AP Minster: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఉన్నికల వాతావారణం కనిపిస్తోంది. దీంతో ప్రస్తుతం అన్ని రాజకీయా పార్టీల్లో పొత్తులపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జనసేన (Janasena) కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జోరుగా ఉంది. అయితే కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో వైసీపీ నేతలు పదే పదే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. మరోవైపు బీజేపీ (BJP)సైతం తాము జనసేనతో కలిసి పోటీ చేస్తామని పదేపదే చెబుతోంది. టీటీడీ (TDP)పీ దగ్గర చేర్చుకునే ప్రసక్తే లేదని ఒక వర్గం అంటూంటే.. మరో వర్గం దానిపై ఫైనల్ నిర్ణయం కేంద్రానిదే అంటోంది. ఇప్పుడు అనూహ్యాంగా వైసీపీ (YCP) పొత్తులపైనా జోరుగా ప్రచారం జరుగుతోంది. దేశ రాజకీయాల్లోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ (Congress) పార్టీతో పొత్తులపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ( Prashant Kishor) చేసిన ప్రతిపాదనలతో.. ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుందని, ఆంధ్రాలో వైసీపీతో పొత్తు పెట్టుకుంటుందని రాజకీయ ఊహాగానాలు వెలువడ్డాయి. ఈక్రమంలో కాంగ్రెస్ తో పోత్తుపై ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) స్పందించారు. ఆయన ఏమన్నారంటే...?
ఏపీలో వైసీపీకి ఏ రాజకీయ పార్టీతో పోత్తు పెట్టుకోవల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి పని చేస్తున్నారని, బలమైన ప్రాంతీయ పార్టీతో జాతీయ పార్టీలు పోత్తు పెట్టుకోవడం సహజమని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. సోనియా (Sonia)ను ఢీ కొట్టిన జగన్ తిరిగి కాంగ్రెస్ పార్టీతో పోత్తు పెట్టుకుంటే జనం నవ్వకుంటారని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రెస్స్ లేకుండా చేసింది జగన్ మెహన్ రెడ్డి (Jagan Mohan Reddy) అని ఆయన అన్నారు.
ఇదీ చదవండి : లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీ..? పార్టీ ఏదీ.. పోటీ ఎక్కడ? ఆంధ్రా ఆక్టోపస్ క్లారిటీ
సీట్లు కోసం ఎదురు చుసే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ (Congress) ఉందని.. పార్టీతో తాము ఎందుకు పొత్తు పెట్టుకుంటామన్నారు. కనీసం డిపాజిట్లు కూడా రావని ఆయన సెటైర్ వేశారు. ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనలపై మంత్రి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారి దత్త పుత్రుడని.. చంద్రబాబు ఆశల కోసమే పవన్ పని చేస్తున్నారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని ఎన్టీఆర్ చెప్పేవారని, అలాంటిది గత ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుందని మంత్రి అమర్నాథ్ విమర్శించారు. ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి పుట్టిన మనిషిలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి వారి రెండో భార్య రేణు దేశాయిని అడిగితే చెప్తారు అంటూ అమర్ నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి : విధ్వంసం తరువాత సిద్ధమైన రామతీర్థం.. ఎలా ఉందో చూడండి
జగన్ మోహన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ కు అసలు జైలు కెళ్ళడం, శిక్షలు పడడంలో తేడా ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. జగన్ పై మోపిన కేసుల్లో ఏ ఒక్క కేసులోనూ ముద్దాయిగా నిరూపించబడలేదని.. అది కాంగ్రెస్ చేసిన కుట్ర అని అందరికి తెలుసున్నారు. ప్రజలకు ఈ నిజాలు తెలుసు కాబట్టే 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీ సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు తన సొంత పుత్రుడు లోకేష్ పై నమ్మకం లేకపోవడంతోనే.. దత్తపుత్రుడు పవన్ ను నమ్ముకున్నారని మంత్రి విమర్శించారు. ఐదు సంవత్సరాలలో ఆరు పార్టీలతో పొత్తు పెట్టుకున్న రికార్డ్ పవన్ కళ్యాణ్ ది అంటూ మంత్రి అమర్నాథ్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు బ్యానర్లో పవన్ దత్తపుత్రుడు సినిమా తీస్తున్నారని ఆ సినిమా ప్లాప్ అవ్వడం ఖాయం అంటూ అమర్నాథ్ సెటైర్లు వేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Gudivada, Pawan kalyan