హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Minister Viswarup: ముంబైకి ఏపీ మంత్రి విశ్వరూప్‌.. సోమవారం హార్ట్ ఆపరేషన్..

AP Minister Viswarup: ముంబైకి ఏపీ మంత్రి విశ్వరూప్‌.. సోమవారం హార్ట్ ఆపరేషన్..

Pinipe Viswarup: సెప్టెంబరు 2న అమలాపురంలో న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిలో పాల్గొన్న సందర్భంగా విశ్వరూప్ ఒక్కసారిగా అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరుగుతుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ (Pinipe Viswarup) ముంబై (Mumbai)కి వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం ఏసియన్ హార్ట్ సెంటర్‌లో అడ్మిట్ అయ్యారు. పినిపే విశ్వరూప్ వెంట ఆయన కుమారుడు కృష్ణారెడ్డి ఉన్నారు. సోమవారం రోజు తన తండ్రికి గుండె శస్త్రచికిత్స (Heart Surgery) జరుగుతుందని కృష్ణారెడ్డి తెలిపారు. సెప్టెంబరు 2న అమలాపురంలో న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిలో పాల్గొన్న సందర్భంగా విశ్వరూప్ ఒక్కసారిగా అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. రాజమహేంద్రవరంలో ప్రాథమిక చికిత్స తీసుకున్న తర్వాత.... మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయారు. ఐతే మళ్లీ ఆయన స్వల్ప అనారోగ్యానికి గురవడంతో గుండె పరీక్షలు చేశారు. అనంతరం హార్ట్ సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం ముంబై ఏసియన్ హార్ట్ సెంటర్లో అడ్మిట్ అయ్యారు.

  సెప్టెంబరు 2న వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా అమలాపురంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పట్టణంలో  వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. ఎడమ చేయి, ఎడమ దవడ లాగడంతో పాటు శరీరంలో చాలా నీరసంగా అనిపించింది. కార్యకర్తలు ఆయన్ను మొదట రాజమండ్రి (Rajahmundry)లోని  బొల్లినేని ఆస్పత్రికి తరలించారు. మంత్రి విశ్వరూప్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. నరాల సంబంధిత సమస్యతో ఆయన బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రాథమికి చికిత్స అనంతరం హైదరాబాద్‌కు పంపించారు. సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స అనంతరం.. ఇప్పుడు హార్ట్ సర్జరీ కోసం ముంబై వెళ్లారు విశ్వరూప్.

  2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత తూర్పు గోదావరి జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ తొలి కేబినెట్‌లో అవకాశం దక్కింది. అందులో పినిపె విశ్వరూప్ కూడా ఉన్నారు. ఆరు నెలల క్రిత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టగా... చాలా మంది నేతలను సీఎం జగన్ కేబినెట్ నుంచి తప్పించారు. కాని తూర్పుగోదావరి జిల్లా నుంచి మంత్రి విశ్వరూప్‌లో జగన్ మంత్రివర్గంలో కొనసాగారు. ఐతే ఆయన శాఖను మాత్రం మార్చారు. ప్రస్తుతం రవాణాశాఖ మంత్రిగా విశ్వరూప్ పనిచేస్తున్నారు. హార్ట్ సర్జరీ తర్వాత కొన్నాళ్ల పాటు విశ్రాంతి అవసరమని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Ysrcp

  ఉత్తమ కథలు