హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Janasena: నెంబర్ 2 సహా.. అందరి కోరిక అదే.. మరి అధినేత పవన్ వారి నిర్ణయాన్ని గౌరవిస్తారా..?

Janasena: నెంబర్ 2 సహా.. అందరి కోరిక అదే.. మరి అధినేత పవన్ వారి నిర్ణయాన్ని గౌరవిస్తారా..?

పవన్ తో మోదీ ఏం చెప్పారంటే?

పవన్ తో మోదీ ఏం చెప్పారంటే?

Janasena: జనసేన పార్టీ అధినేత పూర్తి కన్ఫ్యూజ్ లో ఉన్నారా..? ఎలా ముందుకు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారా.. కానీ పార్టీలో నెంబర్ 2 గా ఉన్న నాదెండ్ల మనోహర్ తో పాటు.. ఇతర నేతలు మాత్రం టీడీపీతో పొత్తే మేలు అంటున్నారు.. మరి పవన్ వారి నిర్ణయాన్ని గౌరవిస్తారా.. మోదీ మాటకు కట్టుబడి ఉంటారా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Janasena: ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) లో రాజకీయ హీట్ పెరుగుతోంది. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఎన్నికలకు కేవలం ఏడాదిన్నరే సమయమే ఉందని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) స్వయంగా చెబుతున్నారు. అయితే విపక్షాలు అంతకంటే ముందే ఎన్నికలు వస్తాయని అంచనా వేస్తున్నాయి. దీంతో అన్ని పార్టీలు వ్యూహాలతో బిజీగా ఉన్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ (Janasena Party) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో జనసేన సింగిల్ గా పోటీ చేస్తుందా..? బీజేపీతో పొత్తును కొనసాగిస్తుందా..? లేక టీడీపీ, బీజేపీతో కలిసి బరిలో దిగుతుందా.. అది కుదరకపోతే టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందా..? ఆ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని ఆసక్తి నెలకొంది.

ఈ అనుమానాలు నెలకొనడానికి ఆ పార్టీ అధినేత వ్యాఖ్యలే కారణం. అయితే మోదీ భేటీకి ముందు ఆయన వ్యాఖ్యలు ఒకలా ఉంటే..? మోదీతో భేటీ తరువాత మరోలా ఉన్నాయి.. అప్పటి వరకు వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనీయం అన్న ఆయన.. ఇప్పుడు జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యం అంటున్నారు. దీంతో పొత్తు లేనట్టే అనే ప్రచారం మొదలైంది. అయితే అధినేత మనసులో ఏమున్నా.. ఆ పార్టీ కీలక నేతలు మాత్రం మరో మాట చెబుతున్నారు.

ఎట్టి పరిస్తితుల్లోనూ చంద్రబాబుతో కలవకూడదని మోదీ.. పవన్‌తో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుతో కలిస్తే ఇంకా రాజకీయంగా ఎదగనివ్వరు అని మోదీ చెప్పినట్టు తెలుస్తోంది. ఆ తరువాతే పవన్ స్టాండ్ మారింది. కానీ ఆ పార్టీలో నెంబర్ టూగా చెప్పుకునే నాదెండ్ల మనోహర్ తో సహా.. ఇతర నేతలు మాత్రం మోదీ మాటకు కట్టుబడి ఉండొద్దని సలహా ఇస్తున్నారు. కొన్ని సీట్లు గెలుచుకుని అధికారంలో ఉండాలన్న టీడీపీతో కలవడం ముఖ్యమని వారు చెబుతున్నారు.

ఇదీ చదవండి : ఎంపీ విజయసాయి రెడ్డి ఫోన్ మిస్సింగ్ అంటూ ఫిర్యాదు.. పోయిందా లేక పడేశారా..?

ఎందుకంటే మళ్ళీ సింగిల్ గా పోటీ చేసినా, లేదా బీజేపీతో కలిసి పోటీ చేసినా ఓట్లు చీలిపోయి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని వారు అభిప్రాయ పడుతున్నారు. మళ్ళీ జగన్‌ని సీఎం చేయడానికే టీడీపీకి దూరంగా ఉండాలని బీజేపీ సూచిస్తుందనే ఉద్దేశంతోనే.. మోదీ ఆ మాట చెప్పారని జనసేన నేతలు పవన్ కు సూచిస్తున్నారు. బీజేపీతో పొత్తు వల్ల పావలా ప్రయోజనం ఉండదని.. ఆ పార్టీకి ఒక్క శాతం ఓటు బ్యాంక్ కూడా లేదని, ఇక తమ బలం చూసుకుంటే పది శాతం వరకు ఉంటుందని, దాంతో అనుకున్న దానికన్నా పది సీట్లు తెచ్చుకోవచ్చు.. కానీ అధికారంలోకి రావడం జరిగే పని కాదని జనసేన నేతలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి : డియర్ సీఎం మీ మేలు జన్మలో మరువం.. వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దంపతులు.. ఎందుకో తెలుసా?

పవన్ ప్రస్తుతం కన్ఫ్యూజ్ లో ఉన్నారని.. అందుకే ఆయన కన్ఫ్యూజ్ పొగట్టే ప్రయత్నం చేస్తున్నారు జనసేన కీలక నేతలు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల ప్రకారం.. టీడీపీతో కలిసి వెళితే బెటర్ అని, అప్పుడు ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చని, అంతేకాదు.. టీడీపీతో కలిసి అధికారం కూడా పంచుకునే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు పవన్ కు పదే పదే గుర్తు చేస్తున్నారు. మరి వారి ఒపీనియన్ ను పవన్ గౌరవిస్తారా..? లేద మోదీ మాటకు కట్టుబడి ఉంటారా అన్నది చూడాలి..

First published:

Tags: Andhra Pradesh, AP News, Bjp-janasena, Pawankalyan

ఉత్తమ కథలు