేతలు (YCP Leaders)  నిత్యం టచ్ లో ఉంటూనే ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు (Chandhrababu Naidu) కి బద్ధ శత్రువులగా చెప్పుకునే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) , కొడాలి నాని (Kodali Nani) లు.. ఏదో ఒక సందర్భంలో రాధతో భేటీ అవుతూనే ఉన్నారు.

    ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ ను జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కలయడంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే రాధాతో నాదెండ్ల మనోహర్ భేటీ కావడంతో.. వంగవీటి రాధాకృష్ణ జనసేనలోకి వెళ్తున్నారనే వార్తలు హల్ చల్ చేశాయి. దీనిపై వంగవీటి రాధ క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే..?  

    తన ఆఫీస్ పక్కనే జనసేన సమావేశం పెట్టుకుందని.. ఆ సమావేశం కోసమే నాదెండ్ల మనోహర్ అక్కడికి వచ్చారన్నారు. అయితే పక్కనే ఉన్న తమ కార్యాలయానికి మనోహర్ మర్యాధ పూర్వకంగా వచ్చారని.. పత పరిచయంతో టీ తాగుతూ కాసేపు మాట్లాడుకున్నామన్నారు. తనకు అన్ని పార్టీల్లోనూ సన్నిహితులు ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. అయిత తమ కలయికలో ఎలాంటి రాజకీయ పరిణామాలు లేవన్నారు. సరదాగా చిట్ చాట్ చేసుకున్నామన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తనకు తెలియవని.. మీడియా లేనిపోని హడావుడి చేయొద్దని సూచించారు. టీ తాగడానికి మాత్రమే వచ్చి.. సరదగా కలిసి తాగామన్నారు వంగవీటి రాధ అన్నారు.

    ఇదీ చదవండి : మెగా మంచు ఫ్యామిలీలు కలుస్తాయా? పవన్-మోహన్ బాబు కలిసి నడవడం సాధ్యమేనా?

    వంగవీటి రాధానే కాదు. ఇటు ఈ భేటీపై జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా క్లారిటీ ఇచ్చారు. జనసేన జనవాణి కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించామని.. పక్కనే రాధ ఆఫీసు ఉండటంతో ఇక్కడకి వచ్చాను అన్నారు. కేవలం రాధాను మర్యాద పూర్వకంగా కలిశానని వివరణ ఇచ్చారు. తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు లేవన్నారు. టీ తాగి, కాసేపు కుశల సమాచారాలు మాట్లాడుకున్నామన్నారు.

    ఇదీ చదవండి : ఆ ఇద్దరు సీనియర్ నేతలు ఏమయ్యారు? రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నా మౌనంగా ఎందుకున్నారు?

    అయితే కారణం ఏదైనా.. వంగవీటి రాధ వ్యవహారం టీడీపీ నేతలకు మాత్రం ఇబ్బందిగా మారింది. ఆయన ఎన్నికల సమయానికి పార్టీలో ఉంటారా..? లేక జంప్ చేస్తారా అన్నది అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన టీడీపీ నేతల కంటే.. ఎక్కువగా పక్క పార్టీ నేతలతోనే కనిపిస్తుండడం.. అనుమానాలు పెంచుతున్నాయంటున్నారు కొందరు టీడీపీ నేతలు..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Janasena, Nadendla Manohar, Vangaveeti Radha, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు