AP POLITICS AP MINSTER COUNTERS TELANGANA MINISTER KTR FOR CRITICIZING AP GOVERNMENT FULL DETAILS HERE PRN GNT
AP Politics: కేటీఆర్ కామెంట్స్ కు ఏపీ మంత్రుల కౌంటర్.., మళ్లీ మొదలైన మాటల యుద్ధం..
కేటీఆర్, వైఎస్ జగన్ (ఫైల్)
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తెలంగాణ (Telangana) మంత్రి కేటీఆర్ (Minster KTR) కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరెంట్ లేదు, నీళ్లులేవు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రులు తప్పుబడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తెలంగాణ (Telangana) మంత్రి కేటీఆర్ (Minster KTR) కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరెంట్ లేదు, నీళ్లులేవు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రులు తప్పుబడుతున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రులు బొత్స సత్యనాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పందించారు. ముఖ్యంగా కరెంట్ కోతలు, రోడ్ల పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. రాజకీయల కోసమే టీఆర్ఎస్ తమపై బురదజల్లుతోందని కొందరంటుంటే.. పక్కరాష్ట్రాలపై బురద జల్లి ఓట్లు వేయించుకోవాలనుకోవడం దారుణమని కొందరంటున్నారు. అసలు ఏపీ కంటే తెలంగాణలోనే పరిస్థితి బాగాలేదని రివర్స్ ఎటాక్ ఇస్తున్నారు. ఇప్పుడీ మాటల యుద్ధం ఏపీలోని ప్రతిపక్షాల విమర్శలకు మరింత ఊతమిస్తోంది.
కేటీఆర్ కామెంట్స్ పై మాట్లాడిన మంత్రి బొత్స.. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. ఏపీ కంటే హైదారాబాద్ లోనే కరెంట్ కోతలు ఎక్కువగా ఉన్నాయని.. తాను స్వయంగా హైదరాబాద్ లోనే ఉండి వస్తున్నాని.. అక్కడ కరెంటే ఉండటం లేదన్నారు. అంతేకాదు జనరేటర్ వేసుకొని వచ్చానన్నారు. కేటీఆర్కు ఎవరో ఫోన్ చేసి చెప్పారని.., కానీ తాను మాత్రం స్వయంగా అనుభవించానన్నారు. బాధ్యత కలిగిన వ్యక్తి అలా మాట్లాడటం తప్పన్న బొత్స.., తమ ఘనత ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చన్నారు.
కేటీఆర్ కామెంట్స్ పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులున్నాయని.. అందుకే అక్కడ కరెంట్ కోతలు లేవన్నారు. ఏపీలో కూడా విద్యుత్ కోతలు లేవని.. రాజకీయ ప్రయోజనాల కోసమే కేటీఆర్ అలా మాట్లాడారన్నారు. తాము బొగ్గును ఎక్కువ ధరకైనా కొనుగోలు చేసేందుకు సిద్ధమన్నారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖలోనే 10వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు నిర్మించామన్నారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు రానున్నాయని.. ఎవరో ఒకర్ని కించపరిస్తే ఓట్లు వస్తాయనే కేటీఆర్ ఏపీని విమర్శించారని పెద్దిరెడ్డి అన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కౌంటరిచ్చారు. కేసీఆర్ లాగే కేటీఆర్ కూడా పిట్టకథలు చెబుతున్నారన్నారు. కేసీఆర్ పిట్టకథలు చెప్పే రాష్ట్రాన్ని విభజించారన్నారు. విజయవాడ వచ్చి చూస్తే డెవలప్ మెంట్ కనిపిస్తుందని విష్ణు అన్నారు.
శుక్రవారం హైదరాబాద్ (Hyderabad) లో జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ పో ప్రారంభించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ (Minister KTR).. ఏపీలో పరిస్థితికి, తెలంగాణలో పరిస్థితికి ఉన్న తేడాను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. "తన మిత్రుడొకరు సంక్రాంతి సందర్భంగా ఆంధ్రాలోని సొంతూరికి వెళ్లారని అక్కడికి వెళ్లిన వెంటనే తనకు ఫోన్ చేసి.. ఇక్కడ కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమయ్యాయి. అంతా అన్యాయంగా అధ్వానంగా ఉంది.. తిరిగి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లుందంటూ.. కొంతమంది నాలుగు బస్సుల్లో ఏపీకి పంపితే తెలంగాణలో ఎంత చక్కగా ఉందో అర్థమవుతుంది" అంటూ ఆయన చెప్పినట్లు కేటీఆర్ వివరించారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.