హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Minster Ex Minster meet: చేతులే కలిశాయి.. చూపులు కలిసేది ఎప్పుడో..? అనిల్ ఇంటికి వెళ్లిన మంత్రి

Minster Ex Minster meet: చేతులే కలిశాయి.. చూపులు కలిసేది ఎప్పుడో..? అనిల్ ఇంటికి వెళ్లిన మంత్రి

మాజీ మంత్రి ఇంటికి మంత్రి

మాజీ మంత్రి ఇంటికి మంత్రి

Minster Ex Minster meet: నెల్లూరు వైసీపీలో వర్గ పోరుకు ఇప్పట్లో తెర పడే అవకాశాలు కనిపించవా..? స్వయంగా మంత్రి.. మాజీ మంత్రి ఇంటికి వెళ్లినా పరిస్థితి మారదా..? కేవలం చేతులు మాత్రమే కలిపిన నేతలు చూపులు ఎప్పుడు కలుస్తాయి.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.

ఇంకా చదవండి ...

Minster Ex Minster meet:  నెల్లూరు (Neloore) రాజకీయాలు తీవ్ర ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ (CM Jagan)కు వీర విధుయుడిగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Ex Minster Anil Kumar Yadav) వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. తనను మంత్రి వర్గం నుంచి తప్పించడం పక్కన పెడితే.. తన వ్యతిరేక వర్గానికి చెందిన కాకాణికి గోవర్దన్ (Kakani Govardhan)కు మంత్రి పదవి ఇవ్వడంతో..  తన అసమ్మతి బయటపడేలా చేస్తున్నారు.  తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి ఎంత సహకరించారో.. అంతకు డబుల్ సహకరిస్తానంటూ తొలి బౌన్సర్ వేశారు. ఆ వెంటనే మంత్రి తొలిసారి సొంత జిల్లాలకు వస్తే.. అదే రోజు కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఆ సమవేశంలో ఆయన మాటలు విన్నా.. ఇద్దరి మధ్య శత్రుత్వం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.. తనకు ఎవరూ పోటీ కాదని.. తనతో తనకే పోటీ అంటూ పరోక్షంగా మంత్రిని టార్గెట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఫ్లెక్సీల వివాదంపై మాట్లాడిన ఆయన.. నిజంగా తాను గూండాయిజం చేస్తే వారి చేతులు నరికేవాడిని కదా అంటూ తిరిగి ప్రశ్నించారు. ఇలా అనిల్ వ్యాఖ్యలు చూస్తే ఇద్దరి మధ్య శత్రుత్వం ఏంటన్నది అర్థమవుతుంది.

ఈ ఇద్దరి మధ్య సయోధ్యకు అధిష్టానం ప్రయత్నించినా.. అది కుదిరేలా లేదు.. తాజాగా నెల్లూరు వైసీపీలో నెలకొన్న విభేదాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశారు మంత్రి కాకాణి. ఇందులో భాగంగానే.. మాజీ మంత్రి అనిల్ కుమార్ ఇంటికి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెళ్లారు. ఆయనను కలిసి కాసేపు ముచ్చటించారు. తాడేపల్లిలో సీఎం జగన్ వద్ద పంచాయతీ ముగిసినప్పుడు కూడా ఇద్దరూ కలిసి రాలేదు. ఇప్పుడు మాత్రం నెల్లూరులో అనిల్ ఇంటికి మంత్రి కాకాని వెళ్లడం ఆసక్తిగా మారింది.  ఈ సందర్భంగా ఇద్దరు నేతలు వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ అవుతోంది. ఇద్దరి చేతులు మాత్రం కలిశాయి.. చూపు క్షణం కూడా కలిసినట్టు ఆ వీడియోలో కనిపించలేదు.

ఇదీ చదవండి : గుండాయిజం చేస్తే వారి చేతులు ఉండేవా? మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

చేయి చేయి కలిసినా.. చూపు మాత్రం కలవకపోవడంతో ఇద్దరి మధ్య ఎలాంటి వైరం ఉందో ఊహించుకోవచ్చు.  ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం మాత్రం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి పెంచింది. ఈ భేటీ తరువాత ఈ ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ భేటీలో ప్రత్యేకత ఏమీ లేదని, పార్టీ కోసం కలిసి పని చేస్తామని చెప్పుకొచ్చారు ఇద్దరు నేతలు.  ఈ భేటీకి ముందు చూపులు కలవకపోయినా.. తరువాత అంతా సద్దుకుంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇద్దరూ నిజంగానే విబేధాలు పక్కన పెట్టి పని చేస్తే.. నెల్లూరులో వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. లేదంటే అధికార పార్టీకు షాక్ తప్పదు.

First published:

Tags: Andhra Pradesh, Anil kumar yadav, AP News, AP Politics, Nellore Dist, Ycp

ఉత్తమ కథలు