Home /News /andhra-pradesh /

AP POLITICS AP MINSTER BOTSA SATYANARAYANA CURRENT BILL ISSUE GOES VIRAL HE GAVE CLARITY ON HIS BILL PENDING NGS

Botsa Current Bill: బొత్స కరెంట్ బిల్లు కట్టలేదా? విద్యుత్ శాఖ ఏమంటోంది? మంత్రి వివరణ ఇదే

మంత్రి బొత్స సత్యనారాయణ (ఫైల్)

మంత్రి బొత్స సత్యనారాయణ (ఫైల్)

Botsa Current Bill: హైదరబాద్ లో ఉన్న తన ఇంటికి బొత్స కరెంటు బిల్లు కట్టలేదా..? 15 నెలులుగా బిల్లు చెల్లించడం లేదన్నది వాస్తవమేనా.. దానికి సంబంధించిన ట్వీట్ ఎవరు ఎవరు చేశారు..? విద్యుత్ శాఖ ఏమంటోంది..? బొత్స వివరణ ఏంటి..?

    Botsa Current Bill: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మౌలిక వసుతులు సరిగ్గా లేవు అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ (Minster KTR) చేసిన వ్యాఖ్యల దుమారం ఆగడం లేదు. ఆయన తరువాత తన వ్యాఖ్యలపై వెనక్కు తగ్గినా.. వైసీపీ (YCP)- టీఆర్ఎస్ (TRS) నేతల మధ్య ఫైట్ కొనసాగుతోంది.  ఈ వివాదం ఇప్పడు మంత్రి బొత్స (Minster Botsa) చుట్టూ తిరుగుతోంది. ఎందుకంటే.. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బొత్స.. తాను హైదరాబాద్ (Hyderabad) లో కరెంట్ లేదని, రెండు రోజులు జనరేటర్ వేసుకుని ఉన్నానని.. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదే అని ఏపీ విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. అయితే ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ గా.. టీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి (MP Ranjith Reddy) ఘాటుగా స్పదించారు.. బొత్స సత్యనారాయణ విద్యుత్ బిల్లు కట్టలేదేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే.. బొత్స హైదారాబాద్ లో ఉన్న తన ఇంటికి 15నెలలకుగా కరెంట్ బిల్లు కట్టలేదనే వార్త తెరపైకి వచ్చింది. విద్యుత్ శాఖ పేరుతో ఓ ట్వీట్ వైరల్ అవుతూ వచ్చింది.

    ఆ వైరల్ వార్త వార్తపై తెలంగాణ దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి స్పందించారు.  మీరు కరెంటు బిల్లు క్లియర్ చేసిన వెంటనే మీ ఇంటికి కరెంటు సరఫరా చేస్తాం. 15 నెలలుగా మీరు బిల్లు చెల్లించలేదు. అందుకే కరెంట్ కట్ చేశాము”అంటూ బొత్స సత్యనారాయణకు ట్విట్టర్ వేదికగా విద్యుత్ శాఖ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారిందని.. అయితే దీనికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని తమ సంస్థ తన అధికారిక ట్డిట్టర్ లో పోస్టు చేయలేదని తాను వివరణ ఇచ్చారు. ఎవరో దుండగులు సంస్ధ పేరు మీద అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని.. ఇలా అసత్య ఆరోపణలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని రఘుమ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా అలాంటి ప్రచారాలను ఆపండి అంటూ ఆయన కోరారు. కానీ ఆయన బిల్లు కట్టారా లేదా..? అన్నదానిపై రఘుమారెడ్డిే స్పష్టత ఇవ్వలేదు. కేవలం ఆ ట్వీట్ తమ సంస్థ చేసింది కాదని మాత్రమే చెప్పారు.

    ఇదీ చదవండి : ఆమె చేసిందే పాడు పని.. అందులోనూ అతి తెలివి.. చివరకు ఊహించిన షాక్

    మరోవైపు తనపై వస్తున్న ఆరపోణలపై మంత్రి బొత్స కూడా స్పందించారు. వాస్తవానికి తెలంగాణ విద్యుత్‌ శాఖ ఆ ట్వీట్‌ చేయలేదని.. ఫేక్‌ ఐడీతో ఎవరో ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారు అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి బొత్స తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇదంతా తప్పుడు ప్రచారమని.. తాను కరెంట్‌ బిల్‌ కట్టానని.. ఫ్రూప్స్‌ చూపించారు బొత్స.

    మరి బొత్స వివరణతోనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాలి.. ఇప్టటికే తన కామెంట్లపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వెనక్కు తగ్గారు.. అయినా వైసీపీ, టీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరి కరెంటు బిల్లు ఇష్యూ ఎటు తిరుగుతుందో చూడాలి.. అయితే ఏపీలో విపక్షాలు మాత్రం మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు నిజమే కాదా అని ప్రూఫ్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Botsa satyanarayana, KTR

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు