హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Minster Botsa: పార్టీలో మనస్పర్థలుంటే కష్టమే? మంత్రి బొత్స మరోసారి సంచలన వ్యాఖ్యలు

Minster Botsa: పార్టీలో మనస్పర్థలుంటే కష్టమే? మంత్రి బొత్స మరోసారి సంచలన వ్యాఖ్యలు

మంత్రి బొత్స సత్యానారాయణ

మంత్రి బొత్స సత్యానారాయణ

Minster Botsa: ఆంధ్రప్రదేశ్ లోని ప్రస్తుతం అధికార పార్టీలో వర్గ పోరు బుసలు కొడుతోంది. మాజీ మంత్రులు.. సీనియర్ నేతలు సైతం ఈ వర్గ పోరుపై బహిరంగంగాన మండిపడుతున్నారు. సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స వ్యాఖ్యలు సైతం సంచలనంగా మారాయి.

ఇంకా చదవండి ...

Minster Botsa: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇటీవల డీఎస్సీ ఉద్యోగాలు హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంట 1998లో డీఎస్సీ అభ్యర్థులకు ఇఫ్పుడు ఉద్యోగాలు వచ్చాయి. అయితే తాజాగా ఈ పరిస్థితిపై విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1998 డీఎస్సీ అభ్యర్థులను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు. 1998 డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడేమీ పాఠాలు చెప్పగలరని, వారిని చూసి భయపడుతున్నారన్నారు. అందుకే వారికి మళ్లీ ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. విజయనగరం జిల్లాలోని చీపురపల్లి నియోజకవర్గం ప్లీనరీలో మంత్రి బొత్స ఈ కామెంట్స్ చేశారు. అలాగే ప్రతిపక్ష పార్టీల తీరు.. సొంత పార్టీలో వర్గ విబేధాలపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశఆరు. గత ఎన్నికల్లో డబ్బు ఇస్తే ఓట్లు వేస్తారని చంద్రబాబు(Chandrababu) భ్రమపడ్డారన్నారు. అలాగే తన నియోజకవర్గం స్థాయిలో పార్టీ శ్రేణుల్లో మనస్పర్థలున్నాయని, అవి పార్టీకి మంచిది కాదని బొత్స హితవు పలికారు. అయితే కొందరు నాయకులు మాత్రం.. ఎప్పటికీ తానే నాయకుడ్ని అనుకోవడం మంచిదికాదన్నారు. అదృష్టం ఉంటే ఎవరైనా నాయకుడు అవ్వొచ్చని చెప్పారు.

ఏపీలో ప్రస్తుతం సంక్షేమ పథకాలందించడంలో గ్రామ స్థాయి నాయకులు లంచాలడిగితే పార్టీకి చెడ్డపేరు వస్తోందన్నారు. కిమిడి నాగార్జున అమ్మగారు మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గానికి ఏం అభివృద్ది చేశారో చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో కొత్త నీటి బుడగలు వస్తున్నాయి.. అవి శాశ్వతం కాదంటూ వ్యాఖ్యానించారు. నియంత రాజకీయాలు వద్దని, అందరు కలసి నిర్ణయం తీసుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో చర్చకు కారణమయ్యాయి.

కిమిడి నాగార్జున వయసులో చిన్నవాడివి నియోజకవర్గంపై అవగాహన లేకుండా మాట్లాడొద్దని సూచించారు. ఇది తాను రాజకీయ విమర్శ కోసం అనటం లేదని.. అతని తల్లి మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో డెవలప్ మెంట్ ఏమైనా చేసారా అనే దానికి సమాధానం చెప్పాలన్నారు. తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవడం సమయం వృధా అని బొత్సా వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో డబ్బు ఇస్తే ఓట్లు వేస్తారని చంద్రబాబు భ్రమపడ్డారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని.. ప్రతీ ఒక్కరి సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి : సింహంతో వేట.. జగనన్నతో ఆట వద్దు.. రోజా అంటే ఫ్లవర్ కాదు ఫైర్.. పవన్, చంద్రబాబుకు వార్నింగ్

ప్రస్తుతం వైసీపీలో బొత్స వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. తన సొంత నియోజకవర్గ నేతల్లోనే విబేధాలు ఉన్నాయా..?  లేక జిల్లా నేతల తీరుపై ఆయన ఆగ్రహంతో ఉన్నారా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు డీఎస్సీ అభ్యర్థులపైన ఆయన చేసిన వ్యాఖ్యలు సైతం కలకలం రేపాయి.

First published:

Tags: Andhra Pradesh, AP News, Botsa satyanarayana

ఉత్తమ కథలు