AP Minster: మర్మం లేకుండా మాట్లాడేస్తారు. మెలితిప్పే కామెంట్స్ అస్సలు ఉండవు. సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తారు. అయితే మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి కామెంట్స్ చేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. కీలక బాధ్యత తనపై ఉంది.. అయినా ఆయన దూకుడు తగ్గలేదు.. మరింత స్పీడ్ పెంచారు.. వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఏపీలో రైతులు వరి వేయద్దని.. కమర్షియల్ పంటలకు అలవాటు కావాలని సలహా ఇచ్చారు. శ్రీకాకుళం (Srikakulam) హిరమండలం రిజర్వాయర్ ను పరిశీలించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు (Minster Darmana Prasad Rao). ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఇప్పటివరకూ సుమారు 2000 కొట్లు ఖర్చు చేసాం… ప్రోజెక్ట్ పూర్తి జరిగితే పొందాల్సిన ప్రయొజనాలు రైతులకు అందలేదన్నారు. ఒడిషా (Odisha)తో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ట్రిబ్యునల్ పై ఒడిషా కొర్ట్ కు వెల్లనున్నట్లు సమాచారం ఉందన్నారు. ప్రాజెక్టుపై ప్రస్తుతం ఉన్న అభ్యంతరాలు అన్నీ పూర్తి కావాలంటే మరో ఐదేళ్లు పడుతుందని అంచనావేస్తున్నామన్నారు. ఈ వ్యాఖ్యలకన్నా ఇటీవల రెవెన్యూ డిపార్టు మెంట్ కు సంబంధించి చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా ఆగడం లేదు.
ప్రస్తుతం మంత్రి ప్రసాదరావు అన్నయ్య కృష్ణదాస్ (Darmana Krishna Das) రెవెన్యూ మంత్రిగా పని చేశారు. అయితే ఇప్పుడు అదే శాఖ బాధ్యతలు తమ్ముడు తీసుకున్నారు. అలాంటి సమయంలో రెవెన్యూ శాఖపై ఎలాంటి విమ్శలు చేసినా.. అవి అన్నయపై కచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. కానీ అవేవి పట్టించుకోకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువైందన్నారు.
ఇదీ చదవండి : స్వామి భక్తి అంటే ఇదే..? సీఎంను దేవుడు చేసిన డిప్యూటీ సీఎం
సదరు రెవెన్యూ శాఖకు ఇంత వరకు మంత్రిగా ఉన్నది ఆయన అన్నయ్య ధర్మాన కృష్ణదాసే అన్న సంగతి మరిచిపోయారో.. లేక అన్ననే ఇరుకున పెట్టాలి అనుకున్నారో కారణం ఏదైనా.. కీలక వ్యాఖ్యలే చేశారు. అయితే అన్న కృష్ణదాస్‌కు కౌంటర్ వేశారని కొందరు భావిస్తుంటే.. ఆయన కామెంట్స్ ప్రభుత్వానికి , పార్టీకి మేలు చేస్తాయా.. కీడు కలిగిస్తాయా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పనితీరు.. తాజా మంత్రివర్గ కూర్పు.. వైసీపీ అవలంభిస్తున్న విధానాలకు కాస్త దూరంగా జరిగి.. మంత్రి ధర్మాన మాట్లాడినట్టు భావిస్తున్నారు.
అలాగే ఈ రోజుల్లో కులం, మతం చూసి జనం ఓట్లేయబోరన్న ప్రసాదరావు గత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. అక్కడితో ఆగితే బాగోదనుకున్నా ఏమో.. నిజాయితీ కలిగిన పాలనకే విలువ ఉందని.. ఆ దిశగా ప్రభుత్వాన్ని, పార్టీని తీసుకెళ్లాలని ధర్మ సూక్తులు చెప్పారు ధర్మాన. ఈ కామెంట్స్‌తో సొంత పార్టీవాళ్లనే ఇబ్బందుల్లోకి నెట్టారని కొందరి అభిప్రాయంగా ఉందట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Srikakulam, Ycp