Home /News /andhra-pradesh /

AP POLITICS AP NEW MINSTER USHA SRI HAD UNSUSPECTED EXPERIENCE MONEY CAME ANG GAVE BLESSINGS IN HANUMAN TEMPLE NGS

AP Minster: మంత్రి ఉష శ్రీకి వింత అనుభవం.. పూజ చేస్తుండగా ఏం జరిగిందో చూడండి.. షాక్ అవుతారు

మంత్రి ఉష శ్రీకి వింత అనుభం

మంత్రి ఉష శ్రీకి వింత అనుభం

AP Minster: మంత్రి పదవి చేపట్టి.. సొంత నియోజకవర్గానికి వస్తూనే ఉష శ్రీకి ఊహించని వివాదం వెంటాడింది. మంత్రి ఊరేగింపు ట్రాఫిక్ ఇబ్బందితో చిన్నారి మరణించింది. ఇప్పుడు మరో వింత అనుభవం అమెకు ఎదురైంది. అయితే ఇది ఆ దేవుడు ఇచ్చిన వరం అంటున్నారు ఆమె అనుచరులు.

ఇంకా చదవండి ...
    AP Minster: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి ‌(CM Jagan Mohan Reddy) చేపట్టిన కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. 11 మంది పాత మంత్రులు.. 14 మంది కొత్త మంత్రులకు అవకాశం ఇచ్చారు. అందులో భాగంగా అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉష శ్రీచరణ్(Usha Sricharan) కు మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే ఆమె ఏ ముహూర్తాన మంత్రి పదవి దక్కించుకున్నారో కానీ.. ఆ పదవి వరించిన తరువాత తొలిసారి నియోజక వర్గానికి వచ్చిన వెంటనే ఊహించని వివాదం వెంటాడింది. ఆమె ఊరేగింపు సందర్భంగా ఏర్పడ్డ ట్రాఫిక్ కారణంగా ఓ చిన్నారి మరణించందనే విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. ఆ విమర్శల దాడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మరో వింత అనుభవం ఆమెను పలకరించింది. అయితే ఈ సారి తనకు మంచే జరిగింది అంటున్నారు ఆమె.. దేవుడు తమ నేతపై కరుణ చూపించాడని.. ఇంక అంతా మంచే జరుగుతుంది అంటూ అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది అంటే..? ః

    తాజాగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి హోదాలో కసాపురం(Kasapuram) ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు ఆమె ఆలయానికి వెళ్లారు. అదే సమయంలో మంత్రికి వింత అనుభవం ఏర్పడింది. మంత్రి దంపతులు ఇద్దరు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఎక్కడి నుంచో అనూహ్యంగా ఓ వానరం వచ్చింది. ఆలా వస్తూనే అలజడి చేయకుండా.. వస్తూ నేరుగా మంత్రి ఒడిలో కూర్చుంది. పక్కన ఉన్నవారు తరిమేందుకు ప్రయత్నించినా అది అక్కడి నుంచి కదలకపోవడం విశేషం.



    అయితే ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ ఘటన జరగడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది సాక్షాత్తూ ఆంజనేయ స్వామి వరమేనని మంత్రి అన్నారు. స్వామి ఆశీస్సులతో ప్రజలకు మెరుగైన సేవ చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె అనుచరులు దేవుడే వచ్చి తమ మంత్రిని దీవించాడు అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే మరోవైపు మంత్రిగా బాధ్యతలు తీసుకొని తొలిసారి కల్యాణదుర్గం నియోజకవర్గానికి వస్తూ ఆమె వివాదంలో చిక్కుకోవాల్సి వచ్చింది.

    ఇదీ చదవండి : రైతుగా మారిన మాజీ డిప్యూటీ సీఎం.. ప్రకృతి సేద్యంలో బిజీ బిజీ.. వైరల్ అవుతున్నఫోటోలు

    మంత్రి ఊరేగింపు సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాలను నిలిపివేశారు. అదే సమయంలో శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన ఈరక్క, గణేష్​ల కూతురు పండు అనే 8 నెలల చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆ వాహనం ట్రాఫిక్​లో నిలిచిపోయింది. ముందుకు వెళ్లేందుకు మరో మార్గం లేకపోవటంతో ఆ చిన్నారి మృతి చెందింది. దీనిపై విపక్షాల ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు పోలీసులపై అనుచిత వ్యాఖ్యల పేరుతో.. విపక్ష నేతలకు నోటీసులు ఇస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Anantapuram, Andhra Pradesh, AP cabinet, Ap cm jagan, AP News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు