Home /News /andhra-pradesh /

AP POLITICS AP MINSTERS GAVE RESIGNATIONS LETTER TO CM JAGAN AND TAKE KEY DECISIONS IN LAST CABINET MEETING NGS

AP Cabinet: మూకుమ్మడి రాజీనామాలు చేసిన మంత్రులు.. సీఎం జగన్ వారికి ఏం చెప్పారంటే..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

AP Cabinet: 2024 ఎన్నికలకు వైసీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా మంత్రులు అంతా మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఆ వెంటనే చివరి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఆ నిర్ణయాలు ఏంటంటే.?

    AP Ministers Resignations: పార్టీ కోసం కష్ట పడి పని చేయాలని సీఎం జగన్ ఆదేశించారు అన్నారు రాజీనామాలు చేసిన మంత్రులు.. అంతకుముందు జరిగిన కేబినెట్ భేటీ (Cabinet Meeting)లో.. సీఎం జగన్ (CM Jagan) కు మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా పత్రాలు సమర్పించారు. అందరి మంత్రుల దగ్గర నుంచి రాజీనామా పత్రాలను జగన్ తీసుకున్నారు. మొదట కేబినెట్ సమావేశానికి రాజీనామా లేఖలతోనే వచ్చిన మంత్రులు ముఖ్యమంత్రికి సమర్పించారు. మంత్రుల రాజీనామా లేఖలను జీఏడీ అధికారులు సాయంత్రం గవర్నర్ కు పంపనున్నారు. గవర్నర్ ఆమోదించగానే ప్రస్తుత మంత్రులంతా మాజీ మంత్రులవుతారు. అలాగే ఈనెల 10న కొత్త మంత్రుల జాబితాను గవర్నర్ కు సీఎం జగన్ పంపనున్నారు. ఈనెల 11న కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయనుంది. అయితే మొత్తం మంత్రులు అంతా రాజీనామా లేఖలు ఇచ్చారు. అయితే ఇందులో ఎంతమంది రాజీనామాలకు ఆమోద ముద్ర వేస్తారు అన్నది చూడాలి..

    కేబినెట్ మీటింగ్ తరువాత బయటకు వచ్చిన మంత్రులు అంతా ఈ విషయమాన్ని స్పష్టం చేశారు. అందరం పార్టీ కోసం పని చేసేందుకే రాజీనామాలు చేశామని.. వాటిని  ఆమోదిస్తారా లేదా అన్నది తమకు తెలీదు అన్నారు. సీఎం జగన్ తమకు ఏ బాధ్యత అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.  మాజీలు అయిన వారంతా పార్టీ కోసం కష్ట పడతామని సీఎం జగన్ కు హామీ ఇచ్చామంటున్నారు. అయితే అనుభవం రీత్యా కొంతమందిని కొనసాగిస్తానని సీఎం చెప్పారని.. ఎవరు అన్నది తమకు క్లారిటీ లేదన్నారు.

    ఇదీ ,చదవండి : కొత్త జిల్లాలకు కొత్త కోడ్ లు.. వాటి ద్వారానే కార్యక్రమాలన్నీ అమలు

    మొత్తం 24 మంది మంత్రులం రాజీనామా చేశామని కొవాలి నాని అన్నారు. అయితే అనుభవం రీత్యా కొంతమందిని కొనసాగిస్తామని సీఎం చెప్పారని.. వారి పేర్లు మాత్రం చెప్పలేదన్నారు. అయితే మంత్రి పదవి నుంచి తప్పిస్తున్నందుకు ఎవరూ ఫీల్ కాలేదని.. కానీ సీఎం జగన్ మాట్లాడుతూ చాలా బాధ పడ్డారు అన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం తనకు చాలా కఠినంగా అనిపిస్తోంది అన్నారని.. మీరంతా నా సోదరలు, స్నేహితులు లాంటి వారు అంటూ జగన్ పదే పదే చెప్పారని కొడాలి నాని అన్నారు. అధినేత ఆలోచనలు ఎప్పుడు ప్రజల గురించే ఉంటుందని.. అందకే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా సిద్ధంగా ఉంటామన్నారు.

    ఇదీ ,చదవండి : : పేరెంట్స్ కు గుడ్ న్యూస్.. ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా..? వాయిదాల్లో ఫీజులు చెల్లించే అవకాశం? ఎలా అంటే?

    మంత్రి వ్యాఖ్యలతో ఎవరెవర్ని మంత్రులుగా కొనసాగిస్తారన్నదానిపై ఆసక్తి పెరిగింది. అనుభవం రీత్యా ఐదు లేదా ఆరుగుర్ని కొనసాగిస్తారని చెప్పడం బట్టి చూస్తే.. మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి, కొడాలి నాని, బాలినేని లాంటి వారిని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొడాలి నాని మాత్రం.. తనను కొనసాగించే అవకాశాలు చాలా తక్కువే అన్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP cabinet

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు