హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Ministers: సీఎం వార్నింగ్‌తో మారిన మంత్రుల వాయిస్.. పదవి కాపాడుకోవాలంటే తప్పదుగా మరి..!

AP Ministers: సీఎం వార్నింగ్‌తో మారిన మంత్రుల వాయిస్.. పదవి కాపాడుకోవాలంటే తప్పదుగా మరి..!

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త కేబినెట్ (AP Cabinet) కొలువుదీరిన తర్వాత మంత్రుల్లో కాస్త దూకుడు తగ్గింది. గతంలో ఇద్దరు ముగ్గురు మంత్రులు ప్రతిపక్షాలపై నోరేసుకొని పడిపోయేవారు. కొందరు ఏకంగా బూతులు అందుకుంటే.. మరికొందరు డైరెక్ట్ గా కులాల పేరుతో దూషించేవారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Andhra Pradesh, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త కేబినెట్ (AP Cabinet) కొలువుదీరిన తర్వాత మంత్రుల్లో కాస్త దూకుడు తగ్గింది. గతంలో ఇద్దరు ముగ్గురు మంత్రులు ప్రతిపక్షాలపై నోరేసుకొని పడిపోయేవారు. కొందరు ఏకంగా బూతులు అందుకుంటే.. మరికొందరు డైరెక్ట్ గా కులాల పేరుతో దూషించేవారు. మరొకరైతే ఏం మాట్లాడుతున్నారో ఏం తిడుతున్నారో అర్ధంకాని రేంజ్ లో ప్రతిపక్షాలపై నోరేసుకొని పడిపోయేవారు. కానీ కొత్త మంత్రులు వచ్చిన తర్వాత ఆ జోరు తగ్గింది. మంత్రులు తమ శాఖల పనులు చక్కబెడుతున్నారా లేదా అనే సంగతి పక్కనబెడితే నోరేసుకొని పడిపోవడం మాత్రం బాగా తగ్గిపోయింది. దీంతో అమాత్యులపై సీఎం జగన్ కు చిర్రెత్తుకొచ్చింది. అందుకే ఇటీవల జరిగిన మీటింగ్ లో ఇదే టాపిక్ పై అందరికీ క్లాస్ తీసుకున్నారు. ఆయన అలా అన్నారో లేదో.. ఇలా సైలెంట్‌గా ఉండే ఓ మంత్రిగారు నోటికిపనిచెప్పారు.

  పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని అంటే మంత్రి నాగార్జున నాలుక కోస్తానంటూ ఆయన ఎదురుదాడికి దిగారు. చదువుకున్నవాడు.. సౌమ్యుడిగా పేరున్న మేరుగ నాగార్జున ఇలా ఉన్నట్లుంటి తన వైఖరికి భిన్నంగా నోటికి పనిచెప్పడంపై పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ బాగానే జరుగుతోంది. సైలెంట్ గా ఉంటే పదవి ఊడుతుందనే భయంతోనే ఆయన అలా అన్నారన్న టాక్ బాగా నడుస్తోంది.

  ఇది చదవండి: ట్రిపుల్ ఐటీలో చేరాలనుకుంటున్నారా..! ఐతే ఇలా అప్లై చేసుకోండి.. చివరి తేదీ ఇదే..!

  రీసెంట్‌గా జరిగిన మంత్రివర్గ కాస్త హాట్ గానే సాగింది. మీటింగ్ స్టార్ట్ అయిన వెంటనే బాగానే నడిచింది. పలు అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. కొన్నింటికి ఆమోదం తెలిపారు. పాలనాపరమైన అంశాలు చర్చించిన తర్వాత రాజకీయాల ప్రస్తావన వచ్చింది. ఆ సమయంలో మొదలైంది సీఎం క్లాస్. ఒక్కసారిగా ఆయన టోన్‌ మార్చడంతో మంత్రులు షాక్‌కు గురయ్యారు. జగన్‌ అండ్‌ ఫ్యామిలీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై సమావేశంలో హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. ప్రతిపక్షాల ఆరోపణలకు ఎందుకు కౌంటర్‌ ఇవ్వట్లేదంటూ మంత్రులపై ఫైర్‌ అయ్యారు సీఎం.

  ఇది చదవండి: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. వివరాలివే..!

  ప్రతిపక్ష నేతలు నా కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసినా కూడా స్పందించరా..? అంటూ గట్టిగానే నిలదీశారంట సీఎం జగన్. నిత్యం ప్రభుత్వంపై బురదజల్లుతుంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారని గట్టిగా ప్రశ్నించారు సీఎం. జగన్ ప్రశ్నలకు మంత్రులెవరూ సమాధానం చెప్పలేకపోయారట. కనీసం విపక్ష నేతల ఆరోపణలను ఖండించకపోతే మీకు పదవులెందుకని ప్రశ్నించారట.

  ఇది చదవండి: 22 గ్రామాలతో అమరావతి మున్సిపాలిటీ.. రైతుల పాదయాత్ర వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

  ఇదిలా ఉంటే కొత్త కేబినెట్‌పై సీఎం జగన్ కాస్త అసంతృప్తిగానే ఉన్నారట. ఆయన తెప్పించుకున్న రిపోర్ట్స్ ప్రకారం ఐదుగురు మంత్రులపై వేటు పడుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వారిలో ఇద్దరు మహిళా మంత్రులు కూడా ఉన్నారట. కోస్తా ప్రాంతానికి చెందిన ఓ మహిళా మంత్రికి కీలక శాఖ అప్పగించినా ఫలితం లేదని.. తన శాఖపైనే ఆరోపణలు వస్తున్నా తిప్పికొట్టడం లేదనే భావనలే సీఎం ఉన్నారట. అలాగే గత కేబినెట్ నుంచి మళ్లీ పొడిగింపు పొందిన రాయలసీమకు చెందిన మరో మంత్రిపై సానుకూలత లేదని తెలుస్తోంది.

  ఇది చదవండి: అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి.. పోలీసులకు ఆదేశాలు

  పార్టీ ఎమ్మెల్యేగా బలంగా వాయిస్ వినిపిస్తారనే నమ్మకంతో గోదావరి జిల్లాలకు చెందిన సీనియర్‌ను పక్కనబెట్టి ఆయనకు పదవి కట్టబెట్టారు. మంత్రయిన తర్వాత కూడా ఆయన పనితీరు సమర్ధవంతంగా లేదనే అభిప్రాయంతో సీఎం ఉన్నట్లు సమాచారం. సీనియర్ మంత్రిని పక్కనబెట్టుకొని మీడియా సమావేశం నిర్వహించడం ద్వారా ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే వాదని వినిపిస్తోంది.

  ఇప్పుడీ ప్రచారం మంత్రుల్లో గుబులు రేపుతోందట. అందుకే ఉన్నపళంగా ప్రతిపక్షాలపై, ఆ పార్టీ నేతలను A to Z ఉతికారేయాలని ఫిక్సయ్యారట. అందులో భాగంగానే ఇప్పుడు ఎవరు దొరికితే వారిని మైకందుకొని దుమ్ముదులపాలన్న టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే నోటికి పనిచెప్పారట. నోరేసుకొని పడితే తప్ప మంత్రి పదవికి నిలబడదని.. ఇకపై ఏ చిన్న విమర్శ వచ్చినా ఒంటికాలపై లేవాల్సిందేని అందరూ ఫిక్సైపోయారని తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో పాత మంత్రుల నోటికి ధీటుగా వాయిస్ పెంచే మినిస్టర్స్ లిస్టులో ఎవరు చేరతారో చూడాలి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP cabinet, AP Politics

  ఉత్తమ కథలు