Home /News /andhra-pradesh /

AP POLITICS AP POLITICAL NEWS AMBATI RAMBABU VS NAGABABU TWEET FIGHT IN SOCIAL MEDIA NGS

AP Politics: వైసీపీ-జనసేన మధ్య పేలుతున్న పంచ్‌లు.. కేటీఆర్ ట్వీట్ తో ప్రారంభం.. రంభల రాంబాబు అంటూ బండ్ల ఎంట్రీ

అంబటి-పవన్ ఫైల్

అంబటి-పవన్ ఫైల్

AP Politics: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రచ్చ రచ్చ అవుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. ప్రత్యక్షంగా విమర్శలే కాదు.. సోషల్ మీడియాలోనే పంచ్ లు పేలుస్తున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు-నాగబాబు మధ్య పంచ్ లుపేలుతుంట.. మధ్యలో బండ్లగణేస్ ఎంట్రీ అయ్యారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయం రచ్చ రచ్చ అవుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొదట వైసీపీ (YCP) వర్సెస్ టీడీపీ (TDP)గా ఉండే ఫైటింగ్.. ఇప్పుడు జనసేన (Janasena) వర్సెస్ వైసీపీగా మారింది. అయితే గతంలో జనసేనను మాజీ మంత్రి అయిన పేర్ని నాని (Perni Nani) టార్గెట్ చేశారు. ఇప్పుడు ఆ ప్లేస్ ను మంత్రులు గుడివాడ అమర్ నాథ్ (Gudivada Amarnath), అంబటి రాంబాబు (Ambati Rambabu) లు భర్తీ చేస్తున్నారు. పవన్ పై తీవ్ర స్థాయి విమర్శలు చేస్తున్నారు. గుడివాడ అమర్ నాథ్ నేరుగా జనసేనపై సెటైర్లు వేస్తుంటే.. అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా జనసేనపై పంచ్ లు వేస్తున్నారు. ఆ పార్టీ నేతలు కూడా అదే స్థాయిలో ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా పోస్టులు, సెటైర్లతో ఏపీ పొలిటికల్ హీట్ పెరిగింది. తాజాగా పవన్‌కల్యాణ్‌ 175 స్థానాల్లో పోటీ చేస్తారా లేదా అంటూ సెటైర్ వేశారు మంత్రి రాంబాబు. రాంబాబు ప్రశ్నకు మార్ఫింగ్ ఫోటోతో ఆన్సర్ ఇచ్చిన నాగబాబు. దానికి బాగా ఖాళీగా ఉన్నట్టున్నారు అంటూ మంత్రి రీట్వీట్‌ చేశారు. అక్కడ నుంచి బ్రేక్ లేకుండా ఇద్దరూ పంచ్ లు పేలుస్తున్నారు.

    నాగబాబు, రాంబాబు మధ్య జరుగుతున్న ట్విట్టర్‌ యుద్ధమిది. చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. అసలు ఈ వివాదినికి బీజం వేసింది మాత్రం కేటీఆర్ ట్వీట్.. చేనేత వస్త్రం ధరించి ఫోటో పోస్ట్ చేయాలంటూ కేటీఆర్ ‌(Minister KTR).. పవన్ కల్యాణ్‌కు చాలెంజ్ విసిరారు.. దాన్ని స్వీకరించి అదే చాలెంజ్‌ను పవన్ ‌(Pawan kalyan).. చంద్రబాబు (Chandrababu)సహా మరో ఇద్దరికి విసిరారు. అంతవరకూ ఒక ఎత్తయితే దాన్ని అంబటి అందిపుచ్చుకుని పవన్ కల్యాణ్‌ను ఓ ప్రశ్న వేశారు.

    ఇదీ చదవండి : పిడుగుపాటుతో నలుగురు కూలీల దుర్మరణం.. ఆ సమయంలో మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి?

    ఈ ట్వీట్ల సిరీస్ ఫైట్ లో.. ఫస్ట్ ట్వీట్‌ అంబటి నుంచి పేలింది. పవన్ కల్యాణ్ గారూ.. కాటన్ దుస్తులు చాలెంజ్ ఆపి ఇంతకీ 175 సీట్లలో పోటీ చేస్తున్నారా లేదా అంటూ ట్టీట్ యుద్ధానికి తెరలేపారు.

    కాటన్ దుస్తుల ఛాలెంజ్లు ఆపి

    అంబటి ప్రశ్నకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు నాగబాబు. ఒకే ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతావు రాంబాబూ అంటూ మొదలెట్టారు. మీ లాంటి వ్యక్తికి సమాధానం ఇచ్చే తీరిక జనసైనికులకు కానీ, పవన్ కల్యాణ్‌కు కానీ అస్సలు లేదన్నారు. అక్కడితోనే ఆగలేదు.. అంబటి ఫోటోను మార్ఫింగ్ చేశారు.



    ఇలా ఇద్దరు పంచ్ డైలాగ్ లతో యుద్ధానికి కంటిన్యూ చేస్తున్నారు. అదే ఫోటోను రీట్వీట్ చేస్తూ .. భలేవారండీ నాగబాబుగారు, ఎంత ఓపికగా, ఎంత తీరికగా నా బొమ్మ వేశారండీ. ఖాళీగా ఉన్నట్టున్నారు.. థ్యాంక్స్ అంటూ ముక్తాయించారు.



    జనసేన నుంచి కానీ.. నాగబాబు నుంచి కానీ ఇంకా రిప్లై రాకపోవడంతో మరో సెటైర్ వేశారు అంబటి.. ప్రశ్నించడానికి పుట్టామంటారు.. ప్రశ్నిస్తే పారిపోతారేంటి అంటూ మరో పంచ్ పేల్చారు..

    ఈ ట్వీట్ కు నాగబాబు నుంచి ఇంకా రిప్లై రాలేదు.. ఆయన ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.. కానీ బండ్ల గణేష్ మాత్రం.. అంబటి రాంబాబుకు కౌంటర్ ఇచ్చారు.. త్వరలో మా సారు సమాధానం చెబుతారంటూ రిప్లే ఇచ్చారు..



    ఇలా ఓ సరిస్ లో వైసీపీ, జనసేన మధ్య ట్వీట్ల వార్ కొననసాగుతూనే ఉంది. కేవలం సోషల్ మీడియాలోనే కాదు.. మరోమంత్రి గుడివాడ అమర్ నాథ్ సైతం పవన్ ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు నుంచి పవన్ కు స్వాతంత్ర్యం ఎప్పుడు వస్తుందో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు అసలు 175 స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నారా అంటూ ఇలా వరుస ప్రశ్నలతో హీట్ పెంచుతున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Ambati rambabu, Andhra Pradesh, AP News, Mega brother nagababu, Pawan kalyan

    తదుపరి వార్తలు