Home /News /andhra-pradesh /

AP POLITICS AP MINSTER DARAMANA PRASAD RAO SENSATIONAL COMMENTS ON DEVELOPMENT AND CHANDRABABU NGS

AP Minster: ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తే చాలదా? అభివృద్ధి చేయాలా? మంత్రి ధర్మాన షాకింగ్ కామెంట్

బస్సు యాత్రలో ధర్మాన సంచలన వ్యాఖ్యలు

బస్సు యాత్రలో ధర్మాన సంచలన వ్యాఖ్యలు

AP Minster: సీఎం జగన్ రెండో కేబినెట్ లో అనూహ్యంగా ధర్మాన ప్రసాదరావు బెర్త్ దక్కించుకున్నారు. అయితే ఆయన నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోనే ఉంటున్నారు. మంత్రి కాకముందు.. తరువాత కూడా ఆయన వ్యాఖ్యలు నిత్యం వివాదాలకే కేరాఫ్ అవుతున్నాయి. తాజాగా బస్సు యాత్రలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
  AP Minster: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఉన్న మంత్రుల్లో ధర్మాన ప్రసాద రావు (Dharmana Prasada Rao).. నిత్యం ఏదో ఒక రూపంలో వివాదాల్లో నిలుస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు వివాదస్పదమవుతున్నాయి. తాజాగా అనంతపురం లో (Anantapur) ఏపీ రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన షాకింగ్ కామెంట్స్ చేశారు. అభివృద్ధి జరగడం లేదని విమర్శలపై ఆయన స్పందించిన తీరు.. వివాదాస్పదమవుతోంది. ప్రజల ఖాతాల్లో డబ్బులు వేసినా.. అన్ని అవసరాలూ తీర్చాలంటే ఎలా అని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర (Ministers Bus Tour) ముగింపు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బడుగు వర్గాల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. అయితే అక్కడక్కడా కొన్ని పనులు జరగలేదని అనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ప్రజల అవసరాల కోసమే కదా.. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామన్నారు. ఆయా వర్గాల వారికి అన్ని అవసరాలు తీర్చడానికి మరికొంత సమయం పడుతుందని, దానికి గురించి విపక్షాలకు తొందర ఎందుకు అంటూ సరికొత్త వాదన తెరపైకి తెచ్చారు. గతంలోనూ జగన్‌ లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజా ఉద్యమాలు వచ్చేవే కాదన్నారు.

  మరోవైపు మహానాడు (Mahanadu)లో ఓ నాయకురాలు తొడకొట్టారని, జనాలు త్వరలోనే ఓటు ద్వారా చంద్రబాబుకు బుద్ధి చెబుతారని మహిళ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉష శ్రీచరణ్‌ (Usha Sri Charan) పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఇతర రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయన్నారు. పక్కరాష్ట్రాలైన తమిళనాడు (Tamilnadu), కర్ణాటక (Karnataka) సరిహద్దులోని ప్రాంతాల ప్రజలు కొత్త డిమాండ్ వినిపిస్తున్నారన్నారు. వెంటనే తమను ఆంధ్రప్రదేశ్‌లో కలపాలని కోరుతున్నారని బీసీ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య (R Krishniaih) చెప్పారు. గత ప్రభుత్వం షెడ్యూలు కులాల్లో ఒక్కరికే మంత్రి పదవి ఇస్తే వైసీపీ పాలనలో నాలుగు పదవులిచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌ది అని మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు.

  ఇదీ చదవండి : ఆత్మకూరు ఏకగ్రీవం కానట్టేనా..? పోటీలో బీజేపీ..? టీడీపీ లెక్క ఏంటి..? నేటి నుంచి నామినేషన్లు

  కార్మికుల ప్రాణాలంటే టీడీపీ లెక్క లేదన్నారు మంత్రి సురేష్. అందుకే వారి ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడాల్సిన మందులు, ఆరోగ్య పరికరాల్లో అవినీతికి మాంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయడు అవినీతికి పాల్పడ్డారని గుర్తు చేశారు. అచ్చెన్నాయుడు చేసిన తప్పుకు జైలుకు వెళ్లి ఊచలు లెక్క పెట్టనున్నారని మంత్రి సురేశ్ జోస్యం చెప్పారు. అలాగే బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశారని, ఒంగోలులో నిర్వహించిన మహానాడు అట్టర్ ప్లాఫ్ అయిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు.

  ఇదీ చదవండి : వల్లభనేని వంశీ యూటర్న్.. టీడీపీ గొప్ప పార్టీ అంటూ పొగడ్తలు.. కారణం అదేనా..?

  తెలుగు దేశం హయాంలో ఆ పార్టీ లీడర్లకే సంక్షేమ పథకాలు అందాయన్న విషయం ఏపీ ప్రజలందరికీ తెలుసన్నారు. అదే సీఎం జగన్ పాలన చూస్తే.. కుల, మత, పార్టీలకు అతీతంగా అందరికీ సమానంగా అభివృద్ధి పలాలు అందుతున్నాయన్నారు. అంతెందుకు తెలుగు దేశం పార్టీకి ఓటు వేసిన వారికి.. ఆ పార్టీ కార్యకర్తలకు సైతం సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. తన పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారని.. మరోసారి అతడిని తరిమికొట్టడం ఖాయమన్నారు. జగనన్న ముద్దు.. చంద్రబాబు వద్దు అన్న నినాదంతో ప్రజలంతా ముందుకు వెళ్లాలి అంటూ మంత్రులు పిలుపు ఇచ్చారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు