AP MLC ELections: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (Andhra Pradesh Assembly) లో జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు (MLA Quota MLC Elections) తీవ్ర ఉత్కంఠ పెంచుతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుంది అంతా అసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఏడు సీట్లు కచ్చితంగా నెగ్గుతామని వైసీపీ (YCP) ధీమా వ్యక్తం చేస్తుంటే.. తాము నిలబెట్టిన అభ్యర్థి విజయం ఖాయమని టీడీపీ (TDP) నేతలు అంటున్నారు. ఇప్పటికే రెండు పార్టీలు మైండ్ గేమ్ మొదలు పెట్టాయి.. ముఖ్యంగా వాస్తవ లెక్క ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం టీడీపీ మద్దతుగా ఉన్న ఎమ్మెల్యే 19 మంది మాత్రమే.. ఆ పార్టీ అభ్యర్ధి నెగ్గాలంటే 22 ఓట్లు రావాలి. సో మిగిలిన మూడు ఓట్లు ఎవరు వేస్తారనే ఉత్కంఠ పెరుగుతోంది. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే వైసీపీ నుంచి 132 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం.. చంద్రబాబు నివాసంలో సమావేశం అయ్యారు. అక్కడి నుంచి 19 మంది ఒకేసారి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ముఖ్యంగా టీడీపీ నుంచి వైపీకి వెళ్లిన నలుగురు ఎవరికి ఓటు వేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. విప్ జారీ చేసినా.. అందులో ఇద్దరు ముగ్గురు కచ్చితంగా వైసీపీ అభ్యర్థులకే ఓటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఒకరు లేదా ఇద్దరు కచ్చితంగా మళ్లీ తవైపు వస్తారని.. ఈ ఎమ్మెల్యే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తారని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే టీడీపీ సంఖ్య 20కి పెరుగుతుంది.
మరోవైపు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తరువాత మాట్లాడి ఆయన ఆత్మ ప్రభోదాను సారమే తాను ఓటు వేశానని.. ప్రజాస్వామ్యంలో ఓటు ఎవరికి వేశారు అన్నది బయటకు చెప్పకూడదు అన్నారు. అయితే ఆయన ఓటు టీడీపీకే వేశారనే ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ ఇంకా కేవలం ఒక్క ఓటే అవసరం ఉంటుదని.. ఆ పార్టీ నేతలు చెబతున్నారు. అంతేకాదు వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యే ప్రస్తుతం పార్టీకి అందుబాటులో లేరని.. వారి ఓట్లు కూడా తమకే పడతాయని ధీమాగా చెబుతున్నారు.
మరోవైపు గంటా శ్రీనివాస రెడ్డి రాజీనామా ఆమోదించారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై గంటా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అసమ్మతుల ఓట్లు టీడీపీ పడకుండా చేయాలనే.. ఇలా అధికార పార్టీ మైండ్ గేమ్ ఆడుతోంది అన్నారు. ఓటర్ల జాబితా వచ్చిన తరువాత రాజీనామాను ఆమోదించకూడదు.. అది నిబంధనలకు విరుద్ధం అన్నారు. అలా చేస్తే వైసీపీ పెద్ద తప్పు చేసినట్టే అన్నారు.
ఇదీ చదవండి : చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారా..? లోకేష్ భవష్యత్తు ఏంటి..? టీడీపీ పంచాంగ శ్రవణంలో ఏం చెప్పారంటే..?
మరోవైపు మంత్రి గుడివాడ అమర్ నాథ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్లకు నోట్లు ఇవ్వడం చంద్రబాబుకు అలవాటు అన్నారు. తనకు బలం లేకపోయినా ఉందని ప్రచారం చేసుకొని మైండ్ గేమ్ ఆడడం వైస్రాయ్ హోటల్ లోనే చంద్రబాబు ప్రారంభించారు అన్నారు. గతంలో తెలంగాణలో బలం లేకపోయినా.. ఒక్క ఓటు కొనేందుకు చంద్రబాబు కోట్లు ఖర్చు పెట్టారని.. ఇప్పుడు అదే విధంగా తమ పార్టీ నేతలను కొనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించాురు. అయితే చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వైసీపీకి చెందిన ఏడుగురు నెగ్గుతారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ganta srinivasa rao